బస్సు డ్రైవర్ పై రజనీ కామెంట్స్.. మాసిన చొక్కా, ఆ గతి కూడా లేదు.. డైలాగులు కాదు అక్షర సత్యాలు

First Published | Oct 25, 2021, 8:08 PM IST

సూపర్ స్టార్ రజనీకాంత్.. తన జీవితం దైవ సంకల్పం అని, ఒక మిరాకిల్ అని ఎప్పుడూ చెబుతుంటారు. శివాజీ రావు గైక్వాడ్ అనే సాధారణ బస్సు కండక్టర్ గా ఉన్న రజనీకాంత్ .. ఇండియన్ బాక్సాఫీస్ ని ఏలే సూపర్ స్టార్ గా ఎదుగుతారని ఆయన కూడా ఊహించి ఉండరు.

సూపర్ స్టార్ రజనీకాంత్.. తన జీవితం దైవ సంకల్పం అని, ఒక మిరాకిల్ అని ఎప్పుడూ చెబుతుంటారు. శివాజీ రావు గైక్వాడ్ అనే సాధారణ బస్సు కండక్టర్ గా ఉన్న రజనీకాంత్ .. ఇండియన్ బాక్సాఫీస్ ని ఏలే సూపర్ స్టార్ గా ఎదుగుతారని ఆయన కూడా ఊహించి ఉండరు. సినీ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకునే వరకు ఆయన సినీ ప్రస్థానం కొనసాగింది.. కొనసాగుతూ ఉంది. 

నేడు Rajinikanth ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా Dadasaheb Phalke Award అందుకున్నారు. ఈ సందర్భంగా రజనీ తన గత జీవితాన్ని గుర్తు చేసుకున్నారు. రజనీ బస్సు కండక్టర్ గా పనిచేస్తున్న రోజుల్లో చాలా స్టైల్ గా టికెట్స్ ఇచ్చేవారు. తనలోని స్టైల్ ని, నటుడిని ముందుగా గుర్తించింది తన స్నేహితుడు బస్సు డ్రైవర్ రాజ్ బహదూర్ అని రజనీ గుర్తు చేసుకున్నారు. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుని రాజ్ బహదూర్ కి అంకితం ఇచ్చారు. 


ఈ సందర్భంగా మనం తప్పకుండా రజనీ, జగపతి బాబు నటించిన కథానాయకుడు చిత్రం గురించి మాట్లాడుకోవాలి. ఆ చిత్రంలో రజనీ స్కూల్ లో చెప్పే డైలాగులు.. ఆయన నిజజీవితంలో అక్షర సత్యాలు అనిపిస్తాయి. డ్రైవర్ రాజ్ బహదూర్ ముందుగా రజనీ లోని నటన నైపుణ్యాన్ని, స్టైల్ ని పసిగట్టారు. రజనీకాంత్ సినిమాల్లోకి వెళ్లేలా ప్రోత్సహించారు. అలా రజనీకాంత్ నటన వైపు అడుగులు వేశారు. కోట్లాది మంది అభిమానులకు ఆరాధ్య దైవం అయ్యారు. 

కథానాయకుడు చిత్రంలో రజనీ డైలాగులు పరోక్షంగా రాజ్ బహదూర్ గురించి చెప్పినట్లుగా ఉంటాయి. 'మీరు ఇప్పుడు చూస్తున్న అశోక్ కుమార్ వేరు.. ఒకప్పుడు అశోక్ కుమార్ వేరు. మాసిన చొక్కాతో, చిరిగిన డ్రాయర్ తో స్కూల్ కి వెళ్లిన అశోక్ కుమార్ ని నేను. బట్టలు కొనుక్కునే స్థోమత లేదు. గొడుగు కొనుక్కునే గతి లేక ఆకులు అడ్డం పెట్టుకుని వర్షంలో తడుస్తూ స్కూల్ కి వెళ్ళాను. 

ప్రతి ఒక్కరి జీవితంలో విజయం సాధించడానికి ఓ వ్యక్తి ఉంటారు. నేను పైకి రావడానికి కారణం నా స్నేహితుడు.. నా ప్రాణానికి ప్రాణం బాలకృష్ణ. మధ్యాహ్నం భోజనం లేక నీళ్లు తాగుతుంటే బాలు నాకోసం టిఫిన్ బాక్స్ తెచ్చేవాడు. నా జీవితంలో మొట్టమొదటి సినిమా వాడి డబ్బుతోనే చూశా. నాలోనూ నటుడు ఉన్నాడని ముందుగా గుర్తించింది వాడే. పెద్ద నడుటువి అవుతావురా అని నన్ను ప్రోత్సహించాడు. 

వాడి రెండు చెవిపోగులు అమ్మి నన్ను మద్రాసు పంపాడు అంటూ ఆ చిత్రంలో రజనీ ఎమోషనల్ గా డైలాగులు చెబుతాడు. ఈ డైలాగులు గమనిస్తే రజనీ రియల్ లైఫ్ తో పోలినట్లుగా ఉంటాయి. 

Latest Videos

click me!