
ట్రెండ్‌కి తగ్గట్టుగా మారాల్సి వస్తుంది. చిత్ర పరిశ్రమలో ఆ మార్పు చాలా వేగంగా ఉంటుంది. ముందుగా ఉంటుంది. అలాంటి మార్పు యాంకరింగ్‌లోనూ వస్తుంది. ఆ ట్రెండ్‌ని పట్టుకుని దూసుకుపోతుంది యాంకర్ శ్రీముఖి. యాంకరింగ్‌లో ఆమె ఇప్పుడు టాప్ పొజిషిన్‌లో రాణిస్తుంది.
బుల్లితెర రాములమ్మగా పాపులర్ అయిన శ్రీముఖి తన బొద్దు అందాలతో ఆకట్టుకుంటుంది. చలాకీతనం, చిలిపితనం ఆమె సొంతం. దీనికితోడు స్పాంటినిటీ ఆమె ప్రత్యేకత. వీటన్నింటికి తోడు అందం ఆమె స్పెషల్ ఎట్రాక్షన్. ఇవన్నీ కలగలిపి ఉండటంతో ఈ బ్యూటీ బుల్లితెరని దున్నేస్తుంది.
వరుస టీవీ షోస్ తో దూసుకుపోతున్న ఈ బొద్దుగుమ్మ ప్రతి వారం అందాల ఫోటో షూట్లతోనూ ఆకట్టుకుంటుంది. నెటిజన్లని ఎంగేజ్ చేస్తుంది. కవ్వించేపోజులతో కుర్రాళ్లని తన చుట్టూ తిప్పుకుంటుంది. చూపు తిప్పుకోలేని అందంతో మైమరపిస్తుంది. విజువల్ ట్రీట్ ఇస్తూ అలరిస్తుంది.
శ్రీముఖి గ్లామర్ ఫోటోలకు విశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమెకి లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నాయి. చాలా వరకు ఆమె అందంపై ప్రశంసలు కురిపిస్తుంటారు. ఏంజెల్‌లా భావిస్తుంటారు. గార్జియస్ అంటూ ప్రశంసిస్తుంటారు. అదే సమయంలో కొంత సెటైర్లు, నెగటివ్ కామెంట్లు కూడా ఉంటాయి. వాటిని పట్టించుకోకుండా ముందుకెళ్తుంటారు సెలబ్రిటీలు. శ్రీముఖి కూడా అంతే.
అయితే తాజాగా ఈ హాట్ యాంకర్ నయా ఫోటో షూట్ పిక్స్ ని షేర్ చేసుకుంది. బ్లూ డ్రెస్‌లో మతిపోయేలా ఉంది శ్రీముఖి. బ్లూ లాంగ్ ఫ్రాక్‌లో మెరిసిపోతుంది శ్రీముఖి. ఈ సందర్భంగా కవ్వించే పోజులిస్తూ కుర్రాళ్లకి కునుకు లేకుండా చేస్తుంది. దీంతో ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి.
దీనిపై నెటిజన్లు స్పందిస్తూ క్రేజీ కామెంట్లు చేస్తున్నారు. ఇందులో ఓ ఫోటోలో శ్రీముఖి దాగుడు మూతలు ఆడుతుంది. ఫోటోకి పోజులిచ్చేందుకు సిగ్గు పడుతున్నట్టుగా ఉంది. దీనిపై రియాక్ట్ అవుతూ, చూపించాల్సిందంతా చూపించి మధ్యలో ఈ సిగ్గులెందుకో అంటూ కామెంట్ చేస్తున్నారు.
దీంతోపాటు సోషల్ మీడియాలో చాలా వరకు లవ్ ప్రపోజల్స్ వస్తుంటాయి. తాజాగా ఈ బ్యూటీ కి పెళ్లి ప్రపోజల్స్ వస్తున్నాయి. శ్రీముఖి ఇంకా పెళ్లి చేసుకోలేదనే విషయం తెలిసిందే. దీంతో ఆమె అందానికి ముగ్దులైన కొందరు నెటిజన్లు మ్యారేజ్ ప్రపోజల్స్ పంపిస్తున్నాయి. అయితే వారి బ్యాడ్ లక్ ఏంటంటే ఈ బ్యూటీ వాటిని పట్టించుకోకపోవడం.
అయితే సామాజిక మాధ్యమాల్లో ఇలాంటివి చాలానే వస్తుంటాయి. సెలబ్రిటీలకు కామనే. శ్రీముఖి పెళ్లీడుకి రావడంతో సహజంగానే ఇలాంటి పోస్ట్ లు పెడుతుంటారు. అవన్నీ జస్ట్ ఎంటర్‌టైనింగ్‌లో భాగమనే చెప్పొచ్చు. వాటిని పట్టించుకుంటే సెలబ్రిటీలు ముందుకు వెళ్లలేరు. అందుకే చూసి చూడనట్టుగా వ్యవహరిస్తుంటారు. కెరీర్ పరంగా దూసుకెళ్తుంటారు.
ఇక శ్రీముఖి ప్రస్తుతం మూడు నాలుగు షోస్‌తో రాణిస్తుంది. యాంకర్‌గా చాలా బిజీగాఉంది. ఒకప్పుడు సుమ ఎక్కువగా షోస్ చేస్తూ బిజీగా ఉండేది. ఆమె చాలా తగ్గించింది. ఒకటి రెండు షోస్‌కే పరిమితమయ్యింది. దీంతో శ్రీముఖి ఆల్టర్ నేట్‌గా మారింది. టాక్ షోలు తప్పిస్తే మిగిలిన అన్నీ షోస్ చేస్తూ బుల్లితెరని ఊపేస్తుందీ బ్యూటీ.
బొద్దు యాంకర్ శ్రీముఖి బుల్లితెరపై తన హవా చూపిస్తుంది. ఒకప్పటి సుమ స్థానాన్ని తను కైవసం చేసుకుని దూసుకుపోతుంది. నేటి ట్రెండ్‌కి కావాల్సిన విధంగా ఉంటూ అలరిస్తుంది. ఆకర్షిస్తుంది.