Payal Rajput : పాయల్ రాజ్ పుత్ అలా చేయకుంటే.. ‘మంగళవారం’ కూడా మిస్ అయ్యేదే?

First Published | Nov 17, 2023, 4:34 PM IST

పాయల్ రాజ్ పుత్ నటించిన ‘మంగళవారం’ హిట్ టాక్ ను అందుకుంది. మౌత్ పబ్లిసిటీ బాగా జరుగుతోంది. ఆరేళ్లుగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న పంజాబీ భామకు ఈ సినిమా గొప్ప అవకాశంలా అందింది. 
 

పంజాబీ ముద్దుగుమ్మ, క్రేజీ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ (Payal Rajput)  ఆరేళ్లుగా ఇండస్ట్రీలో యాక్టివ్ గా ఉంటోంది. తెలుగు, తమిళంలో వరుస పెట్టి సినిమాలు చేస్తూ వచ్చింది. కానీ టాలీవుడ్ ఫిల్మ్ RX100 తప్పా పెద్దగా సక్సెస్ అందుకున్న సినిమాలు లేవు. 
 

‘ఆర్ ఎక్స్ 100’ చిత్రానికి ఎంతలా హిట్ అయ్యిందో తెలిసిందే. డాషింగ్ డైరెక్టర్ అజయ్ భూపతి (Ajay Bhupathi) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పాయల్ బోల్డ్ పెర్ఫామెన్స్ తో అదరగొట్టింది. దీంతో ఆమె కెరీర్ మలుపు తిరిగింది. వరుసగా ఆఫర్లు అందుకుంది. 
 


కానీ పాయల్ కు ‘ఆర్ ఎక్స్100’ తర్వాత ఆ స్థాయి హిట్ పడలేదు. గత ఐదేళ్లలో 20 సినిమాల్లో నటించినా ఫలితం లేకుండా పోయింది. మళ్లీ తన ఫేవరెట్ డైరెక్టర్ అజయ్ భూపతి కాంబోలోనే Mangalavaaram రూపంలో హిట్ అందుకుంది. అయితే ఈ సినిమా ఛాన్స్ ను కూడా పాయల్ మిస్ అయ్యేదంట.
 

రీసెంట్ ఇంటర్వ్యూలో పాయల్ మాట్లాడుతూ ఆ విషయాలను పంచుకుంది. ‘మంగళవారం’లో శైలు పాత్రకోసం 35 మందిని ఆడిషన్ చేశారంట. అంతకు ముందే అజయ్ కి కాల్ చేసి పదేపదే తనకు అవకాశం ఇవ్వాలని కోరిందంట. అయినా అజయ్ కొత్త ఫేస్ కోసం ప్రయత్నించారంట. 
 

తను ఫోన్ చేసినప్పుడు చిన్న చిన్న పాత్రలకు నిన్ను తీసుకోలేనని అజయ్ భూపతి పాయల్ తో అనేశారంట. అయినా ఈ ముద్దుగుమ్మ తనను ఎంపిక చేయాలని తరుచుగా కంటాక్ట్ అవుతూ వచ్చిందంట. అలా చివరిగా ఆడిషన్ తీసుకొని పాయల్ ను ఫైనల్ చేశారని చెప్పుకొచ్చింది. 
 

ఇక వచ్చిన అవకాశాన్ని వినియోగించుకునేందుకు.. నెలరోజుల పాటు ఆ పాత్రకు సంబంధి రీసెర్చ్ చేసి డైరెక్టర్ కు కావాల్సినట్టుగా పెర్ఫామ్ చేసిందంట. షూటింగ్ తర్వాత తన స్కిన్ టోన్, పలు గాయాలు మానడానికే 15 రోజుల సమయం పట్టినట్టు చెప్పుకొచ్చింది. అంటే పాయల్ ఎంతలా కష్టపడిందో అర్థం చేసుకోవచ్చు. 
 

‘మంగళవారం’ సినిమాకు పాజిటివ్ టాక్ దక్కింది. పాయల్ పెర్ఫామెన్స్ కు ప్రశంసలు అందుతున్నాయి. మరోవైపు అజయ్ భూపతి ఇంతవరకు ఇండియన్ ఇండస్ట్రీలోనే టచ్ చేయని పాయింట్ తో సినిమాను తెరకెక్కించడంతో ప్రేక్షకులకు ఫిదా అవుతున్నారు. తొలిరోజే థియేటర్లలో దుమ్ములేపుతోంది.
 

ఈ చిత్రంలో పాయల్ కు జోడీగా 'రంగం' ఫేమ్ అజ్మల్ అమీర్ నటించారు. అజయ్ భూపతికి చెందిన 'ఏ' క్రియేటివ్ వర్క్స్ సంస్థతో కలిసి ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై ఎం. సురేష్ వర్మతో కలిసి స్వాతి రెడ్డి గునుపాటి నిర్మించారు. ఈరోజు (నవంబర్ 17)న తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.

Latest Videos

click me!