జబర్దస్త్ యాజమాన్యానికి రూ10 లక్షలు అప్పు చేసి చెల్లించిన ముక్కు అవినాష్.. శ్రీముఖి ఆదుకోకుంటే

First Published | Jan 5, 2024, 5:26 PM IST

శ్రీముఖి ఎంత గోల చేసినా ఆమె మనసు బంగారం అని సాటి నటీనటులు అంటుంటారు. తాజాగా శ్రీముఖి మంచి మనసు మరోసారి బయట పడింది. 

బుల్లితెర యాంకర్ శ్రీముఖి గురించి చెప్పేదేముంది. గ్లామర్, చలాకీతనం ఆమెకి ఉన్న పెద్ద ప్లస్ పాయింట్స్. అందంతో కుర్రాళ్లని అట్రాక్ట్ చేస్తూనే.. స్పీకర్లు పగిలిపోయేలా గోల చేయడం ఆమె శైలి. అందుకే శ్రీముఖి పాల్గొనే షోలలో పెద్ద హంగామా ఉంటుంది. 

శ్రీముఖి ఎంత గోల చేసినా ఆమె మనసు బంగారం అని సాటి నటీనటులు అంటుంటారు. తాజాగా శ్రీముఖి మంచి మనసు మరోసారి బయట పడింది. ముక్కు అవినాష్ కి జబర్దస్త్ షో గుర్తింపు తీసుకువచ్చింది. అయితే బిగ్ బాస్ 4 లో పాల్గొన్న తర్వాత అవినాష్ కెరీర్ లో మరింత బిజీ అయ్యాడు. నాలుగు రాళ్లు వెనకేసుకుంటున్నాడు. 


కానీ అంతకు ముందు అవినాష్ కుటుంబ పరిస్థితి దయనీయంగా ఉండేదట. ఈ విషయాన్ని స్వయంగా అవినాష్ సోదరుడు అజయ్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. లాక్ డౌన్ ముందు వరకు పరిస్థితి బాగానే ఉండేది. అప్పులు ఉన్నా అన్నయ్య ఎలాగోలా ఇంటిని నడిపించేవాడు. కానీ లాక్ డౌన్ లో షూటింగ్స్ ఆగిపోయాయి. దీనితో చేతిలో చిల్లిగవ్వ లేకుండా అయిపోయింది. 

తీసుకున్న ఇంటికి, కారుకు ఈ ఎం ఐ లు కట్టలేక నోటీసులు కూడా వచ్చాయి. తిండికి కూడా కష్టం అయిపోయింది ఒక దశలో అని అవినాష్ సోదరుడు చెప్పాడు. ఒక సమయంలో తనకి ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన కూడా వచ్చినట్లు అన్నయ్య నాతో చెప్పాడు. ఆ సమయంలో బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. కానీ జబర్దస్త్ అగ్రిమెంట్ బ్రేక్ చేసి వెళ్లాల్సిన పరిస్థితి. 

దీనితో జబర్దస్త్ వారికి 10 లక్షలు చెల్లించాల్సి వచ్చింది. ఆ సమయంలో శ్రీముఖి అన్నయ్యని ఆదుకున్నారు. ఆమె రూ 5 లక్షలు ఇచ్చారు. మరో ఐదు లక్షలని చమ్మక్ చంద్ర, గెటప్ శ్రీను లాంటి వాళ్ళ దగ్గర అప్పు చేసి కట్టేశాడు. దేవుడి దయవల్ల బిగ్ బాస్ తర్వాత అన్నయ్య కెరీర్ బావుంది అని అవినాష్ సోదరుడు అజయ్ తెలిపాడు. 

లాక్ డౌన్ లోనే తన తండ్రికి, అమ్మకి అనారోగ్య సమస్యలు తలెత్తినట్లు అవినాష్ ఒక సందర్భంలో తెలిపాడు. మొత్తంగా అవినాష్ దారుణమైన పరిస్థితి అనుభవిస్తున్న సమయంలో శ్రీముఖి మంచి మనసుతో ఆదుకుంది. 

Latest Videos

click me!