శ్రీముఖి గుండె పగిలే ప్రేమ కథలు.. రహస్యం బయటపెట్టిన రాములమ్మ.. పెళ్లి చేసుకోవద్దని అభిమాని వింత కోరిక

First Published | Nov 29, 2023, 7:31 AM IST

యాంకర్‌ శ్రీముఖి.. మోస్ట్ క్రేజీ యాంకర్‌గా రాణిస్తుంది. అనసూయ వెళ్లిపోవడంతో హాట్‌, ఘాటులో ఆమె తర్వాతి స్థానాన్ని శ్రీముఖి సొంతం చేసుకుంది. అదే తరహాలో సందడి చేస్తూ ఊపేస్తుంది. 
 

శ్రీముఖి(Sreemukhi).. పెద్ద తెరపై సక్సెస్‌ కాలేదు. అడపాదడపా ప్రయత్నాలు చేసిన వర్కౌట్ కావడం లేదు. దీంతో బుల్లితెరనే నమ్ముకుంది. బుల్లితెరనే ఆమెకి లైఫ్‌ ఇచ్చింది. స్టార్ ని చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ టాప్‌ యాంకర్‌గా రాణిస్తుందంటే కారణం టీవీనే. 
 

అందాల యాంకర్‌గా, తెలివైన యాంకర్‌గా రాణిస్తుంది శ్రీముఖి(Anchor Sreemukhi). చలాకీతనంతో అందరిని అలరిస్తుంది. టీవీ షోస్‌ని రక్తికట్టిస్తుంది. దీనికితోడు తన అందం స్పెషల్‌ ఎట్రాక్షన్. దీంతో ఆమె యాంకరింగ్‌కి తిరుగేలేదని చెప్పొచ్చు. వరుస షోస్‌తో దూసుకుపోతుంది. 
 


ఇదిలా ఉంటే ఏజ్‌లో మూడు పదులు దాటి నాలుగు పదుల వైపు దూసుకెళ్తుంది శ్రీముఖి. ఇంకా పెళ్లి ఊసే ఎత్తడం లేదు. అడపాదడపా ఆమెకి టీవీ షోస్‌లో అలాంటి ప్రశ్నలు ఎదురవుతున్నా, తెలివిగా తప్పించుకుంటుంది. తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. 
 

ఇదిలా ఉంటే తాజాగా ఆమె ఫ్యాన్స్ తో ఇన్‌స్టాగ్రామ్‌ ఛానెల్‌లో శ్రీముఖి ముచ్చటించింది. ఫస్ట్ టైమ్‌ ఆమె ఇలా ఛానెల్ ద్వారా అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా శాంపుల్‌గా కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పింది. ఇందులో ప్రధానంగా ఓ సీక్రెట్‌ని బయటపెట్టింది. తనలవ్‌ సీక్రెట్ ని వెల్లడించింది. 

శ్రీముఖి.. ఇప్పటి వరకు పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఏంటో పరోక్షంగా ఆమె వెల్లడించింది. ఓ అభిమాని `మీరు ఎప్పుడైనా లవ్‌ లో ఫెయిల్‌ అయ్యారా?` అని ప్రశ్నించగా మరో ఆలోచన లేకుండా బొచ్చెడు సార్లు అంటూ సమాధానం ఇచ్చింది. హార్ట్ బ్రేక్‌ అయ్యే ప్రేమ కథలు చాలానే ఉన్నాయనే విషయాన్ని, ఇన్నాళ్లు దాచిన రహస్యాన్ని ఆమె బయటపెట్టింది.
 

ఈ క్రమంలో పెళ్లి ఎప్పుడు చేసుకుంటావనే ప్రశ్నలు ఎదురయ్యాయి. అయితే వాటిని సమాధానం చెప్పకుండా తెలివిగా తప్పించుకుంది శ్రీముఖి. అదే పెళ్లి గురించి చెప్పమంటే మాత్రం దాని గురించి చెప్పడానికి టైమ్‌ సరిపోదు, ఎంతైనా చెప్పొచ్చు అని వెల్లడించింది. 
 

ఇక మరో అభిమాని ఆ ఆసక్తికర షాకింగ్‌ ప్రశ్నని సందేహించాడు. `మీరు పెళ్లి అయితే యాంకరింగ్‌ మానేస్తారా? అని ప్రశ్నిస్తూనే మీరు ఎప్పటికీ పెళ్లి చేసుకోవద్దని ఆ దేవుడిని కోరుకుంటున్నా అంటూ కామెంట్‌ పెట్టాడు. పెళ్లిచేసుకుంటే యాంకరింగ్‌ మానేస్తుందేమో అని, ఆమెని ఎక్కడ మిస్‌ అవుతామో  అనే ఉద్దేశ్యంలో ఆ అభిమాని ప్రశ్నించాడు. 
 

దీనికి శ్రీముఖి స్పందిస్తూ.. పెళ్లి అనేది జీవితంలో భాగం అని చెప్పింది. పెళ్లి చేసుకుంటాననే విషయాన్ని ఆమె చెప్పకనే చెప్పింది. అయితే పెళ్లికి, యాంకరింగ్‌కి సంబంధం లేదని, యాంకరింగ్‌ కొనసాగిస్తానని బుల్లితెర రాములమ్మ స్పష్టంచేసింది. ఇలా కొంత మంది అభిమానులకు ఆమె క్రేజీగా సమాధానాలు ఇచ్చింది. ఎంత వరకు చదువుకున్నారంటే కొంత వరకుఅంటూ ఫన్నీగా సమాధానం చెప్పింది. 
 

ప్రస్తుతం శ్రీముఖి నాలుగైదు షోస్‌కి యాంకరింగ్‌ చేస్తూ బిజీగా ఉంది. అందులో `స్టార్ మా పరివార్‌`, `మిస్టర్ అండ్‌ మిసెస్`, `సారంగ ధరియా`, అలాగే `కామెడీ స్టాక్ ఎక్స్ ఛేంజ్‌` షోలకు యాంకరింగ్‌ చేస్తూ రాణిస్తుంది. అదే సమయంలో ప్రతి వారం తన గ్లామర్‌ ఫోటోలతో నెటిజన్లకి విజువల్‌ ట్రీట్‌ ఇస్తుందీ సెక్సీ యాంకర్‌. 

Latest Videos

click me!