Sreeleela: ఆ సినిమా చూశాక డిప్రెషన్‌లోకి వెళ్లిపోయా.. శ్రీలీల ఓపెన్ కామెంట్స్!

Published : Nov 22, 2026, 02:10 PM IST

Sreeleela: అమరన్ సినిమా చూసిన తర్వాత తాను తీవ్రమైన డిప్రెషన్‌కు గురయ్యానని నటి శ్రీలీల చెప్పారు. అసలు ఆమె ఎందుకు అలా అన్నారో తెలుసా? ఆ సినిమాకు శ్రీలీల ఎందుకు అంతలా కనెక్ట్ అయ్యింది. ఇప్పుడు వివరంగా చూద్దాం.

PREV
14
హీరోయిన్‌గా దూసుకుపోతున్న శ్రీలీల

సౌత్ ఇండియాలో బిజీ హీరోయిన్‌గా రాణిస్తోంది శ్రీలీల. అమరన్ సినిమా గురించి రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో ఆమె చెప్పిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చైల్డ్ ఆర్టిస్ట్‌గా పరిచయమైన శ్రీలీల.. ఇప్పుడు సౌత్ ఇండియాలోనే టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. ఆమె నటిస్తున్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి హిట్స్ కొడుతూ ఫ్యాన్స్ మనసు గెలుచుకుంటున్నాయి.

24
తెలుగులో స్టార్ హీరోల సరసన..

తెలుగులో స్టార్ హీరోల సరసన మెరిసింది శ్రీలీల. మాస్ మహారాజ్ రవితేజ, సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి పెద్ద పెద్ద హీరోతో నటించి మెప్పించింది. ఇటు తమిళంలో కూడా వరుస సినిమాలు చేస్తోంది శ్రీలీల. ఈ ఏడాది వచ్చిన పరాశక్తి సినిమాతో తమిళ ఇండస్ట్రీకి హీరోయిన్‌గా పరిచయమైంది శ్రీలీల. సినిమా అనుకున్నంత హిట్ కాలేదు కానీ, ఆమె యాక్టింగ్ మాత్రం అందరికీ నచ్చేసింది. దీంతో కోలీవుడ్‌లో మరిన్ని అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం ధనుష్ హీరోగా వస్తున్న 'ఓ.ఎం. ఆపరేషన్ మోల్' సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా చేస్తోంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న ఆమె, రీసెంట్‌గా ఇచ్చిన ఇంటర్వ్యూ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

34
అమరన్ చూసి చాలా ఫీల్ అయ్యాను

రాజ్‌కుమార్ పెరియసామి డైరెక్ట్ చేసిన 'అమరన్' సినిమా గురించి ఇంటర్వ్యూలో మాట్లాడింది శ్రీలీల. ఈ సినిమా చూశాక తాను ఎంత బాధపడిందో చెప్పుకొచ్చింది. సినిమా చూసిన తర్వాత తనకు తీవ్రమైన డిప్రెషన్ వచ్చిందట. అసలు ఏం చెప్పాలో అర్థం కాలేదట. ఆ సినిమా ఇచ్చిన అనుభవం చాలా బరువైనదని, ఆ నొప్పిని మాటల్లో చెప్పలేనని ఆమె అంది.

44
వైరల్ అవుతున్న శ్రీలీల ఇంటర్వ్యూ

సాధారణంగా ఏదైనా సినిమా చూస్తే ఆ ఎఫెక్ట్ కొద్దిసేపు ఉంటుంది. కానీ, అమరన్ సినిమా నా ఊహకు మించి చాలాసేపు మనసులో ఉండిపోయిందని చెప్పింది. అసలు అదే టీమ్‌తో కలిసి పని చేస్తానని ఎప్పుడూ కలలో కూడా అనుకోలేదట. శ్రీలీల ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండగా, అమరన్ సినిమా ఆమెపై ఎలాంటి ప్రభావం చూపించిందో ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories