అల్లు అర్జున్ తో సినిమాకు నో చెప్పిన శ్రీలీల...వైరల్ న్యూస్ లో నిజమెంత...?

First Published | Jul 28, 2023, 7:21 PM IST

టాలీవుడ్ లో మెరుపులు మెరిపిస్తుంది యంగ్ అండ్ డైనమిక్ హీరోయిన్ శ్రీలీల. వరుస సినిమాలదో దూసుకుపోతోంది. స్టార్ హీరోల సినిమాల్లో సందడి చేస్తోంది. ఫుల్ బిజీ బిజీగా ఉంది.

ఒకే ఒక్క సనిమాతో ఆడియన్స్ మనసు దోచుకుంది హీరోయిన్ శ్రీలీల. ఆతరువాత వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో వరుస సక్సెస్ లు అందుకుంటుంది బ్యూటీ. అలా అరడజను సినిమాలకు పైగా తన ఖాతాలో వేసుకుంది బ్యూటీ.  తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్నటువంటి స్టార్ హీరోయిన్ల స్థాయికి చేరింది శ్రీలీలా. 
 

ధమాకా సినిమాలో రవితేజ ఎనర్జీకి ఎదురువెళ్ళి.. ఆయనతో పాటు పోటీగా డాన్స్ వేయడంతో పాటు.. నటించి మెప్పించింది బ్యూటీ.  సినిమా తర్వాత ఎదురులేని హీరోయిన్ గా మారింది. తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా తమిళ, కన్నడ ఇండస్ట్రీలో వరుసగా సినిమాలకు సైన్ చేస్తోంది బ్యూటీ. 


తాజాగా శ్రీలీల ఓ హాలీవుడ్ మూవీ కూడా చేయబోతున్నట్టు తెలుస్తోంది.  ఈమె చెన్నై స్టోరీ అని ఇంగ్లీష్ సినిమాలో నటించబోతుందని టాక్. అంతే కాదు మరో ఏడాది వరకు  శ్రీలీల బిజీ బిజీగా గడబపబోతుందట.. ఆమె డేట్స్  ఏడాదివరకూ దొరికే అవకాశం లేదని సమాచారం. దాంతో కొన్ని అవకాశాలు కూదా కోల్పోతుందట బ్యూటీ.  తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె చేతిలో దాదాపు ఏడు సినిమాలు ఉన్నాయి. దాదాపు అందరు టాలీవుడ్ బడా హీరోల సరసన శ్రీలీల నటిస్తోంది. 
 

ఈక్రమంలో శ్రీలీల  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమాకి  నో చెప్పిందన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  అల్లు అర్జున్ పుష్ప సినిమాతో సూపర్ సక్సెస్ తో పాటు..పాన్ ఇండియా ఇమేజ్ కూడా సాధించాడు. ప్రస్తుతం పుష్ప సినిమాకు సీక్వెల్ రూపొందిస్తున్నారు.పుష్ప 2 గా రూపొందుతున్న ఈ సినిమాలో శ్రీలీలను స్పెషల్ సాంగ్ లో తీసుకోవాలని సుకుమార్ భావించారట. 

భారీ రెమ్యూనరేషపన్ కూడా ఆఫర్ చేస్తూ.. ఇందుకోసం శ్రీలీలను సంప్రదించగా.. ఆమె నో చెప్పారని సమాచారం. సోలో హీరోయిన్ గా దుమ్ము దులుపుతున్న శ్రీలీల స్పెషల్ సాంగ్స్ చేయాలని ప్రస్తుతం అనుకోవడం లేదట. మరో వైపు డేట్స్ కూడా లేకపోవడంతో నో చెప్పిందని అంటున్నారు. నిజానికి టాలీవుడ్ లో అల్లు అర్జున్ పక్కన ఎప్పుడు అవకాశం వస్తుందా అని చూస్తుంటారు. ఈ వార్తలో నిజం ఎంత ఉందో తెలియదు కాని.. శ్రీలీల నిజంగా బన్నీ సినిమాను రిజక్ట్ చేసిందేమో అని అంతా ఆశ్చర్యపోతున్నారు. 
 

Latest Videos

click me!