బాలీవుడ్ లోకి కీర్తి సురేష్? ఆ స్టార్ సరసన వెన్నెల.. ఆ ఇద్దరి స్టార్స్ పైనా మహానటి కామెంట్స్

First Published | Jul 28, 2023, 7:12 PM IST

మహానటి కీర్తి సురేష్ త్వరలో బాలీవుడ్ కు ఎంట్రీ ఇవ్వబోతోంది. యంగ్ స్టార్ సరసన నటించే ఛాన్స్ దక్కించుకుంది. ప్రముఖ దర్శకుడు ఆ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నారు. ఇందుకు సంబంధించిన డిటేయిల్స్ చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. 
 

తమిళ బ్యూటీ కీర్తి సురేష్ (Keerthy Suresh)  బాల నటిగా కెరీర్ ప్రారంభించింది. మలయాళం చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా మెప్పించింది. మలయాళంలోనే ‘గీతాంజలి’ చిత్రంతో నటిగా అలరించింది. ఆ తర్వాత తమిళం, తెలుగు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. 
 

కొన్నాళ్లు కోలీవుడ్ లో సందడి చేసి.. టాలీవుడ్ లోకి ‘నేను లోకల్’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘మహానటి’తో జాతీయ స్థాయి అవార్డును సొంతం చేసుకుంది. దాంతో వరుసగా తెలుగు సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. ఓ వెలుగు వెలిగింది.  ఇటీవల ఈ ముద్దుగుమ్మ కెరీర్ మళ్లీ జోరందుకుంది. 
 


చివరిగా తెలుగులో ’దసరా’ చిత్రంతో అలరించింది. మంచి సక్సెస్ ను అందుకుంది. నెక్ట్స్ మెగాస్టార్ ‘భోళా శంకర్’లో కీలక పాత్రలో అలరించబోతోంది. ఆగస్టు 11న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం కీర్తి సురేష్ చేతిలో అన్ని తమిళ చిత్రాలే ఉన్నాయి. ప్రస్తుతం నాలుగు సినిమాలు కోలీవుడ్ లో రూపుదిద్దుకుంటున్నాయి. 
 

ఈ క్రమంలో తాజాగా క్రేజీ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇన్నాళ్లు శాండల్ వుడ్, కోలీవుడ్, టాలీవుడ్ లో సందడి చేసిన కీర్తి సురేష్.. ఇకపై బాలీవుడ్ సందడి చేయబోతోంది. బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఇండస్ట్రీలో న్యూస్ వైరల్ గా మారింది. 
 

బాలీవుడ్ యంగ్ అండ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ (Varun Dhawan)  సరసన కీర్తి నటించబోతున్నట్టు తెలుస్తోంది. రీసెంట్ గా వరుణ్ ధావన్ ‘బావల్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆయన నెక్ట్స్ 18వ చిత్రం ఆల్మోస్ట్ చర్చలు పూర్తి చేసుకుందని తెలుస్తోంది. క్రేజీ డైరెక్టర్ అట్లీ డైరెక్ట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. కథానాయికగా కీర్తి ఎంపికైందని చేస్తోంది. 
 

ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూ లో కీర్తి తన మనస్సులోని మాటను బయటపెట్టింది. తన కెరీర్ ముగిసే వరకైనా బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్, స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలీ కాంబినేషన్ లో వర్క్ చేయాలని ఉందంటూ కామెంట్స్ చేసినట్టు తెలుస్తోంది. దీంతో మున్ముందు కీర్తి బాలీవుడ్ లో వరుస సినిమాలు చేయబోతున్నట్టు అర్థమవుతోంది. 

Latest Videos

click me!