బాడీ షేమింగ్‌ కామెంట్లని బయటపెట్టిన రజనీ హీరోయిన్‌.. కిందకు లాగేందుకు ప్రయత్నించారంటూ ఆవేదన..

Published : Jul 28, 2023, 05:52 PM IST

సోషల్‌ మీడియా ప్రభావంతో ట్రోల్స్ ఎక్కువైపోయాయి. ప్రతిదానిపై విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా ఇందులో బలయ్యేది సెలబ్రిటీలు. సినిమా హీరోయిన్లు ప్రధానంగా ఈ సమస్యని ఫేస్‌ చేస్తుంటారు. నటి హ్యూమా ఖురేషి కూడా ఇది ఎదుర్కొందట.   

PREV
16
బాడీ షేమింగ్‌ కామెంట్లని బయటపెట్టిన రజనీ హీరోయిన్‌.. కిందకు లాగేందుకు ప్రయత్నించారంటూ ఆవేదన..

నేడు పుట్టిన రోజు జరుపుకుంటుంది హ్యూమా ఖురేషి. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఆమె చెప్పిన విషయం హాట్‌ టాపిక్ అవుతుంది. తాను తాను బాడీ షేమింగ్‌ కామెంట్లని ఎదుర్కొన్నట్టు తెలిపింది. తన బరువుపై కామెంట్‌ చేశారని, బాడీ షేమింగ్‌ కామెంట్లని ఎదుర్కొన్నట్టు చెప్పింది హ్యూమా ఖురేషి. 
 

26

ఓ బాలీవుడ్‌ సినిమాల సమయంలో ఓ రివ్యూయర్.. తన నటన గురించి పక్కన పెట్టి తన బాడీ గురించి కామెంట్‌ చేశారని తెలిపింది. అది తనని చాలా బాధించిందని పేర్కొంది. సినిమా నచ్చకపోతే, తన నటన నచ్చకపోతే నో ప్రాబ్లమ్‌ కానీ, కొందరు వ్యక్తిగతంగా ట్రోల్స్ చేస్తున్నారని పేర్కొంది హ్యూమా. ఇది తనకు చాలా సార్లు ఎదురయ్యిందట. ఈ సందర్భంగా ఆమె చెబుతూ, ఓ సారి నా మూవీ రిలీజైన తర్వాత ఓ రివ్యూయర్‌.. నా బరువు గురించి రాశాడు, హీరోయిన్లకి ఉండాల్సిన బరువు కంటే ఐదు కేజీలు ఎక్కువుందని పేర్కొన్నారు. 

36

దీంతో నాలో ఏదైనా లోపం ఉందా అనే అనుమానం కలిగింది. ఇంకా చెప్పాలంటే వాళ్లు రివ్యూలాగా రాయలేదు, వ్యక్తిగతంగా టార్గెట్‌ చేసి మరీ రాశారు. మమ్మల్ని కిందకు లాగేలా ఆ రివ్యూ ఉండటం ఆశ్చర్యపరిచింది. ఇలాంటి సంఘటనలు చాలా చూశా` అని పేర్కొంటూ ఆవేదన వ్యక్తం చేసింది హ్యూమా ఖురేషి. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 

46

బొద్దుగుమ్మగా పాపులర్‌ అయ్యింది హ్యూమా ఖురేషి.. మత్తెక్కించే అందం ఆమె సొంతం. `గ్యాంగ్స్ ఆఫ్‌ వస్సేపూర్` చిత్రంతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత డిఫరెంట్ మూవీస్‌ చేసుకుంటూ వచ్చింది. కమర్షియల్‌ చిత్రాల కంటే కంటెంట్‌ ఓరియెంటెడ్‌ మూవీస్‌ చేసింది. ఈ క్రమంలో బోల్డ్ రోల్స్ కూడా చేసింది హ్యూమా. దీంతో తనకంటూ ఓ ఫ్యాన్‌ బేస్‌ని ఏర్పాటు చేసుకుంది. 
 

56

ఈ భామ తమిళంలో రజనీకాంత్‌తో `కాలా` చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. లవ్ ఇంట్రెస్ట్ గా ఆకట్టుకుంది. సినిమాలో గ్లామర్‌ టచ్‌ ఇచ్చింది. `వాలిమై` లోనూ మెరిసింది. తన భారీ అందాలతో రక్తికట్టించింది. మరోవైపు బాలీవుడ్‌లో `డీ డే`, `బద్లాపూర్‌`, `హైవే`, `జాలీ ఎల్‌ఎల్‌బీ 2`, `దొబారా`, `బెల్‌ బాటమ్‌`, `డబుల్‌ ఎక్స్ ఎల్‌`, `మోనికా`, `టార్లా` వంటి చిత్రాలు చేసింది. `ఆర్మీ ఆఫ్‌ ది డెడ్‌` వంటి ఇంగ్లీష్‌ ఫిల్మ్స్ కూడా చేసింది హ్యూమా ఖురేషి. 

66

ఢిల్లీకి చెందిన ఈ బ్యూటీ నేడుశుక్రవారం తన పుట్టిన రోజుని జరుపుకుంటుంది. నేటితో ఆమె 37ఏళ్లు పూర్తి చేసుకుంది. బాలీవుడ్‌లో అటు సినిమాలతోపాటు ఇటు ఓటీటీ ఫిల్మ్స్, వెబ్‌సిరీస్‌లు కూడా చేస్తూ రాణిస్తుంది. గ్లామర్‌ ట్రీట్‌లో హద్దులు చెరిపేస్తూ నెటిజన్లకి ఫుల్‌ ట్రీట్‌ ఇచ్చిందీ హాట్‌ హీరోయిన్‌. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories