ఇప్పటి వరకు శ్రీలీలా వెండితెరపై ‘పెళ్లి సందD’, ‘ధమకా’ వంటి చిత్రాలతో అలరించింది. ఈ రెండు చిత్రాల్లోని తన టాలెంట్ కే టాలీవుడ్ లో భారీ ఆఫర్లు దక్కుతున్నాయి. ఒక తెలుగు హీరోయిన్ గా శ్రీలీలాకు ఏకంగా పది ప్రాజెక్ట్స్ లో అవకాశం దక్కడం గొప్ప విషయమే. ఇక ‘గుంటూరు కారం’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తదితర చిత్రాల్లోనూ నటిస్తోంది.