హాఫ్‌ నాలెడ్జ్‌ క్వశ్చన్స్ అంటూ..తమన్నా చిందులు, మీడియా పై మండిపడిన మిల్క్ బ్యూటీ.

First Published | Oct 12, 2023, 12:06 PM IST

మీడియాపై మండిపడింది మిల్క్ బ్యూటీ తమన్నా. అన్ని హాఫ్ నాలెడ్జ్ ప్రశ్నలేస్తున్నారంటూ ఫైర్ అయ్యింది. ఇంతకీ తమ్ము బేబీకి కోపం ఎందుకు వచ్చింది. ఆమెకు ఎదురయిన ప్రశ్నలేంటి..? 
 

అటు బాలీవుడ్.. ఇటు సౌత్.. వరుస సినిమాలతో మంచి ఫామ్ ను మెయింటేన్ చేస్తోంది మిల్క్ బ్యూటీ తమన్నా. మూడు పదులు వయస్సు దాటినా కూడా ఏమాత్రం జోరు  తగ్గకుండా ఫిట్ నెస్ తో పాటు గ్లామర్ ను కూడా మెయింటేన్ చేస్తూ.. హీరోయిన్ గానే కెరీర్ ను కొనసాగిస్తోంది. 
 

అటు సినిమాలు.. ఇటు సోషల్ మీడియాతో పాటు.. మరో వైపు కమర్షియల్ యాడ్స్.. ఇంకోవైపు తన బిజినెస్ లతో చేతినిండా సంపాదిస్తూ.. బిజీ బిజీగా గడిపేస్తోంది. ఏమాత్రం గ్యాప్ లేకుండా తన పని తాను చేసుకుంటూ పోతోంది బ్యూటీ.  అంతే కాదు అందాల ఆరబోతలో కూడా తనకు తానే సాటి అనిపించుకుంటుంది బ్యూటీ. 


ఇక సోషల్ మీడియాలో తమన్నా రచ్చ అంతా ఇంతా కాదు. ఆమె చేసే ఫోటో షూట్లకు.. రెస్పాన్స్ మామూలుగా ఉండదు.. తమన్నా పోస్ట్ చేసే గ్లామర్ ఫోటోలకు యూత్ ఫిదా అయిపోతున్నారు. నెటిజన్లు. సొగసులతో కవ్వించడంలో తనకు తానే సాటి అనిపించుకుంది బ్యూటీ. ప్రస్తుతం బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో రిలేషన్ లో ఉంది. త్వరలో వీరు పెళ్ళి కూడా చేసుకుంటారని తెలుస్తోంది. 
 

ఈక్రమంలో మిల్కీబ్యూటీ తమన్నాకు కోపం వచ్చింది.., మీడియాపై గట్టిగా చిందులేసింది. ఇవేం ప్రశ్నలంటూ.. అంతెత్తు లేచింది. రీసెంట్‌గా ఓ ఇంటర్‌వ్యూలో తమన్నాకు వింత ప్రశ్నలు ఎదురయ్యాయి. ఓ విలేకరి ప్రశ్నిస్తూ.. కెరీర్‌ తొలినాళ్లలో పద్ధతిగానే ఉండేవారు. కానీ ఈ మధ్య మీలో బోల్డ్‌నెస్‌ ఎక్కువైంది. తగ్గిన అవకాశాలు పెంచుకోటానికేనా ఈ తిప్పలు అని ముఖం మీదనే అడిగేశాడు.. దాంతో తమన్నకు చిర్రెత్తుకొచ్చింది. 
 

మిల్క్ బ్యూటీకి ఆ ప్రశ్న వినేసరికి  ఎక్కడలేని కోపం వచ్చేసింది. వెంటనే సమాధానం చెపుతూ.. తోచింది రాసినంత తేలిగ్గాదు యాక్టింగ్‌. అయినా నాకు అవకాశాలు తగ్గాయని ఎవరు చెప్పారు... మీరు చూశారా..? నేను రోజుకి 18గంటలు పనిచేస్తున్నా. అంతే కాదు అసలు మాట చెప్పాలంటే.. ఒకప్పటికంటే.. ఇప్పుడే ఎక్కువ  బిజీగా ఉన్నాను. నాకు అవకాశాలు లేవు అని మీరు ఎందుకు బాధపడుతున్నారు అని కౌంటర్ ఇచ్చింది. అంతటితో వదిలేయలేదు.. 

Photo Courtesy: Instagram

బోల్డ్ నెస్ విషయంలో కూడా ఇచ్చిపడేసింది బ్యూటీ.. నా పరిధి నాకు తెలుసు. ప్రవర్తన, వేషధారణ అనేవి పాత్ర డిమాండ్‌ని బట్టి ఉంటాయి. కేరక్టర్‌ నచ్చితేనే చేస్తాను. ఒప్పుకున్న తర్వాత పూర్తి న్యాయం చేయడం నటిగా నా ధర్మం. హాఫ్‌ నాలెడ్జ్‌ ప్రశ్నలడగొద్దు ప్లీజ్‌..అంటూ సీరియస్‌గా సమాధానచ్చింది తమన్నా. 
 

ఇక ఇంత సీరియస్ గా ఉన్నప్పుడు మరొక మిత్రుడు పెళ్లెప్పుడు అని అడిగేసరికి.. ముభావంగా నాకు చేసుకోవాలనిపించినప్పుడు’ అంటూ  సమాధానమిచ్చేసింది మల్కీబ్యూటీ.హీరోయిన్ గా ఏమాత్రం తగ్గేది లేదంటోంది తమన్నా.. ఈమధ్యనే ఆమె మెగాస్టార్ చిరంజీవి జోడీగా భోళా శంకర్ సినిమాలో నటించి మెప్పించింది. ఆయనతో తమన్నా నటించిన రెండో సినిమా ఇది. గతంలో సైరా నరసింహారెడ్డిలో కూడా జోడీగా చేసింది తమన్నా. 
 

Tamannah Bhatia

సూపర్ స్టార్ రజనీకాంత్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ జైలర్ లో కూడా తమన్నా మెరిసింది.  ఈసినిమాలో నువ్ కావాలయ్యా అంటూ.. తమన్న ఆరబోసిన అందాలు అందరికి తెలిసిందే. ఈపాట ఎంత ఫేమస్ అయ్యిందో కూడా తెలిసిందే. ఇలా తన మార్క్ సినిమాలతో తమన్నా తగ్గేదే లేదంటుంది. అటు స్పెషల్ సాంగ్ చేసినా కూడా గట్టిగా డిమాండ్ చేస్తుందట బ్యూటీ. 

Latest Videos

click me!