నడుము వొంపులు చూపిస్తూ హాఫ్‌ శారీలో పిచ్చెక్కిస్తున్న శ్రీలీల.. స్టేజ్‌పై `ఐ డోంట్‌ కేర్‌` అంటూ వార్నింగ్‌..

Aithagoni Raju | Updated : Oct 24 2023, 01:40 PM IST
Google News Follow Us

శ్రీలీల కన్నడ నుంచి వచ్చినా ఇప్పుడు తెలుగమ్మాయి అయిపోయింది. తెలుగు మూలాలు ఉన్నా అమ్మాయి కావడంతో టాలీవుడ్‌ మేకర్స్ ఆమెని ఆదరిస్తున్నారు. ఏ ఇతర తెలుగు హీరోయిన్లకి సాధ్యం కాని విధంగా శ్రీలీలని ఎంకరేజ్‌ చేస్తుండటం విశేషం. 
 

110
నడుము వొంపులు చూపిస్తూ హాఫ్‌ శారీలో పిచ్చెక్కిస్తున్న శ్రీలీల..  స్టేజ్‌పై `ఐ డోంట్‌ కేర్‌` అంటూ వార్నింగ్‌..

శ్రీలీల(Sreeleela).. ఇప్పుడు `భగవంత్‌ కేసరి`(Bhagavanth Kesari) చిత్రంలో నటించింది. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలకృష్ణ హీరోగా నటించారు. ఈ చిత్రం మిశ్రమ స్పందన రాబట్టుకుంది. యావరేజ్‌ కలెక్షన్లతో రన్‌ అవుతుంది. ఇందులో శ్రీలీల బాలయ్యకి కూతురు పాత్రలో కనిపించింది.
 

210

తాజాగా హైదరాబాద్‌లో సక్సెస్‌ సెలబ్రేషన్‌ నిర్వహించారు. ఇందులో శ్రీలీల ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సినిమాలో బాలయ్య చెప్పినట్టు `బ్రో ఐ డోంట్ కేర్‌` అనే డైలాగ్‌ని వాడింది. తనని లాంటి పాత్రలు చేయోద్దని డిస్కరేజ్‌ చేసిన వాళ్లకి బ్రో ఐ డోంట్‌ కేర్‌ అని చెప్పింది. 

310

తనని కిందకి లాగే వారికి, తనని కామెంట్‌ చేసే వారికి ఐ డోంట్‌ కేర్‌ అంటూ వార్నింగ్‌ ఇచ్చింది. అలాంటి వారిని పట్టించుకోవద్దని చెప్పింది. తనని ఎంతో మంది డిస్కరేజ్‌ చేసినట్టు చెప్పింది శ్రీలీల.
 

Related Articles

410

అంతేకాదు సినిమాలో ఉన్నట్టు ఆడపిల్ల అంటే లేడీ పిల్ల కాదు, పులి పిల్ల అని చాటి చెప్పింది. ఈ సందర్భంగా తనకు ఆడపిల్లగా పుట్టినందుకు గర్వంగా ఉందని, చాలా గర్వపడుతున్నట్టు చెప్పింది శ్రీలీల. 
 

510

మరోవైపు బాలయ్యపై ప్రశంసలు కురిపించింది. తనని బాగా చూసుకున్నారని, బాగా ఎంకరేజ్‌ చేశారని, తనకు రియల్‌ లైఫ్‌లోనూ చిచ్చాలా వ్యవహరించారని, ఇకపై కూడా తనని చిచ్చాలాగే భావిస్తున్నట్టు తెలిపింది శ్రీలీల. 

610

`భగవంత్‌ కేసరి` సక్సెస్‌ సెలబ్రేషన్‌ ఈవెంట్‌లో హైలైట్‌గా నిలిచింది శ్రీలీల. ఆమె లెహంగా వోణిలో మెరిసింది. గ్రీన్‌ లెహంగా, రెడ్‌ వోణి ధరించి హోయలు పోయింది. కెమెరాకి పోజులిస్తూ ఆకట్టుకుంది. 
 

710

ఇందులో వోణి దాయలేని నడుము అందాలను ఆవిష్కరించింది శ్రీలీల. నడుము వొంపులు చూపిస్తూ మత్తెక్కిస్తుంది. చిలిపి పోజులు, కవ్వించే అందాలతో దసరా ట్రీట్‌ ఇచ్చిందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ బ్యూటీ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

810

`భగవంత్‌ కేసరి` సక్సెస్‌ సెలబ్రేషన్‌ ఈవెంట్‌లో ఈ బ్యూటీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అందరి చూపులు తనవైపు తిప్పుకుంది. ఈవెంట్‌కే కళని నిలిచి, కలర్‌ ఫుల్‌గా మార్చింది.
 

910

ఇక శ్రీలీల టాలీవుడ్‌లో బిజీ హీరోయిన్‌ అయ్యింది. ఇండస్ట్రీలోకి వచ్చిన రెండేళ్లలోనే ఆమె టాప్‌ స్టార్‌గా మారింది. ప్రస్తుతం మరే హీరోయిన్‌కి సాధ్యం కాని విధంగా వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. 
 

1010

ఇప్పుడు శ్రీలీల చేతిలో ఏకంగా పది సినిమాలుండటం విశేషం. మహేష్‌బాబుతో `గుంటూరు కారం`, పవన్‌ కళ్యాణ్‌తో `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌`, అలాగే నితిన్‌తో `ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్‌`, వైష్ణవ్‌ తేజ్‌తో `ఆది కేశవ`తోపాటు రవితేజతో ఓ సినిమా చేస్తుంది. విజయ్‌ దేవరకొండతోనూ సినిమా చేస్తుంది. కానీ ఇందులో నుంచి తప్పుకుందట.  
 

About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Recommended Photos