టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల గురించి స్పెషల్ గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లో వరస సినిమాలతో దూసుకుపోతోంది. ఇప్పుడు కాస్త జోరు తగ్గింది కానీ.. గతేడాది వరకు శ్రీలీల అంత బిజీగా మరో హీరోయిన్ ఎవరూ లేరనే చెప్పాలి. ఒకరిద్దరు తప్ప.. టాలీవుడ్ లో అందరు స్టార్ హీరోల పక్కన ఆడి పాడింది. అయితే.. ఆమె నటించిన సినిమాలు పెద్దగా ఆకట్టుకోకపోవడంతే.. శ్రీలీల స్పీడ్ కి బ్రేక్ పడింది.
ప్రస్తుతం శ్రీలీల చేతిలో పెద్దగా సినిమాలు ఏమీ లేకపోయినా.. వార్తల్లో మాత్రం నిలుస్తూనే ఉంది. కొత్తగా శ్రీలీల ప్రేమలో పడింది అంటూ వార్తలు రావడం మొదలయ్యాయి. అది కూడా టీమ్ ఇండియా క్రికెటర్ తిలక్ వర్మతో పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతోందని.. త్వరలోనే వీరి పెళ్లి అంటూ వార్తలు కూడా వచ్చాయి.
23
ఈ వార్తలు రావడం వెనక కారణం...
వైకుంఠ ఏకాదశి రోజున శ్రీలీల తన తల్లితో కలిసి తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్లింది. అదే రోజున టీమ్ ఇండియా క్రికెటర్ తిలక్ వర్మ కూడా తిరుమల వెళ్లడం విశేషం. దీంతో.. ఇద్దరూ కలిసే గుడికి వెళ్లారంటూ వార్తలు రావడం మొదలయ్యాయి.
దీనికి తోడు.. వాంఖడే స్టేడియంలో జరిగిన ఓ ఐపీఎల్ మ్యాచ్ తర్వాత.. ఈ వార్తలకు మరింత బలం చేకూరాయి. ఈ ఐపీఎల్ మ్యాచ్ కి శ్రీలీల తల్లి వెళ్లారు. ఆ సమయంలో ఆమె... ముంబయి ఇండియన్స్ టీమ్ కుటుంబ సభ్యులు కూర్చొన్న వీఐపీ స్టాండ్స్ శ్రీలీల తల్లి స్వర్ణలత కూర్చొన్నారు. దీంతో.. శ్రీలీల తిలక్ తో రిలేషన్ లో ఉండటం వల్లే వాళ్ల అమ్మ ఈ మ్యాచ్ కి వెళ్లారంటూ సోషల్ మీడియాలో వార్తలు ఊపందుకున్నాయి.
33
శ్రీలీల తల్లి రియాక్షన్...
కాగా, ఈ పుకార్ల పై తాజాగా శ్రీలల తల్లి స్వర్ణ లత స్పందించారు. ఇవన్నీ పుకార్లేనని.. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదు అని ప్రకటించారు. వాస్తవాలు తెలుసుకోకుండా.. సోషల్ మీడియాలో ఇలాంటి పుకార్లు సృష్టిస్తున్నారని ఆమె అభిప్రాయపడ్డారు. శ్రీలీల ప్రస్తుతం సినిమాలు, చదువు రెండింటినీ బ్యాలెన్స్ చేస్తోందని ఆమె స్పష్టం చేశారు. రీసెంట్ గా డాక్టర్ పట్టా అందుకున్న శ్రీలీల...పీజీ చేయడంపై ఫోకస్ పెట్టినట్లు సమాచారం.
ఇదిలా ఉండగా, గతంలో కూడా శ్రీలీల ప్రేమ విషయంలో పుకార్లు వినిపించాయి. బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ తో డేటింగ్ చేస్తోందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా తిలక్ వర్మతో ప్రేమ అంటూ వార్తలు రావడం విశేషం.