Peddi Movie: పెద్దికి హిట్ టాక్ వస్తే ముందు లేచిపోయే రికార్డ్ ఏది.. పుష్ప 2 ? ధురంధర్ 2?

Published : May 18, 2026, 02:00 PM IST

Peddi Movie: రాంచరణ్ నటించిన పెద్ది మూవీ జూన్ 4న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో పెద్ది చిత్రం సృష్టించే రికార్డులపై ఇప్పటినుంచే అంచనాలు మొదలయ్యాయి. 

PREV
15
రాంచరణ్ పెద్ది మూవీ

మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన పెద్ది మూవీ హంగామా మొదలైంది. ముంబై లో నేడు సోమవారం రోజు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరగబోతోంది. దీనితో రాంచరణ్ కి సంబంధించిన అంశాలు, పెద్ది విశేషాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పెద్ది చిత్రం ట్విట్టర్ లో ట్రెండ్ అవుతోంది. జూన్ 4న వరల్డ్ వైడ్ గా పెద్ది చిత్రం గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.

25
బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది చిత్రం

బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. పెద్ది మూవీపై కనీ వినీ ఎరుగని అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం రాంచరణ్ కెరీర్ లోనే బెస్ట్ మూవీగా నిలుస్తుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. హై వోల్టేజ్ యాక్షన్, ఎమోషనల్ సీన్స్ తో బుచ్చిబాబు ఈ చిత్రాన్ని రూపొందించారట. క్లైమాక్స్ నెవర్ బిఫోర్ అనిపించే విధంగా ఉంటుంది అని అంటున్నారు.

35
రిలీజ్ కి ముందే లీక్

ట్రైలర్ ని ఆల్రెడీ మీడియాకి, సెలెబ్రెటీలకు ప్రదర్శించారు. చిరంజీవి ట్రైలర్ లోని డైలాగ్ ని కూడా లీక్ చేశారు. 'మీరందరూ నేను ఆడానని అనుకుంటున్నారు.. నేను పోరాడాను సారు' అనే డైలాగ్ ని చిరంజీవి లీక్ చేశారు. దీనిని బట్టే అర్థం అవుతోంది చరణ్ పాత్రలో ఎంత ఎమోషనల్ డెప్త్, పవర్ ఉందో అని.

45
పెద్ది కలెక్షన్స్ లో రికార్డులు సృష్టిస్తుందా ?

పెద్ది సినిమాకు కనుక సూపర్ హిట్ టాక్ వస్తే పాన్ ఇండియా స్థాయిలో కలెక్షన్ల సునామీ ఖాయం అని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు. అభిమానుల్లో ఇంకాస్త భారీగా అంచనాలు ఉన్నాయి. పెద్ది చిత్రం తప్పకుండా పుష్ప 2, ధురంధర్ 2 లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ సినిమాల రికార్డులని తుడిచేట్టేస్తుంది అని భావిస్తున్నారు.

55
పుష్ప 2, ధురంధర్ 2 తో పోటీ

పుష్ప 2 చిత్రం వరల్డ్ వైడ్ గా 1600 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ధురంధర్ 2 ఐతే ఏకంగా 1800 కోట్లు రాబట్టింది. ఈ రెండూ సీక్వెల్ చిత్రాలు. వీటికి మొదటి భాగం అడ్వాంటేజ్ ఉంది కాబట్టి ఆ స్థాయిలో కలెక్షన్ రాబట్టాయి. కానీ పెద్ది మూవీకి సీక్వెల్ లేదు. సింగిల్ మూవీగా రిలీజ్ అవుతోంది. అలాంటప్పుడు పుష్ప 2, ధురంధర్ 2 లాంటి చిత్రాలని మించి వసూళ్లు రాబట్టడం అంత ఈజీ కాదు అని మరి కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories