పూజా హెగ్డేకి `జింతాకా.. జింతాక` చేస్తున్న శ్రీలీల.. ఒక్కటి కాదు ఏకంగా మూడు కొట్టుకుపోయిందిగా?

Published : Jun 21, 2023, 08:11 PM IST

బుట్టబొమ్మ పూజాహెగ్డే.. గతేడాది వరకు నెంబర్‌ వన్‌ స్టార్‌ హీరోయిన్‌. లక్కీ ఛార్మ్ గానూ మారింది. కానీ ఒక్కసారిగా పరిస్థితి తలకిందులయ్యింది. ఆమెని వరుసగా బ్యాక్‌ లక్‌ వెంటాడుతుంది. తెరవెనుక ఏం జరుగుతుంది. 

PREV
16
పూజా హెగ్డేకి `జింతాకా.. జింతాక` చేస్తున్న శ్రీలీల.. ఒక్కటి కాదు ఏకంగా మూడు కొట్టుకుపోయిందిగా?

పూజా హెగ్డే(Pooja Hegde).. అందానికి అందం, తెలివికి తెలివి. అందుకే తక్కువ కాలంలోనే స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. ప్రారంభంలో రెండుమూడేళ్లు కాస్త ఇబ్బంది పడ్డా ఆ తర్వాత పుంజుకుంది. వరుస విజయాలు అందుకుని స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. ఆమె ఒకానొక దశలో నెంబర్‌ 1 హీరోయిన్‌గా మారడం విశేషం. వరుస విజయాలు ఆమెది గోల్డెన్‌ లెగ్‌గా మార్చాయి. కానీ ఈ భామని గతేడాది నుంచి బ్యాడ్‌ లక్ వెంటాడుతుంది. ఆమె నటించిన సినిమాలన్నీ పరాజయం చెందడంతో క్రేజ్‌ తగ్గిపోయింది. మేకర్స్ ఆల్టర్‌ నేట్‌ వైపు చూస్తున్నారు. దీంతో వరుసగా ఆఫర్లని కోల్పోతుంది పూజా. 
 

26

మహేష్‌బాబు, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వస్తోన్న `గుంటూరు కారం`(Guntur Kaaram) చిత్రంలో పూజా హెగ్డే ఫస్ట్ హీరోయిన్‌. అనూహ్యంగా సెకండ్‌ హీరోయిన్‌గా శ్రీలీల(Sreeleela) వచ్చింది. దీంతో పూజా హెగ్డే పాత్ర ప్రయారిటీ తగ్గిందట. ఈ విషయంలో హర్ట్ అయిన పూజా.. ఈ సినిమా నుంచి తప్పుకుందని సమాచారం. ఇందులో దర్శకుడు త్రివిక్రమ్‌పై ఉన్న కొంత అసహనం కూడా కారణమని తెలుస్తుంది. ఈ ప్రాజెక్ట్ నుంచి పూజా తప్పుకోవడంతో సంయుక్త మీనన్‌(Samyuktha Menon)ని తీసుకుంటున్నారని సమాచారం. ఎలాగూ సంయుక్తని త్రివిక్రమ్‌(Trivikram) ఎంకరేజ్‌ చేస్తున్న విషయంతెలిసిందే. ఇది కూడా పూజా తప్పుకోవడానికి మరో కారణం అని టాక్‌.
 

36

మరోవైపు పవన్‌ కళ్యాణ్‌, హరీష్‌ శంకర్‌ కాంబోలో వస్తోన్న `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌`(Ustaad Bhagat Singh)లో కూడా మొదట పూజా హెగ్డేనే హీరోయిన్‌. రెండేళ్ల క్రితమే దర్శకుడు హరీష్‌ ఓ ఈవెంట్లో ప్రకటించారు. కానీ ఇటీవల సినిమా ప్రారంభమయ్యే నాటికి మరో హీరోయిన్‌గా శ్రీలీల ఎంటర్‌ అయ్యింది. సెకండ్‌ ఫీమేల్ లీడ్‌గా శ్రీలీలని తీసుకున్నారు. ఇందులోనూ పూజా హెగ్డే పాత్రకి పెద్దగా ప్రయారిటీ లేదట. దీంతో అంతగా ప్రాముఖ్యత లేని పాత్రని చేయనని పూజా తప్పుకుందని అంటున్నారు. ఇలా ఈ రెండు సినిమాలను పూజా వదులుకుంది. దానికి కారణం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో శ్రీలీలనే అనే టాక్‌ వినిపిస్తుంది. 
 

46

ఇప్పుడు మరో సినిమా విషయంలోనూ పూజా హెగ్డేకి శ్రీలీల పోటీగా వస్తుందటం గమనార్హం. ప్రస్తుతం సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా సంపత్‌ నంది ఓ సినిమాని తెరకెక్కించబోతున్నారు. ఇందులో హీరోయిన్‌ కోసం పూజా హెగ్డే, శ్రీలీల పేర్లని పరిశీలిస్తున్నారట. ఇద్దరితోనూ చర్చలు జరుపుతున్నారట. ఇందులో ఎవరు ఫైనల్‌ అవుతారనేది సస్పెన్స్ నెలకొంది. అందుతున్న సమాచారం మేరకు శ్రీలీలకే ఛాన్స్ ఎక్కువగా ఉందని అంటున్నారు. ఇదే నిజమైతే మూడో సారి శ్రీలీల రూపంలో పూజాకి దెబ్బ పడబోతుందని చెప్పొచ్చు. దీంతో ఇప్పుడు పూజా పరిస్థితి `ధమాఖా`లో `జింతాక జింతాక..` లా మారిపోతుందని నెటిజన్లు అంటున్నారు. 

56

ఇదిలా ఉంటే ప్రస్తుతం శ్రీలీల జోరు నడుస్తుంది. ఆమె డాన్సులు, చలాకీతనం, సినిమా ఇండస్ట్రీలో కొంత బ్యాక్‌ సపోర్ట్ కారణంగా ఆమెకి అవకాశాలొస్తున్నాయి. ఆడియెన్స్ కూడా ఆమెని ఇష్టపడుతున్న నేపథ్యంలో ఫామ్‌ లో ఉన్న బ్యూటీకే మేకర్స్ ఓటేస్తుంటారు. అలా శ్రీలీలకి ఎక్కువగా ఛాన్స్ లిస్తున్నారు. మరోవైపు పూజా హెగ్డేకి ఇటీవల వరుస పరాజయాలు ఎదురు కావడంతో ఆ ఎఫెక్ట్ ఆమెపై ఉంది. సక్సెస్‌ చుట్టే ఇండస్ట్రీ తిరుగుతుంది కాబట్టి, పూజాకి కొంత ఇబ్బందిగా మారింది. 
 

66

దీనికితోడు పూజా హెగ్డే కొత్త సినిమాల విషయంలో కొంత కేరింగ్‌తో ఉంటుందట. అలా వచ్చి, ఇలా పోయే పాత్రలకు ఆమె నో చెబుతుందని అంటున్నారు. తన పాత్రకి కూడా కొంత ప్రయారిటీ ఉండేలా చూసుకుంటుందట. ఈ క్రమంలోనే ఆమె పైన పేర్కొన్న సినిమాల నుంచి తప్పుకొందని సమాచారం. అంతేకాడు విజయ్‌ దేవరకొండ, పరశురామ్‌ చిత్రంలోనూ మొదట పూజా పేరే వినిపించింది. కానీ పాత్ర నచ్చక వదులుకుందట. ఆ స్థానంలో మృణాల్‌ ఠాకూర్‌ చేరిపోయింది. బలమైన పాత్రల కోసం, మంచి కంటెంట్‌ కోసం బుట్టబొమ్మ చూస్తుందని సమాచారం. మరి నిజమేంటనేది వారికే తెలియాలి. కానీ కుర్ర భామల ప్రభావం సీనియర్లపై ఉంటుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories