ఢీ షో రెండు తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన టాలెంట్ ఉన్న డాన్సర్లని వెలికితీసే ప్రోగ్రామ్. ఈ సారి నాలుగు టీమ్‌ల మధ్య పోటీగా ఈ షోని నిర్వహించబోతున్నారు. హైదరాబాద్, వరంగల్, విజయవాడ, నెల్లూరు ల నుంచి నాలుగు టీమ్‌లు చేశారు. వీరిలో `హైదరాబాద్ ఉస్తాద్స్`, `బెజవాడ టైగర్స్`, `నెల్లూరు నెరజాణలు`, `ఓరుగల్లు వీరులు` లుగా ఈ నాలుగు టీమ్‌లు డాన్సు షోలో రచ్చ చేయబోతున్నారు.