ఎన్టీఆర్ నుంచి పవన్ కళ్యాణ్ వరకు వెండితెరపై కృష్ణుడి పాత్రలు చేసిన హీరోలు ఎవరెవరంటే?

Published : Aug 16, 2025, 08:18 AM IST

ద్వాపరయుగంలో విష్ణువు అవతారంగా భూమికి వచ్చి, భగవద్గీతను బోధించిన కృష్ణుడి ప్రభావం, పౌరాణిక పాత్ర రూపంలో తెలుగు సినిమా రంగంపై కూడా చూపించింది. ఎన్టీఆర్ నుండి పవన్ కళ్యాణ్ వరకూ  తెలుగు హీరోలు శ్రీకృష్ణుడిగా వెండితెరపై కనిపించి ప్రేక్షకులను అలరించారు. 

PREV
17

యుగపురుషుడు ఎన్టీఆర్ 

తెలుగు తెరపై శ్రీకృష్ణుడి పాత్ర చెప్పగానే ముందుగా గుర్తొచ్చేది మహానటుడు ఎన్.టి. రామారావు. 'శ్రీకృష్ణ పాండవీయం', 'మాయాబజార్', 'దానవీర శూరకర్ణ' వంటి పౌరాణిక చిత్రాల్లో ఎన్టీఆర్ పోషించిన కృష్ణుడి పాత్రలు శాశ్వతంగా నిలిచిపోయాయి. ఇప్పటికీ శ్రీకృష్ణుడంటే తెలుగు ప్రజలకు ఆ తారకరాముడే గుర్తుకువస్తాడు. కృష్ణావతారంలో ఆయన్ను చూసిన జనాలు నిజంగా ఆ దేవుడే దిగివచ్చినంత సంబరపడిపోతుంటారు. ఈ పాత్రలో ఆయన్ను మించి చేయగలవారు ఇంకా పుట్టలేదనే చెప్పాలి.

DID YOU KNOW ?
కృష్ణుడిగా శ్రీదేవి
కృష్ణుడి పాత్రల్లో అతిలోకసుందరి శ్రీదేవి కూడా నటించారు. యశోదకృష్ణ సినిమాలో బాలకృష్ణుడిగా ఆమె నటనకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
27

ఎన్టీఆర్ తరువాత ఆయనే

ఎన్టీఆర్ సమకాలీకుడైన ఏఎన్నార్ పూర్తిగా శ్రీకృష్ణుడిగా నటించకపోయినా, గోవుల గోపన్న సినిమాలో ఒక పాటలో కృష్ణ వేషంలో కనిపించారు. ఇక కాంతారావు కూడా పౌరాణిక సినిమాల్లో ప్రముఖ పాత్రధారి. పాండవ వనవాసం, నర్తనశాల వంటి చిత్రాల్లో ఆయన కృష్ణుడిగా కనిపించి మెప్పించారు.

37

శోభన్ బాబు

తెలుగుతెరపై శ్రీకృష్ణుడిగా మెప్పించిన హీరోల్లో శోభన్ బాబు ఒకరు. శోభన్ బాబు బాపు దర్శకత్వంలో వచ్చిన బుద్ధిమంతుడులో మొదటిసారిగా కృష్ణుడిగా కనిపించిన సోగ్గాడు. ఆతరువాత కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో తెరెక్కిన ‘కురుక్షేత్రం’ మూవీలో పూర్తి స్థాయిలో శ్రీకృష్ణుడిగా కనిపించారు. సూపర్ స్టార్ కృష్ణ బాపు దర్శకత్వంలో వచ్చిన సాక్షి సినిమాలో కొద్ది సేపు శ్రీకృష్ణుడిగా కనిపించారు.

47

రాజేంద్రప్రసాద్

రాజేంద్రప్రసాద్ కన్నయ్య కిట్టయ్య సినిమాలో కృష్ణుడిగా, భక్తుడిగా ద్విపాత్రాభినయం చేసి ప్రశంసలు అందుకున్నారు. రేలంగి నరసింహారావు డైరెక్షన్ల వచ్చిన ఈ సినిమాలో... రాజేంద్రప్రసాద్ నటనకు మంచి రెస్పాన్స్ వచ్చింది. శ్రీకృష్ణుడి పాత్రకు సరిగ్గా సరిపోయాడు నటకిరీటి.

57

బాలకృష్ణ

నందమూరి బాలకృష్ణ తన తండ్రి మాదిరిగానే పౌరాణిక చిత్రాల్లో నటించి మెప్పించారు. ఇక ప్రస్తుతం పక్కా మాస్ సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్న నందమూరి నట సింహం బాలకృష్ణ రెండు సినిమాల్లో కృష్ణుడి పాత్రలోనటించాడు. శ్రీకృష్ణార్జున విజయం, పాండురంగడు వంటి చిత్రాల్లో కృష్ణుడిగా కనిపించాడు బాలయ్య.

67

పవన్ కళ్యాణ్ - నాగార్జున 

నాగార్జున కృష్ణార్జున సినిమాలో శ్రీకృష్ణుడిగా కనిపించారు. ఈ పాత్రలో నెమలి పించం, కిరీటాల కోణం లేకుండానే కామన్ మెన్ తరహాలో కనిపించడం విశేషం.

అటు పవన్ కళ్యాణ్ గోపాల గోపాల సినిమాలో కామన్ మెన్‌గా ఉన్న శ్రీకృష్ణుడిగా కనిపించారు. ఇందులో ఆయన వెంకటేష్ తో కలిసి చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. ఈ పాత్రలో పవన్ అద్భుతంగా కనిపించారు. కృష్ణుడిగా ఆయన నటనకి మంచి స్పందన వచ్చింది.

77

వెండితెర కృష్ణుడు

మహేశ్ బాబు యువరాజు సినిమాలో ఒక పాటలో శ్రీకృష్ణుడిగా కనిపించగా, హరికృష్ణ శ్రీకృష్ణావతారం అనే చిత్రంలో బాలకృష్ణుడిగా తన అరంగేట్రం చేశారు.కృష్ణుడి పాత్రల్లో విజయ నిర్మల (పాండురంగ మహత్యం) , శ్రీదేవి (యశోదకృష్ణ) నటించిన చిత్రాలు ప్రత్యేక గుర్తింపు పొందాయి.ఈ విధంగా తెలుగు సినీ చరిత్రలో శ్రీకృష్ణుడిగా అలరించిన నటులు ఎంతోమంది ఉన్నారు. వారి పాత్రలు తరం తరాలుగా ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories