స్త్రీశక్తి పేరుతో మహిళలకు ఏపీ ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన సంగతి తెలిసిందే. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఉచిత బస్సు పథకాన్ని సీఎం చంద్రబాబు విజయవాడలో ప్రారంభించారు. రాష్ట్రం మొత్తం ఉచిత బస్సు పథకం అమలవుతోంది. నందమూరి బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.
25
హిందూపురంలో బస్సు నడిపిన బాలయ్య
బాలయ్య హిందూపురంలో స్త్రీ శక్తి పథకం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. అలాగే స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో కూడా పాల్గొన్నారు. స్త్రీ శక్తి పథకంలో భాగంగా బాలయ్య హిందూపురంలో స్వయంగా ఆర్టీసీ బస్సు నడిపారు. ఎంతో హుషారుగా బాలయ్య బస్సుని డ్రైవ్ చేశారు.
35
బాగా నడుపుతున్నానా ?
హిందూపురం బస్ స్టేషన్ నుంచి చాముండేశ్వరి కాలనీ మీదుగా బాలయ్య తన నివాసం వరకు బస్సుని డ్రైవ్ చేశారు. బాలయ్య బస్సు నడుపుతుండగా ఫ్యాన్స్ కేరింతలు కొట్టారు. బాలయ్య బస్సు నడుపుతూ బాగా నడుపుతున్నానా అని ఫ్యాన్స్ ని అడిగారు. దీనితో అభిమానులు సూపర్ గా డ్రైవ్ చేస్తున్నారు. డ్రైవర్ రాముడు, లారీ డ్రైవర్ అంటూ ఎన్టీఆర్, బాలకృష్ణ సినిమా టైటిల్స్ తో కేరింతలు కొట్టారు. డ్రైవర్ రాముడు చిత్రంలో ఎన్టీఆర్, లారీ డ్రైవర్ చిత్రంలో బాలయ్య డ్రైవర్లుగా నటించారు.
బాలయ్య బస్సు నడుపుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాలకృష్ణ 2014 నుంచి హిందూపురంకి ఎమ్మెల్యే గా ఎన్నికవుతున్నారు. 2024 ఎన్నికల్లో కూడా విజయం సాధించి హ్యాట్రిక్ సాధించారు.
55
బాలయ్య సినిమాలు
సినిమాల విషయానికి వస్తే బాలయ్య ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2 చిత్రంలో నటిస్తున్నారు. అదే విధంగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరో చిత్రం ప్రారంభం కానుంది. వీటితో పాటు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలోమరోసారి నటించేందుకు బాలయ్య సిద్ధం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరి కాంబినేషన్ లో గతంలో గౌతమీపుత్ర శాతకర్ణి, ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాలు వచ్చాయి.