#SSMB29:మహేష్ , రాజమౌళి చిత్రంపై రానా ఇంట్రస్టింగ్ కామెంట్స్

First Published | Nov 21, 2024, 9:15 AM IST

 ఇంతకుముందు ఇండియన్‌ సినిమా అంటే వేరే దేశాల వారికి హిందీ చిత్రాలే తెలుసు. ఇతర భాషల్లోనూ ఉంటాయనే సంగతి తెలియదు. ఇప్పుడు మన సినిమాల గురించి మాట్లాడుకుంటున్నారు. 

Rana Daggubati, Mahesh Babu, Rajamouli Film

మహేశ్‌బాబు (Mahesh Babu)హీరోగా రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో ఓ భారీ ప్రాజెక్ట్‌ రూపొందనున్న విషయం తెలిసిందే. SSMB 29గా ఇది ప్రచారంలో ఉంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి.   ఈ కాంబో మూవీ ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా? అని మూవీ లవర్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా కోసం ఇప్పటికే లుక్ మార్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాపై రానా ఇంట్రస్టింగ్  కామెంట్స్‌ చేశారు. ఏమన్నారంటే?
 

Rajamouli, Mahesh babu,varanasi


మహేశ్‌ బాబు (Mahesh Babu)- రాజమౌళి (SS Rajamouli) కాంబినేషన్‌లో రూపొందనున్న సినిమా (#SSMB 29)పై రానా (Rana Daggubati) ఇంట్రస్టింగ్ కామెంట్స్  చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... ‘‘ఆ చిత్రం అన్ని బారియర్స్‌ను బ్రేక్‌ చేస్తుంది. హాలీవుడ్‌ సినిమా అమెరికాలో ఎలా రిలీజ్‌ అవుతుందో ఆ మూవీ కూడా ఆ రేంజ్‌లో విడుదల కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.

తప్పకుండా అది జరుగుతుంది. ఇంతకుముందు ఇండియన్‌ సినిమా అంటే వేరే దేశాల వారికి హిందీ చిత్రాలే తెలుసు. ఇతర భాషల్లోనూ ఉంటాయనే సంగతి తెలియదు. ఇప్పుడు మన సినిమాల గురించి మాట్లాడుకుంటున్నారు. ఓటీటీలతో సినిమాల పరంగా భాష పరిధులు తొలగాయి. పెద్ద సినిమాలే కాదు.. మన స్థానిక కథలతో రూపొందిన ఇండిపెండెంట్ చిత్రాలనూ చూసేందుకు ప్రపంచం సిద్ధంగా ఉంది’’ అని అన్నారు.


ఈ చిత్రంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో ఉన్న జంతువుల కంటే ఎక్కువ జంతువులు ఉంటాయని రాజమౌళి ఓ ఈవెంట్‌లో తెలిపారు. అమెజాన్‌ అడవుల నేపథ్యంలో సాగే ఈ కథలో పలువురు విదేశీ నటులు (ssmb29 cast) కనిపించనున్నారు. భారతీయ భాషలతో పాటు, విదేశీ భాషల్లోనూ దీనిని అనువదించనున్నారు. ఈ చిత్రానికి ‘గరుడ’ అనే టైటిల్‌ కూడా పరిశీలనలో ఉంది.

Rajamouli, mahesh babu,AI


ఆర్ఆర్ఆర్ (RRR) లాంటి గ్లోబల్ హిట్ తరువాత రాజమౌళి నుండి వస్తున్న సినిమా కావడం, అది కూడా సూపర్ స్థార్ మహేష్ బాబుతో అవడంతో ఈ సినిమాపై ఓ రేంజిలో ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి.  ఈ దాంతో ఈ సినిమా ఎప్పుడు లాంచ్ కాబోతోంది,  ఎలా ఉండబోతోంది. అసలు కథ ఎలా సాగనుంది, ప్రస్తుతం సినిమా ఏ స్టేజిలో ఉంది, ఎప్పుడు మొదలు కావచ్చు వంటి విషయాలు సోషల్ మీడియాలో డిస్కషన్ గా మారాయి.  


ఈ సినిమా గ్లోబల్  అడ్వెంచర్ థ్రిల్లర్ . ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో ఈ సినిమా షూటింగ్ నిర్వహించనున్నారు. ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ ను జర్మనీలో స్టార్ట్ చేయనున్నట్టు  సమాచారం. ఇప్పటికే, అందుకు తగ్గ ఏర్పాట్లు పూర్తి చేసారని తెలుస్తోంది. ఇక మహేశ్ బాబు తన లుక్ ను తనదైన మేకోవర్ లో కనిపించేలా రెడీ  అవుతున్నాడు. ఇంతకు ముందు ఎప్పుడూ కనపడని రీతిలో ఇందులో మహేష్ బాబు కనిపిస్తారు. 
 


అలాగే ఈ సినిమా పీరియడ్ డ్రామా అని, 18 శతాబ్దంలో జరిగే కథ అని తెలుస్తోంది. అలాగే ఈ సినిమాలో కథ ఎక్కువ భాగం అడవుల్లో జరుగుతుందని, ఫారెస్ట్ ఎడ్వెంచర్ అని చెప్తున్నారు. ఈ సినిమాలో అరుదైన గిరిజన జాతికి సంభందించిన రిఫరెన్స్ లు ఉండబోతున్నాయని, ఆ మేరకు టీమ్ స్కెచ్ వేయిస్తోందని త్వరలోనే ఫైనలైజ్ చేసి కాస్ట్టూమ్స్ డిజైన్ చేయించబోతున్నారు.  ఇందుకోసం వందలాది  జూనియర్స్ కి ట్రైనింగ్ ఇచ్చి షూట్ ప్రారంభానికి ముందే వారి లుక్స్ ఏమిటనేది లాక్ చేయబోతున్నారు.

Latest Videos

click me!