స్కంద, బ్రో, గాంఢీవధారి అర్జున’, ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’, `ఎల్‌జీఎం`.. ఈరోజు మూవీ అప్డేట్స్ అదిరిపోయాయిగా..

First Published | Jul 31, 2023, 10:15 PM IST

ప్రేక్షకులు ఎదురుస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్స్ నుంచి ఈరోజు అదిరిపోయే అప్డేట్స్ అందాయి. స్కంద, గాంఢీవ ధారి అర్జున్, ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్, పద పద, బ్రో, ఎల్ జీఎం వంటి మూవీస్ నుంచి సూపర్ అప్డేట్స్ ఇచ్చారు. 
 

పవన్ కళ్యాణ్ - సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన చిత్రం ‘బ్రో : ది అవతార్’. జూలై 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హిట్ టాక్ ను అందుకుంది. బాక్సాఫీస్ వద్ద కలెక్లన్లను రాబడుతోంది. సినిమా సక్సెస్ టాక్ ను అందుకోవడంతో మేకర్స్ ‘బ్రో - విజయ్ యాత్ర’ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఇక ఆగస్టు 1న యాత్ర సాగనుంది. విజయవాడలోని కనకదుర్గ టెంపుల్ లో 9 గంటలకు ప్రారంభమై.. 12 గంటలకు తెనాలిలోని సంగమేశ్వర థియేటర్, 1:30కి గుంటూరులోని సర్వస్తి థియేటర్, 4 :30కి విజయవాడలోని జైరామ్ థియేటర్, 6 గంటలకు పీవీపీ మాల్ ను సందర్శించనున్నారు. అభిమానులు ఈ యాత్రను విజయవంతం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమాకు సముద్రఖని దర్శకత్వం వహించారు. ప్రియా వారియర్, కేతికా శర్మ హీరోయిన్లు గా అలరించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. 
 

ఉస్కాద్ రామ్ పోతినేని - బోయపాటి శ్రీనివాస్ కాంబోలో రూపుదిద్దుకుంటున్న మాస్ యాక్షన్ ఫిల్మ్ ‘స్కంద’ (Skanda) . శ్రీలీలా జంటగా నటిస్తోంది. శ్రీనివాస్ సిల్వర్ స్క్రీన్, జీ స్టూడియో బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈమూవీ నుంచి ఇప్పటికే ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అందాయి. ఈరోజు బ్యూటీఫుల్ సాంగ్ ‘నీ చుట్టు చుట్టు’ ప్రోమో విడుదలపై అప్డేట్ ఇచ్చారు. రేపు ఉదయం 10:26కు ప్రోమో రానుంది. ఫుల్ సాంగ్ ఆగస్టు 3న ఫుల్ లిరికల్ సాంగ్ రానుంది. ఇక చిత్రం సెప్టెంబర్ 15న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతోంది. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నారు. 
 


హీరో నితిన్ ‘ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్’ సినిమాను  రచయిత వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. శ్రేష్ట మూవీస్ బ్యానర్ పై రూపుదిద్దుకుంటోంది. శ్రీలీలా హీరోయిన్. ఈ ఏడాది డిసెంబర్ 23న గ్రాండ్ గా థియేటర్లలో విడుదల కానుంది. ఇక ఇప్పటికే ఫస్ట్ సింగిల్ పై అప్టేట్ ఇవ్వగా.. ఈరోజు ఆ సాంగ్ కు సంబంధించిన ప్రొమోను విడుదల చేశారు. ‘డేంజర్ పిల్లా’ టైటిల్ తో రాబోయే ఈ సాంగ్ ఫుల్ వెర్షన్ ఆగస్టు 2న రానుంది. హరీశ్ జయరాజ్ సంగీతం అందిస్తున్నారు. 
 

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ హీరోగా న‌టిస్తోన్న హై వోల్టేజ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ‘గాంఢీవధారి అర్జున’. స్టైలిష్ ఫిల్మ్ మేకర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్నారు. సాక్షి వైద్య హీరోయిన్‌. ఈ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా ఆగ‌స్ట్ 25న భారీ రేంజ్‌లో విడుద‌ల చేస్తున్నారు నిర్మాత‌లు. రీసెంట్‌గా ‘గాంఢీవధారి అర్జున’ సినిమా నుంచి టీజ‌ర్‌ను విడుద‌ల చేయ‌గా..అప్ప‌టికే ఉన్న అంచ‌నాల‌ను ఇది రెట్టింపు చేసింది. తాజాగా మేక‌ర్స్ ఈ సినిమా నుంచి ‘నీ జతై...’ అనే రొమాంటిక్ సాంగ్‌ను విడుద‌ల చేశారు. వ‌రుణ్ తేజ్‌, సాక్షి వైద్య‌ల మ‌ధ్య సాగే పాట ఇది. మిక్కీ జె.మేయ‌ర్ సంగీత సార‌థ్యంలో వ‌స్తోన్న ‘గాంఢీవధారి అర్జున’ చిత్రంలో నీ జతై.. మెలోడీ సాంగ్‌ను ఎల్వ్యా, న‌కుల్ అభ‌యంక‌ర్ పాడారు. పాట విన సొంపుగా ఉంది. క‌చ్చితంగా ఈ సీజ‌న్‌లో ఇది ట్రెండింగ్ సాంగ్ అవుతుంద‌ని అంద‌రూ అంటున్నారు. యూరోపియ‌న్ దేశాల‌తో పాటు యు.ఎస్‌.ఎలోనూ షూటింగ్‌ను హ్యూజ్ బ‌డ్జెట్‌తో  ఎస్వీసీసీ ప‌తాకంపై బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్‌, బాపినీడు నిర్మిస్తున్నారు. 

కేరళ కుట్టి, యంగ్ హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran)  వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ‘టిల్లు స్క్వేర్’, ’ఈగల్’ వంటి సినిమాల్లో నటిస్తోంది. అటు తమిళం, మలయాళంలోనూ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఇక తొలిసారిగా ఏ డెన్నిస్ నార్టన్ మ్యూజికల్ లో ఓ సాంగ్ లో నటించింది. ‘పద పద’ (Padha Padha)  అనే టైటిల్ తో సంగీత ప్రియులను అలరించనుంది. ఈ ఫుల్ సాంగ్ ఆగస్టు 2న సాయంత్రం 7 గంటలకు విడుదల కానుంది. ఈ మేరకు తాజాగా అప్డేట్ అందించారు. 
 

ఎంఎస్ ధోని ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సాక్షి ధోని నిర్మాత‌గా రూపొందిన ఔట్ అండ్ ఔట్ ఫ‌న్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ ‘ఎల్‌జీఎం’ (LGM - Lets Get Married). ఆగస్ట్ 4న ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో జె.పి.ఆర్‌.ఫిల్మ్స్‌, త్రిపుర ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్స్ భారీ లెవ‌ల్లో విడుద‌ల చేస్తున్నాయి. ఈమేరకు ఈరోజు తాజాగా మేకర్స్ అప్డేట్స్  అందించారు. ఈ సినిమాలో ప్ర‌ధాన పాత్ర‌ల్లో హరీష్ క‌ళ్యాణ్‌, ఇవానా, న‌దియా నటించారు. ర‌మేష్ త‌మిళ్ మ‌ణి ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. 

కుటుంబంలోని మ‌నుషులు అంద‌రూ ఒకేలా ఉండాల‌నేం లేదు.. ఒక్కొక్కరి మ‌న‌స్త‌త్వం ఒక్కోలా ఉంటుంది. దీని వ‌ల్ల మ‌న‌స్ప‌ర్ద‌లు వ‌స్తుంటాయి..పోతుంటాయి. కానీ బంధాలు, బంధుత్వాల‌ను మ‌నం విడిచి పెట్ట‌లేం. ముఖ్యంగా కొత్త పెళ్లి చేసుకోవాల‌నుకునే అబ్బాయి, అమ్మాయిల‌కు మ‌న‌సులో తెలియ‌ని భ‌యాలు ఎన్నో ఉంటాయి. మ‌రీ ముఖ్యంగా అత్తా కోడ‌ళ్ల మ‌ధ్య ఉండే రిలేష‌న్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అలా మ‌న‌సుకి ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాల‌నుకున్న అమ్మాయి కాబోయే అత్త‌గారి గురించి భ‌యప‌డుతుంది. అందు కోసం ఆమెతో క‌లిసి కొన్ని రోజుల పాటు ఆమెతో క‌లిసి ట్రావెల్ చేయాల‌నుకుంటుంది. అందుకు ఒప్పుకున్న అత్తా కోడ‌ళ్ల మ‌ధ్య ఉండే కండీష‌న్స్ ఏంటి?  చివ‌ర‌కు వారిద్ద‌రూ మ‌న‌స్త‌త్వాలు క‌లిశాయా? అనే వైవిధ్య‌మైన పాయింట్‌తో తెర‌కెక్కిన  ఔట్ అండ్ ఔట్ ఫ‌న్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ ‘ఎల్‌జీఎం’ (LGM - Lets Get Married).  

Latest Videos

click me!