`స్పిరిట్‌` షూటింగ్‌ అప్‌డేట్‌.. `సలార్‌ 2`కి లైన్‌ క్లీయర్‌.. ప్రభాస్‌ నెక్ట్స్ ప్లాన్‌ ఇదే..

First Published Apr 19, 2024, 10:47 PM IST

ప్రభాస్‌ నెక్ట్స్ సినిమాలకు సంబంధించిన ఓ క్లారిటీ వచ్చింది. సందీప్‌రెడ్డి వంగా కామెంట్లతో `స్పిరిట్‌` షూటింగ్‌, `సలార్‌ 2` షూటింగ్‌తోపాటు మిగిలిన ప్రాజెక్ట్ లు ఎప్పుడు ప్రారంభం కాబోతున్నాయో తెలిసింది. 
 

 ప్రభాస్‌ చేతిలో ఇప్పటికీ నాలుగైదు సినిమాలున్నాయి. పార్ట్ 2లు రావడంతో తన లైనప్‌ల సంఖ్య పెరిగిపోతుంది. గతేడాది `సలార్‌`తో రచ్చ చేసిన డార్లింగ్‌ ఇప్పుడు `కల్కి2898ఏడీ` చిత్రంతో రాబోతున్నారు. ఈ మూవీ రిలీజ్‌పై ఊగీసలాట కొనసాగుతుంది. చిత్ర బృందం దీనిపై స్పందించడం లేదు. ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. అదిగో అప్‌డేట్‌, ఇదిగో అప్‌డేట్‌ అని ఫ్యాన్స్ పోస్ట్ లు తప్ప టీమ్‌ నుంచి రియాక్షన్ లేదు. ఓ రకంగా ప్రభాస్‌ ఫ్యాన్స్ సహనాన్ని పరీక్షిస్తున్నారని చెప్పొచ్చు. 

మే 9న రిలీజ్‌ కావాల్సిన ఈ మూవీ ఎన్నికలు, పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్ డిలే కారణంగా వాయిదా పడుతుందంటున్నారు. మే 30 లేదా, జూన్‌లో రిలీజ్‌ అని తెలుస్తుంది. ఎప్పుడు అనేదానిపై టీమ్‌ స్పందిస్తేగానీ తెలియదు. ఇక ప్రభాస్‌ ప్రస్తుతం మారుతి సినిమా షూటింగ్‌లో ఉన్నారు. ఆయన దర్శకత్వంలో `ది రాజా సాబ్‌` అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. నెక్ట్స్ మూవీ షూటింగ్‌ స్టార్ట్ అయ్యే లోపు మారుతి మూవీ షూటింగ్‌ కంప్లీట్‌ చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు ప్రభాస్‌. ఇటీవల ఈ మూవీకి సంబంధించిన లుక్‌లో కనిపించి సందడి చేశారు డార్లింగ్‌. 
 

ఇక తాజాగా `స్పిరిట్‌` మూవీ అప్‌డేట్‌ ఇచ్చాడు సందీప్‌ రెడ్డి వంగా. `యానిమల్‌` చిత్రంతో ఆయన గతేడాది దుమ్మురేపిన విషయం తెలిసిందే. ఆ మూవీ సుమారు ఎనిమిది వందల కోట్లు వసూలు చేసి షాక్‌ ఇచ్చింది. దీంతో సందీప్‌రెడ్డి వంగా నెక్ట్స్ మూవీపై ఆసక్తి ఏర్పడింది. ఆయన ప్రభాస్‌తో `స్పిరిట్‌` చేయాల్సిన కమిట్‌ మెంట్‌ ఉంది. దీనిపైనే వర్క్ చేస్తున్నారు సందీప్‌. అయితే ఈ మూవీ త్వరలోనే ప్రారంభమవుతుందనే వార్తలు వచ్చాయి. ఆ మధ్య దీనిపై రియాక్ట్ అయ్యాడు సందీప్‌. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఉంటుందన్నారు. అయితే `సలార్‌ 2` షూటింగ్‌ కూడా త్వరలోనే ఉంటుందనే వార్తల నేపథ్యంలో ప్రభాస్‌ సినిమాలు ఎప్పుడు ఏది ఉంటుందనేది పెద్ద సస్పెన్స్ నెలకొంది. 

తాజాగా దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా మాటలతో ఓ క్లారిటీ వచ్చింది. ప్రభాస్‌ సినిమాలపై ఓ క్లారిటీ వచ్చింది. `స్పిరిట్‌` మూవీ ఈ ఏడాది చివర్లో ప్రారంభిస్తామన్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. అన్నికంప్లీట్‌ చేసి ఈ ఏడాది డిసెంబర్‌లో `స్పిరిట్‌`ని ప్రారంభించబోతున్నారట. ఇందులో ప్రభాస్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపిస్తారని తెలుస్తుంది. లుక్‌ కొత్తగా ఉంటుందని, ఇప్పటి వరకు చూడనటువంటి లుక్‌లో డార్లింగ్‌ కనిపించేలా చేయబోతున్నారట సందీప్‌. 
 

ఇదిలా ఉంటే సందీప్‌ రెడ్డి వంగా కామెంట్స్ తో `సలార్‌ 2`పై క్లారిటీ వచ్చింది. ఈ మూవీ త్వరలోనే ప్రారంభమవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇది జూన్‌ లేదా జులై లో ప్రారంభమవుతుందని తెలుస్తుంది. `కల్కి2898ఏడి` రిలీజ్‌ అయి, ప్రమోషన్ల హడావుడి పూర్తయిన వెంటనే `సలార్‌ 2`ని స్టార్ట్ చేయబోతున్నారు దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌. ఈ మేరకు పార్ట్ 2 స్క్రిప్ట్ వర్క్ ని ఫైనల్‌ చేస్తున్నారట. నిజానికి పార్ట్ 2 షూటింగ్‌ చాలా వరకు పూర్తయ్యిందట. జులైలో రెగ్యూలర్‌ షూటింగ్‌ జరిపి అక్టోబర్‌, నవంబర్‌ వరకు ప్రభాస్‌ పోర్షన్‌ మొత్తం కంప్లీట్‌ చేయాలని భావిస్తున్నారట. అయితే ఇప్పటికే `సలార్‌ 2`కి సంబంధించిన షూటింగ్‌ చాలా వరకు పూర్తయ్యిందని టాక్‌. కొంత పార్ట్ ఉంటుందని, దాన్ని నవంబర్‌ వరకు కంప్లీట్‌ చేయాలని ప్లాన్‌ చేస్తున్నారట. 
 

`సలార్‌2` షూటింగ్‌ పూర్తి చేసుకుని `స్పిరిట్‌`లో పాల్గొంటారని ప్రభాస్‌. ఆ తర్వాత దానికే ఎక్కువ డేట్స్ ఇచ్చే అవకాశం ఉంది. మరోవైప హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది ప్రభాస్‌. వార్‌ బ్యాక్‌ డ్రాప్‌లో సాగే లవ్‌ స్టోరీ ఇది. ఈ మూవీ కోసం దర్శకుడు వెయిట్‌ చేస్తున్నారు. ప్రభాస్‌ ఎప్పుడు ఫ్రీ అయితే అప్పుడు షూటింగ్‌ చేయాలనుకుంటున్నారు. ఈ మూవీని కూడా ఈ ఏడాది చివర్లోనే ప్రారంభించాలనుకున్నారు. కానీ లేటెస్ట్ పరిణామాల నేపథ్యంలో వచ్చే ఏడాది సమ్మర్‌లో ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. `స్పిరిట్‌`, హను మూవీలను పారలల్‌గా చేయాలనే ఆలోచనలో డార్లింగ్‌ ఉన్నారట. 
 

ఇదిలా ఉంటే `కల్కి2898ఏడీ` కూడా రెండు భాగాలు. మొదటిభాగంకి వచ్చే రెస్పాన్స్ ని బట్టి రెండో పార్ట్ ఉంటుంది. మొదటి భాగం హిట్‌ అయ్యిందంటే ఈ లెక్కలన్నీ మారిపోయే అవకాశం ఉంటుంది. వెంటనే ఆ మూవీని కంటిన్యూ చేసినా ఆశ్చర్యం లేదు. కానీ ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు, ప్రభాస్‌ ప్లాన్‌ మేరకు హను రాఘవపూడి మూవీ అనంతరం `కల్కి` పార్ట్ 2 ఉంటుందని తెలుస్తుంది. ఇలా డార్లింగ్‌ ఓ ప్లాన్‌ సెట్‌ చేసుకున్నారట. ఆ దిశగా సినిమా షూటింగ్‌లు జరిగే అవకాశం ఉంది. ఏదేమైనా రెండేళ్ల  వరకు ప్రభాస్‌ ఇప్పుడు ఒప్పుకున్న ప్రాజెక్ట్ లతోనే బిజీగా ఉంటాడని చెప్పొచ్చు. వచ్చే ఏడాది రెండు సినిమాలను రిలీజ్‌ చేసే అవకాశం ఉంది.

click me!