ఇద్దరు బావా, బావా అని పిలుచుకునే వారట. అంతటి సాన్నిహిత్యం ఉండేది. కానీ వర్క్ విషయంలో మాత్రం ఇద్దరికి ఇద్దరు నువ్వా నేనా అనేలా ఉండేవారని కైకాల సత్యనారాయణ తెలిపారు. ఎన్టీఆర్ తన ప్రొడక్షన్‌లో రూపొందించిన `ఉమ్మడి కుటుంబం` సినిమా షూటింగ్‌లో జరిగిన సంఘటన తెలిపారు కైకాల. ఆ మూవీకి నాగభూషణం నటించిన జమిందార్ పాత్రకి మొదట ఎస్వీఆర్‌ని అనుకున్నారట. అయితే ప్రొడక్షన్ పరంగా కొన్ని రూల్స్ ఉండేవట. కాల్షీట్ల అగ్రిమెంట్లు ఉండేవని, దానికి సైన్ చేయమంటే ఎస్వీఆర్ చేయలేదు, అడ్జెస్ట్ చేసుకుందాం, ఫర్వాలేదు, జస్ట్ పద్దతి ప్రకారం వెళ్లాలి అంటే, నేను ఆ రూల్ ఫాలో కాను, నేను చేయాల్సింది చేస్తా అని అన్నాడట.