Kannamoochi Web Series: దాగుడుమూతలు ఆడుతూ కూతురు మాయం.. ఓటీటీలో వణుకు పుట్టిస్తున్న వెబ్ సిరీస్

Published : Oct 11, 2026, 11:38 AM IST

Kannamoochi Web Series: ఓటీటీలో హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లకు ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది. తాజాగా పూర్ణ లీడ్ రోల్ చేసిన 'కన్నామూచి' సిరీస్ ప్రేక్షకులను భయపెడుతోంది. ఈ సిరీస్ కథేంటి, ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూద్దాం.

PREV
14
ఓటీటీలో మిస్ కాకుండా చూడాల్సిన సిరీస్

హారర్, సస్పెన్స్, థ్రిల్లర్ కథలకు ఓటీటీలో ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా దెయ్యాలు, అతీంద్రియ శక్తుల కాన్సెప్ట్ అయితే ఆడియన్స్ స్క్రీన్ కు అతుక్కుపోతారు. ఇప్పుడు ఓటీటీలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న అలాంటి హారర్ థ్రిల్లర్ సిరీస్ 'కన్నామూచి'. వరుస మిస్టరీలు, భయపెట్టే సీన్స్, తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠతో ఈ సిరీస్ సాగుతుంది. ప్రేక్షకులతో పాటు ఐఎండీబీ (IMDb)లో కూడా దీనికి మంచి రేటింగ్ వచ్చింది.

24
కన్నామూచి అసలు కథేంటి?

భర్తను కోల్పోయిన ప్రియ, చెవిటి - మూగదైన తన కూతురితో కలిసి చెన్నైలోని ఒక కొత్త అపార్ట్‌మెంట్‌కు మారుతుంది. గతాన్ని మర్చిపోయి కూతురితో ప్రశాంతంగా బతకాలని ఆమె అనుకుంటుంది.

కానీ కొత్త ఇంట్లోకి వెళ్లిన కొద్ది రోజులకే పరిస్థితులు మారిపోతాయి. తల్లీకూతుళ్లు ఇద్దరూ కొన్ని వింత సంఘటనలు ఎదుర్కొంటారు. అదే బిల్డింగ్‌లో కొన్నేళ్ల క్రితం ఒకరు ఆత్మహత్య చేసుకున్నారని తెలియడంతో ప్రియకు అనుమానం పెరుగుతుంది.

34
సడెన్‌గా మాయమైన కూతురు

ఒకరోజు ఇంట్లో కూతురితో కలిసి ప్రియ దాగుడుమూతలు (కన్నామూచి) ఆడుకుంటుంది. ఆట మధ్యలో పాప సడెన్‌గా మాయమవుతుంది. ఇంట్లోనే ఉన్న పిల్ల ఎలా అదృశ్యమైందో ప్రియకు అర్థం కాదు. కంగారుగా కూతురి కోసం వెతుకుతున్న ప్రియకు కొన్ని ఊహించని ఆధారాలు దొరుకుతాయి. పాప మిస్సింగ్ వెనుక ఏదో మిస్టరీ ఉందని గ్రహించి, దాని గురించి ఆరా తీయడం మొదలుపెడుతుంది.

ఈ క్రమంలో ప్రియకు షాకింగ్ నిజాలు తెలుస్తాయి. ముఖ్యంగా 20 ఏళ్ల క్రితం జరిగిన ఒక హత్య మిస్టరీ బయటపడుతుంది. ఆ పాత హత్యకు, ఇప్పుడు తన కూతురు మాయం కావడానికి లింక్ ఉందా? అపార్ట్‌మెంట్‌లో జరుగుతున్న వింతలకు, ఈ మిస్టరీకి కనెక్షన్ ఏంటి? చివరికి ప్రియ తన కూతురిని కనిపెట్టిందా? అనేది మిగతా కథ.

44
కేవలం 5 ఎపిసోడ్లే!

ఈ సిరీస్‌లో నటి పూర్ణ మెయిన్ రోల్ చేసింది. కూతురి కోసం తల్లడిల్లే తల్లి ప్రియ పాత్రలో ఆమె జీవించింది. పాపను వెతికే క్రమంలో ప్రియ ఎదుర్కొనే వింతలు, షాకింగ్ నిజాలు ఈ కథలో హైలైట్. యూనికార్న్, ట్రెండ్ లౌడ్ ప్రొడక్షన్స్ కలిసి నిర్మించిన ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం జీ5 (ZEE5) ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఈ సిరీస్ అందుబాటులో ఉంది. ఇందులో కేవలం 5 ఎపిసోడ్లు మాత్రమే ఉన్నాయి. ఒక్కో ఎపిసోడ్ నిడివి 20 నిమిషాలు ఉంటుంది. ఎక్కువ టైమ్ తీసుకోకుండా, ఫాస్ట్‌గా సాగే హారర్ థ్రిల్లర్ చూడాలనుకునే వారికి 'కన్నామూచి' బెస్ట్ ఆప్షన్.

Read more Photos on
click me!

Recommended Stories