శ్రీరాముడిగా సూపర్ స్టార్ కృష్ణకి ఛాన్స్ మిస్, ఆ ఒక్క రీజన్‌తో రిజెక్ట్ చేసిన ఎన్టీఆర్.. ఏం జరిగింది ?

Published : Jun 06, 2025, 02:54 PM IST

సూపర్ స్టార్ కృష్ణకి శ్రీరాముడి పాత్ర మిస్ అయింది. ఓ కారణం వల్ల ఎన్టీఆర్.. కృష్ణకి శ్రీరాముడి పాత్ర ఇవ్వలేదు. అసలేం జరిగింది అనేది ఈ కథనంలో తెలుసుకుందాం. 

PREV
15
18 ఏళ్ళ వయసులో ఎన్టీఆర్ ని తొలిసారి కలిసిన కృష్ణ

సూపర్ స్టార్ కృష్ణ, ఎన్టీఆర్ మధ్య చాలా మంచి అనుబంధం ఉండేది. కానీ ఆ తర్వాత విభేదాల కారణంగా వీరి మధ్య కొంతకాలం మాటల్లేవు. కృష్ణ కెరీర్ బిగినింగ్ లో ఎన్టీఆర్ చాలా ప్రోత్సహించారు. ఈ విషయాన్ని స్వయంగా కృష్ణ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. తాను కాలేజీ స్టూడెంట్ గా ఉన్నప్పుడు 18 ఏళ్ల వయసులో ఎన్టీఆర్ గారిని తొలిసారి కలిసినట్లు కృష్ణ గుర్తు చేసుకున్నారు.

25
శ్రీరాముడిగా కృష్ణకి ఛాన్స్ మిస్ 

ఎన్టీఆర్ గారు నన్ను చూడగానే బాగున్నారు బ్రదర్.. మీరు సినిమాల్లోకి పనికొస్తారు అని చెప్పారు. నేనిప్పుడు సీతారామ కళ్యాణం అనే సినిమా తీస్తున్నాను. మీకు కొంచెం వయసు ఎక్కువ ఉండి ఉంటే తప్పకుండా రాముడి పాత్ర మీకే ఇచ్చేవాడిని అని అన్నారు. వయసు కారణంగా ఎన్టీఆర్ కృష్ణని రిజెక్ట్ చేయాల్సి వచ్చింది. ఆ చిత్రంలో రాముడి పాత్రని హరినాథ్ పోషించారు. రెండు మూడు సంవత్సరాల తర్వాత చిత్ర పరిశ్రమలో ప్రయత్నించు నీకు మంచి భవిష్యత్తు ఉందని ఎన్టీఆర్ చెప్పారు.

35
ఎన్టీఆర్ తో నటించిన తొలి చిత్రం 

నేను హీరో అయ్యాక ఆయనతో కలిసి నటించిన తొలి చిత్రం స్త్రీ జన్మ. ఈ మూవీలో ఆయనకు తమ్ముడిగా నటించాను. హీరోగా మంచి గుర్తింపు వచ్చాక నా ప్రతి మూవీ  ఫస్ట్ కాపీ ఆయనకే చూపించే వాడిని. మోసగాళ్లకు మోసగాడు మూవీ ఫస్ట్ కాపీ ఆయనకి చూపించినప్పుడు ఈ చిత్రం సూపర్ హిట్ అవుతుంది అన్నారు.

45
ఎన్టీఆర్ ఇచ్చిన సలహా

మీరు లేడీస్ సెంటిమెంట్ కి దూరం కావొద్దు. వెంటనే లేడీస్ సెంటిమెంట్ తో కూడా ఒక సినిమా చేయండి అని సలహా ఇచ్చారు. ఆయన ఇచ్చిన సలహా తోనే పండంటి కాపురం చిత్రం రూపొందించి బ్లాక్ బస్టర్ అందుకున్నట్లు కృష్ణ తెలిపారు.

55
దేవుడు చేసిన మనుషులు

ఆ తర్వాత ఆయనతో కలిసి మరోసారి దేవుడు చేసిన మనుషులు చిత్రంలో నటించాను. ఆ మూవీ కూడా సూపర్ హిట్ అయింది అని కృష్ణ గుర్తు చేసుకున్నారు. రాజకీయాల్లో ఆయనతో విభేదించినప్పటికీ కనిపించిన ప్రతి చోటా ఆప్యాయంగా పలకరించేవారు అని కృష్ణ తెలిపారు. 

Read more Photos on
click me!

Recommended Stories