అఖిల్ అక్కినేని, జైనబ్ ల పెళ్లి ఈ(శుక్రవారం) ఉదయం గ్రాండ్‌గా జరిగింది. వీటికి సంబంధించిన ఫోటోలు, వీడియో క్లిప్స్ లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే ఈ సందర్భంగా అఖిల్ భార్య జైనబ్ ఆస్తుల లెక్కలు షాకిస్తున్నాయి.
గ్రాండ్‌గా అఖిల్ అక్కినేని, జైనబ్ రవ్‌డ్జీ పెళ్లి వేడుక
అఖిల్ అక్కినేని పెళ్లి గ్రాండ్‌గా జరిగింది. ప్రముఖ వ్యాపారవేత్త జుల్ఫీ రవ్‌డ్జీ కూతురు జైనబ్ రవ్‌డ్జీతో శుక్రవారం ఉదయం అఖిల్ వివాహం ఆద్యంతం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అక్కినేని ఫ్యామిలీ, వారి దగ్గరి బంధువులు, సినిమా ఇండస్ట్రీ నుంచి చిరంజీవి, రామ్ చరణ్, దగ్గుబాటి ఫ్యామిలీ ఇలా అతికొద్ది మంది హాజరైనట్టు తెలుస్తుంది.
25
సినీ, రాజకీయ ప్రముఖల సమక్షంలో అఖిల్ పెళ్లి రిసెప్షన్
ఈ నెల 8న అఖిల్, జైనబ్‌ల పెళ్లి రిసెప్షన్ గ్రాండ్‌గా ప్లాన్ చేశారు అక్కినేని నాగార్జున. ఇందులో రాజకీయ ప్రముఖులు, అలాగే సినిమా సెలబ్రిటీలు పాల్గొనే అవకాశం ఉంది. దీంతో పెళ్లిని కేవలం ఫ్యామిలీకే పరిమితం చేశారు. పూర్తి ప్రైవేట్ ఈవెంట్‌గానే నిర్వహించారు నాగ్. అయినా ఈ మ్యారేజ్‌కి సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియో క్లిప్పులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
35
అఖిల్ భార్య జైనబ్ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్
అఖిల్ అక్కినేని పెళ్లి చేసుకున్న జైనబ్ ఎవరు? ఆమె బాక్ గ్రౌండ్ ఏంటి? ఆసక్తికరంగా మారింది. అయితే జైనబ్ ఫ్యామిలీ ఆస్తుల వివరాలు మాత్రం షాకిస్తున్నాయి. అఖిల్ బిగ్ షాట్‌నే పట్టారనే టాక్ వినిపిస్తోంది.
అఖిల్ భార్య జైనబ్ రవ్‌డ్జీ ప్రముఖ వ్యాపారవేత్త జుల్ఫీ రవ్‌డ్జీ కూతురు. ఆయన ఇండస్ట్రియలిస్ట్. రియల్ ఎస్టేట్, కన్‌స్ట్రక్షన్ కంపెనీలను నిర్వహిస్తున్నారు. వీరిది ముంబయి బేస్డ్ ఫ్యామిలీ. ఇండియా వైడ్‌గా వీరికి ప్రాజెక్ట్ లు ఉన్నాయని తెలుస్తోంది.
జుల్ఫీ ఫ్యామిలీకి కన్ స్ట్రక్షన్, పవర్ ప్రాజెక్ట్ లు
ఇక జుల్ఫీ రవ్‌డ్జీకి ఇద్దరు సంతానం. కూతురు జైనబ్, కొడుకు జైన్. కొడుకు జైన్ రవ్‌డ్జీ జెడ్‌ఆర్ రెనేవేబుల్ ఎనర్జీ ప్రై.లి అనే పవర్ కంపెనీని నిర్వహిస్తున్నారు. పలు చోట్ల వీటి యూనిట్లు ఉన్నాయట. ఇండియా వైడ్‌గా వ్యాపార రంగంలో రవ్‌డ్జీ ఫ్యామిలీ బాగా సెటిల్ అయ్యారని తెలుస్తోంది. అయితే వీరి ఆస్తుల లెక్క బయటకు తెలియనప్పటికీ వేల కోట్లలో ఆస్తుల విలువ ఉంటుందని తెలుస్తోంది.
55
జాక్ పాట్ కొట్టిన అఖిల్ అక్కినేని
జుల్ఫీకి ఒకే కూతురు, ఒక కొడుకు కావడంతో తన ఆస్తుల్లో సగం వాటా కూతురుకి వచ్చే అవకాశం ఉంది. ఇదే నిజమైతే అఖిల్ పంట పండినట్టే అని చెప్పొచ్చు. ఇంకా చెప్పాలంటే కొడితే కుంభ స్థలమే కొట్టాడు.
అయితే అఖిల్ కూడా తక్కువేం కాదు. ఆయనకు కూడా వేల కోట్ల ఆస్తులున్నాయి. అక్కినేని నాగేశ్వరరావు, నాన్న నాగార్జున వందల వేల కోట్లు సంపాదించారు. తన వాటా ప్రకారం వేల కోట్లు ఆయనకు వచ్చే అవకాశం ఉంది. దీంతో అఖిల్ టాలీవుడ్‌లో రిచ్చెస్ట్ హీరోల్లో ఒకరిగా నిలిచారని చెప్పడంలో అతిశయోక్తి లేదు.