ఆదిపురుష్ థియేటర్స్ లో ఆంజనేయస్వామికి కేటాయించిన సీట్లకు పూజలు.. ఫొటోస్ వైరల్

Published : Jun 16, 2023, 09:13 AM ISTUpdated : Jun 16, 2023, 09:16 AM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన చారిత్రాత్మక చిత్రం ఆదిపురుష్. భారతీయులు ఎంతో భక్తి శ్రద్దలతో ఆరాధించే పుణ్యపురుషుడు శ్రీరాముడి పాత్రలో ప్రభాస్ నటించిన చిత్రం ఇది. రామాయణం పురాణం ఆధారంగా దర్శకుడు ఓం రౌత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

PREV
16
ఆదిపురుష్ థియేటర్స్ లో ఆంజనేయస్వామికి కేటాయించిన సీట్లకు పూజలు.. ఫొటోస్ వైరల్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన చారిత్రాత్మక చిత్రం ఆదిపురుష్. భారతీయులు ఎంతో భక్తి శ్రద్దలతో ఆరాధించే పుణ్యపురుషుడు శ్రీరాముడి పాత్రలో ప్రభాస్ నటించిన చిత్రం ఇది. రామాయణం పురాణం ఆధారంగా దర్శకుడు ఓం రౌత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఎన్నో వివాదాల మధ్య నలుగుతూ.. అదే విధంగా భారీ అంచనాలతో ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శ్రీరాముడిగా ప్రభాస్ నటించగా .. జానకి పాత్రలో కృతి సనన్.. రావణాసురుడిగా సైఫ్ అలీఖాన్ నటించారు. 

26

ఆదిపురుష్ రిలీజ్ కావడంతో ఇండియా మొత్తం ప్రభాస్ అభిమానులు భక్తి పారవశ్యంలో మునిగి తేలుతున్నారు. ఆరాధ్య దైవం, ఆదర్శ పురుషుడిగా కొలిచే శ్రీరాముడు పాత్రలో ప్రభాస్ ని చూసేందుకు ఫ్యాన్స్ థియేటర్స్ కి ఎగబడుతున్నారు. జైశ్రీరామ్ నినాదాలతో దేశవ్యాప్తంగా థియేటర్లు హోరెత్తుతున్నాయి. అదే సమయంలో ఆంజనేయ స్వామిపై కూడా భక్తి పారవశ్యం వెల్లివిరుస్తోంది. ఈ చిత్రంలో హనుమంతుడు పాత్రలో దేవదత్త నాగే నటించారు. 

36

ఆడియన్స్ లో భక్తిని నింపేలా ఆదిపురుష్ టీం రిలీజ్ కి ముందు ఆసక్తికర ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఆదిపురుష్ ప్రదర్శించే ప్రతి థియేటర్ లో ఒక సీట్ ని హనుమంతుడి కోసం కేటాయించాలని దర్శకుడు ఓం రౌత్ నిర్మాతలని కోరడం.. వారు అంగీకరించడం జరిగింది. రామాయణ పారాయణం ఎక్కడ జరిగినా అక్కడ హనుమంతుడు ప్రత్యక్షం అవుతాడని భక్తుల నమ్మకం. 

46

అందుకు తగ్గట్లుగానే ప్రతి థియేటర్ లో ఒక సీట్ ని హనుమాన్ కోసం కేటాయిస్తున్నారు. ఫ్యాన్స్ అయితే ఆ సీట్ లో ఆంజనేయస్వామి ఫోటో పెట్టి ప్రత్యేకంగా థియేటర్స్ లోనే పూజలు నిర్వహిస్తున్నారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

56

జైశ్రీరామ్ తో పాటు జై హనుమాన్ నినాదాలు కూడా హోరెత్తుతున్నాయి. విజయవాడలోని శైలజ థియేటర్ లో హనుమంతుడి కోసం యాజమాన్యం జె1 సీట్ కేటాయించింది. దేశవ్యాప్తంగా అన్ని థియేటర్స్ లో ఈ ట్రెండ్ కొనసాగుతోంది. థియేటర్ యాజమాన్యం తో పాటు ఫ్యాన్స్ కూడా ఆ సీట్లని పూలమాలలతో అలంకరించి పూజలు చేస్తున్నారు. 

66

బరోడాలో ఓ థియేటర్ లో యాజమాన్యం హనుమంతుడి కోసం కేటాయించిన సీట్ లో కాషాయ వస్త్రం కప్పి హనుమంతుడు చిత్ర పటం పెట్టారు. పూజలు చేశారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

Read more Photos on
click me!

Recommended Stories