త్వరలో చిరంజీవి ఇంటికి షిఫ్ట్ కాబోతున్న రాంచరణ్, ఉపాసన.. ఎందుకో తెలిస్తే శభాష్ అనాల్సిందే..

Published : Jun 16, 2023, 08:18 AM IST

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సతీమణి ఉపాసన కొణిదెల ప్రస్తుతం నిండు గర్భంతో ఉన్నారు. త్వరలో కొణిదెల వారి ఇంట వారసుడో వారసురాలో రాబోతున్నారు. ఆ బ్యూటిఫుల్ మూమెంట్ కోసం మెగా ఫ్యామిలీతో పాటు అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. 

PREV
16
త్వరలో చిరంజీవి ఇంటికి షిఫ్ట్ కాబోతున్న రాంచరణ్, ఉపాసన.. ఎందుకో తెలిస్తే శభాష్ అనాల్సిందే..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సతీమణి ఉపాసన కొణిదెల ప్రస్తుతం నిండు గర్భంతో ఉన్నారు. త్వరలో కొణిదెల వారి ఇంట వారసుడో వారసురాలో రాబోతున్నారు. ఆ బ్యూటిఫుల్ మూమెంట్ కోసం మెగా ఫ్యామిలీతో పాటు అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఉపాసన గర్భిణిగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది. 

 

26

ఇటీవల రాంచరణ్, ఉపాసన దంపతులు 11 వ వెడ్డింగ్ యానివర్సరీ సెలెబ్రేట్ చేసుకున్నారు. నిండు గర్భిణిగా ఉన్న ఉపాసన ఈ సందర్భంగా ఇంటర్వ్యూలలో పాల్గొంది. తాజాగా ఇంటర్వ్యూలో ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఉపాసన గర్భవతి కావడంతో హెల్త్ పరంగా కేర్ తీసుకుంటూ జాగ్రత్తలు వహిస్తోంది. 

36

రాంచరణ్, ఉపాసన కొంతకాలం క్రితం విడిగా విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేసి అందులో కాపురం ఉంటున్నారు. తాజాగా ఉపాసన మాట్లాడుతూ.. త్వరలో తాము మళ్ళీ అత్తయ్య, మావయ్య ఇంటికి షిఫ్ట్ కాబోతున్నాం అని క్లారిటీ ఇచ్చింది. 

 

46

ఈ కొత్త నిర్ణయం ఎందుకో చెబుతూ ఆమె ఇచ్చిన వివరణ శభాష్ అనిపించే విధంగా ఉంది. రాంచరణ్ అయినా, నేను అయినా ఈ స్థాయికి చేరుకున్నాం అంటే అది మా గ్రాండ్ పేరెంట్స్ పంచిన ప్రేమ వల్లే. అది నా బిడ్డకు కూడా దక్కాలి. అందుకే అత్తయ్య, మావయ్యతో కలసి ఉండాలని చరణ్, తాను నిర్ణయించుకున్నట్లు ఉపాసన పేర్కొంది. 

56

పిల్లలు గ్రాండ్ పేరెంట్స్ వద్ద పెరిగితే వాళ్లలో చాలా ఉన్నత లక్షణాలు అలవాడుతాయి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉపాసన పేర్కొంది. ఇక చిరంజీవి అంటే క్రమశిక్షణకు మారుపేరు అని ఇండస్ట్రీలో అంతా అంటుంటారు. రాంచరణ్ కి కూడా చిరు అదే క్రమశిక్షణ అలవాటు చేశారు. 

66

ఇక చరణ్, ఉపాసనకి పుట్టబోయే బిడ్డ విషయంలో చిరు, సురేఖ దంపతులు ఎలాంటి కేర్ తీసుకుంటారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మెగా కుటుంబ సభ్యులు ఉపాసన ప్రెగ్నన్సీ విషయాన్ని గత ఏడాది డిసెంబర్ లో రివీల్ చేశారు. ఇటీవల ఉపాసనకి కుటుంబ సభ్యులు బేబీ షవర్ ఫంక్షన్ కూడా నిర్వహించిన సంగతి తెలిసిందే. 

click me!

Recommended Stories