Intinti Gruhalakshmi: తులసి బాధ్యతలను గుర్తుచేసిన నందు.. తులసిని ఫేస్ చేయడం కష్టమంటున్న లాస్య!

Published : Apr 06, 2022, 11:24 AM IST

Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalakshmi ) సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.  ఒక ఇల్లాలి బాధ్యత అనే కాన్సెప్ట్ తో ఈ సీరియల్ కొనసాగుతోంది. పైగా రేటింగ్ లో కూడా మంచి స్థానాన్ని సంపాదించుకుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం.  

PREV
16
Intinti Gruhalakshmi: తులసి బాధ్యతలను గుర్తుచేసిన నందు.. తులసిని ఫేస్ చేయడం కష్టమంటున్న లాస్య!

సింగర్ అవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రేమ్ (Prem) కు ఎవరు అవకాశం ఇవ్వకపోవడంతో బాధపడుతూ ఉంటాడు. ఇక కొత్త ఇంటికి వెళ్లిన లాస్య కొత్త వస్తువులను కొని నందు (Nandhu) కి షాక్ ఇస్తుంది. పాతిక వేలు పెట్టి ఆన్లైన్ షాపింగ్ చేశానని అనడంతో.. వెంటనే నందు పాతిక వేలు వేస్ట్ చేశావు.. మనమింకా సెటిల్ కాలేదు.. ఇన్ని సోకులు అవసరమా అంటూ ఫైర్ అవుతాడు.
 

26

పొదుపు ఎలా చేయాలో తులసిని చూసి నేర్చుకో అని తులసి బాధ్యతను గుర్తుకు చేస్తాడు. దాంతో లాస్య (Lasya) కోపంతో రగిలిపోతుంది. మరోవైపు తులసికి బ్యాంక్ నుంచి లోన్ కుదరదని ఫోన్ వస్తుంది. దాంతో తులసి చాలా బాధ పడుతూ ఉంటుంది. శశికళ అప్పు తీర్చేదెలా అని అనుకోడం తో అప్పుడే శశికళ (Shashikala) వచ్చి షాక్ ఇస్తుంది.
 

36

ఇక తులసి (Tulasi).. రావాల్సిన టైం కంటే ముందుగా వచ్చారేంటి అని అడగటంతో.. అప్పు ఇచ్చిన వాళ్ళం కదా కంగారు ఉంటుంది అని వెటకారం చేస్తుంది. ఈమధ్య ఇంటి గురించి చాలా వింటున్నానని.. నీ మొగుడుతో పాటు కొడుకును కూడా ఇంట్లో నుంచి తరిమేశావంటా కదా అని అనడంతో తులసి బాధపడితూ కాస్త టైం ఇయ్యండి అప్పు తీరుస్తాను అని అంటుంది.
 

46

దాంతో ఆమె అడగడం తప్ప ఏమి చేయలేము అని.. అందుకే నీకు ఆఫర్ ఇస్తున్న అంటూ.. నీ చేతికి 20 లక్షలు వస్తుంది. నా అప్పు తీరిపోతుంది. కాకపోతే ఈ ఇల్లు నాది అవుతుంది అని అనడంతో అప్పుడే భాగ్య (Bhagya) ఎంట్రీ ఇచ్చి ఐడియా అదిరిపోయింది కదా అంటూ వెటకారంగా మాట్లాడుతుంది.
 

56

ఈ ఇంటి పై నీకు ఎంత హక్కుందో కోడలిగా నాకు అంతే హక్కు ఉంది అని.. అమ్మే హక్కు నీకు లేదు.. మా మామయ్య గారిని మోసం చేసి ఇల్లు రాయించుకుందని కోర్ట్ కి వెళ్తాను అనడంతో.. పక్కనే ఉండే శశికళ (Shashikala) తులసి పై అరుస్తుంది. రెండు రోజులు గడువు ఇవ్వమని తులసి (Tulasi) అడగటంతో అప్పు తీర్చకపోతే ఇల్లు నా పేరున రాయించుకుంటా అని వార్నింగ్ ఇస్తుంది.
 

66

ఇక అనసూయ (Anasuya) భాగ్య పై కోపంతో రగిలిపోగా భాగ్య కూడా గట్టిగా మాట్లాడుతుంది. ఇక తులసి భాగ్య తో నచ్చజెప్పె ప్రయత్నం చేస్తుంది. అనసూయ వాళ్ళ తో తులసి భాగ్య మాటల్లో న్యాయం ఉంది అంటూ మాట్లాడుతుంది. మరోవైపు లాస్య (Lasya) భాగ్యకు ఫోన్ చేసి.. మొండితనం లేకపోతే తులసిని పేస్ చేయలేమని అంటుంది.

click me!

Recommended Stories