సౌందర్య (Soundarya) ఆనంద రావు తో తన మనసు ప్రశాంతంగా ఉందని ఎంతో కాలానికి ఈరోజు ఉత్సాహంగా ఉందని అనడంతో అప్పుడే సౌర్య, హిమ (Hima) వాళ్ళు వచ్చి మేం కూడా వాకింగ్ కు వస్తాము అని అనడంతో సరే అని వెళ్లి అమ్మకు చెప్పు రండని పిల్లలను పంపిస్తుంది.
ఇక కార్తీక్ (Karthik) స్నానం చేసి రావటంతో దీప కార్తీక్ తలను గట్టిగా తుడుస్తుంది. కార్తీక్ వద్దు అన్న వినకుండా సరదాగా కాసేపు కార్తీక్ తో ఆడుకుంటుంది. ఏం టిఫిన్ చేయాలి అని దీప (Deepa) అడగటంతో ఉప్మా చేయమని అంటాడు.
వెంటనే దీప (Deepa) ముఖం మారుస్తూ.. ఏంటి డాక్టర్ బాబు (Doctor babu) మీరు కోపంగా ఉన్నప్పుడు ఉప్మా తింటారు కదా అనేసరికి చాలా సంతోషంగా ఉన్నా కూడా ఉప్మా తింటాను అనేసరికి సరే అదే చేస్తాను అని అంటుంది.
ఇక మళ్లీ టవల్ తో కార్తీక్ (Karthik) తల తుడుస్తుండగా సౌర్య (Sowrya), హిమ వచ్చి మురిసిపోతారు. అమ్మ నాన్న ఎప్పుడు ఇలాగే ఉండాలి అంటూ మనం కూడా వాళ్లను బాధ పెట్టకూడదు అని మాట్లాడుకుంటారు.
కార్తీక్ (Karthik) వాళ్లను చూసి పిలవడంతో వాకింగ్ కి వెళ్తామని అనేసరికి సరే అంటారు. దీప పిల్లలను ఏమి టిఫిన్ చేయాలి అని అడగటంతో ఉప్మా అనడంతో దీప (Deepa) మళ్లీ ఆశ్చర్యపోతుంది.
మోనిత (Monitha) బిడ్డ ని తీసుకొని ప్రియమణితో కారులో కార్తీక్ ఇంట బయట ఎదురుచూస్తుంది. పక్కనే ఉన్న ప్రియమణి (Priyamani) మోనితను తన మాటలతో పదేపదే విసిగిస్తుంది.
బయట ఉండటం ఎందుకు లోపలికి వెళ్లి మాట్లాడొచ్చు కదా అని అంటుంది ప్రియమణి (Priyamani). అలా వెటకారంగా ప్రశ్నల మీద ప్రశ్నలు వేయటంతో మోనితకు (Monitha) బాగా కోపం వస్తుంది.
వాకింగ్ కి వెళ్తున్న సౌందర్య (Soundarya) వాళ్లను చూసి దాచుకుంటుంది. ఇక తన అత్తగారైన సౌందర్య గురించి మాట్లాడుతుంది మోనిత (Monitha). తన ఎదురుగా నిల్చొని మాట్లాడే ధైర్యం అసలు ఉండదని అంటుంది.
ఇంట్లో కార్తీక్ (Karthik), ఆదిత్య (Adithya) లకు టిఫిన్స్ వడ్డిస్తారు దీప, శ్రావ్య. కాసేపు సరదాగా మాట్లాడుకుంటారు. దీప ఉప్మా కాకుండా తమకిష్టమైన టిఫిన్ చేసి పెడుతుంది. ఆదిత్య కార్తీక్ తో ఎక్కడికైనా వెళ్లొచ్చు కదా అని అంటాడు.
కార్తీక్ గతాన్ని తలచుకుని మాకు ఎక్కడికి వెళ్లాలన్నా కలిసి రాదు అని అంటాడు. అప్పుడే దీప (Deepa) వాళ్ళ నాన్న మురళి కృష్ణ (Murali krishna) వచ్చి వారితో సరదాగా మాట్లాడుతాడు. దీపను పక్కకు పిలిచి మోనిత వచ్చిందని అంటాడు.
వెంటనే దీప (Deepa)కార్తీక్ తో చెప్పటంతో ఆదిత్య కోపంతో రగిలిపోతాడు. ఇక కార్తీక్, దీప క్యాంపుకు బయలుదేరుతారు. మరోవైపు వారణాసి (Varanasi) బస్తీలో క్యాంపు ఏర్పాటు చేస్తాడు.
బయట మోనిత (Monitha) లేకపోయేసరికి భ్రమ అనుకొని అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. కార్తీక్ (Karthik) బస్తీలో అందరికీ చెకప్ చేస్తూ ఉంటాడు. దీప అందర్నీ పలకరిస్తూ ఉంటుంది.
తరువాయి భాగం లో మోనిత (Monitha) ఎంట్రీ ఇవ్వటంతో కార్తీక్ (Karthik) బిడ్డ అని చెప్పడానికి ప్రయత్నిస్తోంది. ఇక దీప కోపంతో రగిలిపోతూ బస్తీ వాళ్ల గురించి చెప్పటంతో బస్తీ వాళ్ళు మోనిత పై చీపురులు ఎత్తి ఎదిరిస్తారు.