ప్రగ్యాజైశ్వాల్(Pragya Jaiswal) ఫస్ట్ టైమ్ బాలకృష్ణ(Balakrishna)తో కలిసి `అఖండ`(Akhanda) చిత్రంలో నటిస్తుంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. శ్రీకాంత్, జగపతిబాబు విలన్ పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ సినిమా డిసెంబర్ 2న విడుదల కాబోతుంది. దీంతో సినిమాపై సర్వత్రా అంచనాలు నెలకొన్నాయి. పైగా ఈ రోజు(శనివారం) సాయంత్రం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది. దీనికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రాజమౌళి గెస్ట్ లుగా వస్తున్నాయి.
సినిమా ప్రమోషన్‌లో భాగంగా Pragya Jaiswal మీడియాతో ముచ్చటిస్తూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బాలయ్యని పట్టుకుని మీరు మనిషేనా? అని అడిగేసిందట. తాజాగా ఈ విషయాన్ని ప్రగ్యా వెల్లడించింది. చిత్ర షూటింగ్‌లో ఈ సంఘటన చోటు చేసుకుందట. దీనిపై ప్రగ్యా చెబుతూ, బాలకృష్ణ తెల్లవారు జామున మూడు గంటలకే నిద్రలేచి 6 గంటల సమయానికి సెట్‌లో ఉంటారు. ఆయన ఎనర్జీ చూసి షాకయ్యేదాన్ని. ఓ సందర్భంలో `అసలు మీరు మనిషేనా?` అని ఆయన్ను సరదాగా అడిగా` అని చెప్పింది. అదన్నమాట విషయం. ఆయన ఎనర్జీ లెవల్‌ని చూసి ప్రగ్యా అలా అడిగిందట.
`అఖండ` సినిమాకి ఎంపిక కాకముందే వివిధ సందర్భాల్లో బాలకృష్ణగారిని కలిశా. కానీ, ఆయనతో నటిస్తున్నాననే విషయం తెలియగానే కాస్త భయపడ్డా. అంత సీనియర్ యాక్టర్ పక్కన నటించడమంటే సవాలే కదా. సెట్‌లో అడుగుపెట్టిన రోజే ఆయన నా టెన్షన్ పోగొట్టారు. బాలకృష్ణ ఎప్పుడూ పాజిటివ్‌గా ఉంటారు. క్రమశిక్షణ, సమయపాలన విషయంలో ఆయన చాలా స్ట్రిక్ట్. అలాంటి నటుడితో తెరను పంచుకోవడం ఆనందంగా ఉంది` అని చెప్పింది ప్రగ్యాజైశ్వాల్.
తన పాత్ర గురించి చెబుతూ, `కొవిడ్ లాక్‌డౌన్ తర్వాత నాకు ఈ అవకాశం వచ్చింది. తాను రాసుకున్న పాత్రలకు ఎవరు న్యాయం చేయగలరో వారినే ఎంపిక చేసుకుంటారు దర్శకుడు బోయపాటి శ్రీను. అలా నేనీ ప్రాజెక్టులో అడుగుపెట్టాను. ఆయనపై నాకున్న నమ్మకంతో కథను పూర్తిగా వినకుండానే ఈ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పా. నేనీ చిత్రంలో ఐఏఎస్ శ్రావణ్య అనే పాత్ర పోషించా. గతంలో ఎప్పుడూ చేయనటువంటిపాత్రలో కనిపిస్తాను. పాత్ర కోసం ఎంతో శ్రమించా. సినిమాకే కీలకంగా నిలిచే పాత్ర అది. ఆ క్యారెక్టర్ చుట్టే కథ తిరుగుతుంది. ఆ పాత్రకు ఎదురైన కొన్ని సంఘటనల వల్ల కథానాయకుడి రెండో క్యారెక్టర్ `అఖండ` దర్శనమిస్తుంద`ని తెలిపింది. ఈ సినిమాతో తాను కమ్ బ్యాక్ అవుతానని ఆశాభావం వ్యక్తం చేసింది.
తన కెరీర్ గురించి చెబుతూ, `నా వరకు వచ్చిన కథల్లోంచి మంచి పాత్రల్ని ఎంచుకున్నా. కొన్ని ఫలితాల్నిచ్చాయి, కొన్ని ఇవ్వలేదు. ఫలితాలనేవి మన చేతుల్లో ఉండవు కదా. నేను మాత్రం మంచి కథలపై దృష్టిపెడుతూ, మంచి పాత్రల్ని ఎంచుకుంటూ వస్తున్నా. ఏడేళ్లుగా సాగుతున్న సినీ ప్రయాణం నాది. పనిని అర్థం చేసుకోవడానికి కొంచెం సమయం తీసుకున్నా. డిజిటల్ వేదికలా లేక సినిమానా? అని సంబంధం లేకుండా... మంచి కథలు, మంచి బృందంతో కలిసి ప్రయాణం చేయాలనేది నా ప్లాన్` అని వెల్లడించింది ప్రగ్యా.