ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... సౌందర్య, దీప ఫోటో చూస్తూ డాక్టర్ బాబు! డాక్టర్ బాబు! అనుకుంటూ వాడి ప్రేమ కోసం తపించావు ఆఖరికి వాడితో పాటు మా అందరిని వదిలేసి వెళ్లిపోయావు. ఇక్కడ నీ కోసం పిల్లలు తపిస్తున్నారు అని బాధపడుతూ ఉంటుంది. ఈలోగా హిమా కూడా మనం ఇల్లు మారితే శౌర్య మనకి కనిపిస్తుంది కదా నానమ్మ అని అడుగుతుంది. అప్పుడు సౌందర్య,నేను మనుషులను పెట్టి వెతుకుమంటున్నాను మనకి శౌర్య కచ్చితంగా కనిపిస్తుంది అని అంటుంది.