
ఎపిసోడ్ ప్రారంభంలోనే.... నువ్వు నిరూపమ్ ని కచ్చితంగా పెళ్లి చేసుకోవాలి అని సౌందర్య హిమకి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది.అదే టైంలో ఈవెంట్ మేనేజర్ వస్తారు. ఇల్లు,కళ్యాణమండపం అలంకరించాలని, చాలా రోజుల తర్వాత ఇంట్లో జరిగే మొదటి శుభకార్యం అని,తన మనవరాలికి మనవడికి పెళ్లి తనే స్వయంగా చేయాలని సౌందర్య అంటుంది. ఇదంతా శౌర్య చాటు నుంచి వింటుంది.తర్వాత సీన్లో స్వప్న, వాళ్ళ పిల్లలు వాళ్ళ మాట ఎందుకు వినడం లేదు అని బాధపడుతూ ఉంటుంది.
శోభ అక్కడికి వచ్చి వాళ్ళు పెళ్లి పనులు మొదలుపెట్టారు అని చెప్తుంది. వాళ్లు పెళ్లి ఎలా చేస్తారు నేను చూస్తాను అని స్వప్న శోభతో అంటుంది. ఈలోగ ప్రేమ్ ,సత్యం అక్కడికి వస్తారు. అప్పుడు శోభా వాళ్ళను చూసి స్వప్నతో ఆంటీ, మీరు ఎందుకు రోజంతా తినట్లేదు? అని బాధపడుతూ ఉంటుంది.అప్పుడు ప్రేమ్ వచ్చి ఎందుకు తినట్లేదు? అనగా నిరూపం, హిమనీ పెళ్లి చేసుకోవడం ఆంటీకి ఇష్టం లేదు. అందుకే ఆంటీ భోజనం చేయడం లేదు అని అంటుంది.
అప్పుడు ప్రేమ్ వెళ్లి నువ్వు, నేను,శోభా, డాడీ నలుగురం కలిసి ఆ పెళ్లిని ఎలాగైనా ఆపడానికి ప్రయత్నిద్దాము అని స్వప్నతో అంటాడు, ఈలోగా శోభ కొంచెం కాఫీ కావాలా ఆంటీ అనగా అందులో విషయం తెచ్చి వెయ్యు చస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.తర్వాత సీన్లో సౌందర్య, ఇంట్లో వాళ్ళందరికీ భోజనం వడ్డిస్తున్న సమయంలో సత్యం అక్కడికి వెళ్లి నిరుపంతో, స్వప్న ఏం భోజనం చేయడం లేదు.
నువ్వు ఇంటికి వస్తే గాని తను అన్నం మెతుకు కూడా తినను అని భీష్ముంచుకుని కూర్చుంది పదా అనీ అంటాడు. నిరూపమ్, మమ్మీ నన్ను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తుంది. ఇప్పుడు అక్కడికి వస్తే ఏదో నిమిషంలో శోభ ని పెళ్లి చేసుకుంటావా లేకపోతే విషం తాగి చావమంటావా? అని అడుగుతుంది. వద్దు డాడీ అని నిరూపం అనగా,సౌందర్య సత్యం తో నిరూపం కి, హిమకి నేను పెళ్లి చేస్తాను. స్వప్న నీ పిచ్చిపిచ్చి వేషాలు వేయద్దు అని చెప్పి సత్యం ని ఇంటికి పంపించేస్తుంది.
సత్యం ఇంటికి వచ్చి స్వప్నతో జరిగిందంతా చెప్పి, ఇంక శోభతో నిరూపం పెళ్లి జరగడం అసంభవం అని అనగా, నా కొడుకుకి స్వప్నతో ఎలా పెళ్లి చేయాలో నాకు తెలుసు, నేను చేస్తాను అని చెప్తుంది. తర్వాత సీన్లో నిరూపం, వాళ్ళ అమ్మ గురించి బాధపడుతూ ఉండగా హిమా అక్కడికి వచ్చి, శౌర్య గురించి రెండు మంచి మాటలు చెప్పగా ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? అని మీరు నిరుపమ అడగగా శౌర్యకి నువ్వు అంటే ఇష్టం అని అంటుంది.
అప్పుడు ఆశ్రమంలో తను అంటే నాకు ఇష్టం లేదు అన్నపుడే తనకి నా మీద సగం ప్రేమ పోయింది. మొన్న కిడ్నాప్ అయిన ఇంట్లో నేను ఒక మాట అన్నాను.సౌర్య అంటే నాకు ఇష్టం లేనట్లుగా చెప్పాను.అప్పుడే మిగిలిన ప్రేమ కూడా పోయి ఉంటది. నాకు నువ్వంటేనే ఇష్టం ఇంకా ఎవర్నీ పెళ్లి చేసుకోను అని చెప్పి వెళ్ళిపోతాడు నిరుపమ్. తర్వాత సీన్లో నీ రూపం స్వప్న దగ్గరికి వెళ్లడానికి బయలుదేరక ఇంట్లో వాళ్ళందరూ ఆపి తిరిగి లోపలికి పంపించేస్తారు. సౌర్య పైనుంచి ఇదంతా చూసి, ఇక్కడ అందరూ ఆనందంగా ఉన్నారు. నేను ఇంకా ఇక్కడ ఉండడం అవసరమా అనుకుంటుంది.దాని
ఆ తర్వాత సీన్లో సత్యం భోజనం చేస్తుండగా అక్కడ ఆంటీ పస్తులు ఉంటే మీకు ఎలా తినాలనిపిస్తుంది అదే సమయంలో సౌందర్య అక్కడికి వచ్చి శోభన్ గట్టిగా కొడుతుంది. స్వప్న అక్కడికి వచ్చి నా కాబోయే కోడలు ని ఎందుకు కొడుతున్నారు? అని అనగా ఎక్కువ మాట్లాడితే నిన్ను కూడా కొడతాను అని అంటుంది. ఎవరికి కాబోయే కోడలు?, తిను నీకు కాబోయే కోడలు. అని చెప్పి హిమ, నిరూపం పెళ్లి ఇన్విటేషన్ వాళ్లకి ఇచ్చి ఈ సమయానికి, ముహూర్తానికి రండీ... పెళ్లి కచ్చితంగా జరుగుతుంది అని గట్టిగా చెప్తుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!!