Sitaramam Movie Review: సీతారామం ప్రీమియర్ టాక్... సినిమా హిట్టా? ఫట్టా?

First Published Aug 5, 2022, 6:03 AM IST

మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ మొదటిసారి డైరెక్ట్ తెలుగు మూవీ చేశారు. దర్శకుడు హను రాఘవపూడి పీరియాడిక్ ఎమోషనల్ లవ్ డ్రామాగా సీతారామం తెరకెక్కించారు. రష్మిక మందాన, మృణాళి ఠాగూర్ హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రాన్ని స్వప్న సినిమా బ్యానర్ లో అశ్వినీ దత్ నిర్మించారు... యూఎస్ లో ప్రీమియర్స్ ప్రదర్శన ముగియగా పేక్షకుల అభిప్రాయం ఏమిటో చూద్దాం... 
 

Sitaramam Review

కథ:
సినిమా 1985 ప్రాంతంలో ప్రారంభం అవుతుంది. పాకిస్తాన్ మేజర్ అయిన తారిఖ్ తన మనవరాలు అఫ్రీన్( రష్మిక మందాన)కి ఓ బాధ్యత అప్పజెబుతాడు. ఇండియాకు చెందిన మహాలక్ష్మి(మృణాళి ఠాగూర్) ఎక్కడుందో కనుక్కొని ఆమెకు ఇండియన్ ఆర్మీ లెఫ్టినెంట్ రామ్(దుల్కర్ సల్మాన్) 20 ఇళ్ళ క్రితం రాసిన లెటర్ అందజేయాలని చెబుతాడు. మహాలక్ష్మిని వెతికే క్రమంలో అఫ్రీన్ అనేక సమస్యలు ఎదుర్కొంటుంది. కొత్త విషయాలు తెలుసుకుంటుంది. ఎలాంటి పరిచయం లేని లెఫ్టినెంట్ రామ్ కి మహాలక్ష్మికి మధ్య ప్రేమ ఎలా మొదలైంది? రామ్ మహాలక్ష్మి ఎందుకు విడిపోయారు? ఇంతకీ రామ్, మహాలక్ష్మి ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఆ లెటర్ లో రామ్ ఏమి రాశాడు? అనేది మిగతా కథగా చెప్పొచ్చు. 

Sitaramam Review

మొదటి చిత్రం అందాల రాక్షసి తోనే టాలెంటెడ్ దర్శకుడిగా హను రాఘవపూడి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన రెండవ చిత్రం కృష్ణగాడి వీర ప్రేమగాథ కమర్షియల్ గా కూడా మంచి విజయం సాధించింది. లై, పడి పడి లేచె మనసు చిత్రాలు అనుకున్నంతగా ఆడకున్నా ఆయన టేకింగ్, స్టోరీ టెల్లింగ్ కి ప్రేక్షకులు మంచి మార్కులే వేశాడు. అలాంటి దర్శకుడు  సీతారామం(Sitaramam Review) ఫీల్ గుడ్ పీరియాడిక్ లవ్ డ్రామాతో మెప్పించే ప్రయత్నం చేశాడు. 
 

Sitaramam Review

సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం రొమాన్స్, సస్పెన్సు, హ్యూమర్ తో నడిపించాడు. దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan), మృణాళి ఠాగూర్ కెమిస్ట్రీ హైలెట్ అని చెప్పాలి. విజువల్స్ గురించి కూడా ప్రేక్షకులు గొప్పగా మాట్లాడుకుంటున్నారు. ఓ క్లాసిక్ లవ్ స్టోరీగా సీతారామం చిత్రాన్ని అభివర్ణిస్తున్నారు. ఆకట్టుకునే రొమాంటిక్ సన్నివేశాలతో పాటు, సస్పెన్సు ప్రేక్షకుల మదిలో క్యారీ అయ్యేలా దర్శకుడు చేయగలిగాడు. 
 

Sitaramam Review

మహాలక్ష్మికి ఏమైంది ? ఆమె ఎక్కడ ఉందనే? ఓ ఆత్రుత కలుగుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా డీసెంట్ గా ఉంది. సాంకేతికంగా  మూవీ ఉన్నత ప్రమాణాలు కలిగి ఉంది. అయితే మెల్లగా సాగే కథనం ఒకింత నిరాశపరిచే అంశం అంటున్నారు. ఎమోషనల్ లవ్ స్టోరీ చెప్పే క్రమంలో హను అక్కడక్కడా నిరాశకు గురి చేశారు.

Sitaramam Review


ఇక సెకండ్ హాఫ్ సైతం హను రాఘవపూడి క్వాలిటీ స్క్రీన్ ప్లేతో ఆకట్టుకున్నాడు. క్లైమాక్స్ వరకూ ఆ సస్పెన్స్ క్యారీ చేయగలిగారు. పతాక సన్నివేశాలు కూడా ఆకట్టుకున్నాయి. విశాల్ చంద్ర శేఖర్ మ్యూజిక్ మెప్పించింది. సాంగ్స్ తో పాటు బీజీఎమ్ సినిమాను ఎలివేట్ చేసింది. 

ప్రధాన పాత్రలు చేసిన దుల్కర్ సల్మాన్, మృణాళి ఠాగూర్, రష్మిక మందాన(Rashmika Mandanna)లు అద్భుతం చేశారు. హను రాఘవపూడి క్యాస్టింగ్ కూడా సినిమాకు కలిసొచ్చింది. మొత్తంగా మెజారిటీ ఆడియన్స్ సినిమా పట్ల పాజిటివ్ గా స్పందిస్తున్నారు. స్లో పేస్, రిపీటెడ్ రొమాన్స్ సన్నివేశాలు వంటి నిరాశపరిచే అంశాలున్నప్పటికీ ప్రేక్షకులకు మంచి అనుభూతి దక్కుతుంది అంటున్నారు. 
 


మరి ఈ క్లాసిక్ లవ్ స్టోరీ కమర్షియల్ గా ఎంత మేర సక్సెస్ అవుతుందో చూడాలి. ఈ మధ్య కాలంలో విడుదలైన చిత్రాలన్నీ వరుసగా డిజాస్టర్స్ అయ్యాయి. మరి దుల్కర్ సల్మాన్ సీతారామంతో నిర్మాతలకు, బయ్యర్లకు డబ్బులు కురిపిస్తాడనిపిస్తుంది. ఏది ఏమైనా వీకెండ్ ముగిసే నాటికి సినిమా ఫలితం తేలిపోతుంది. రూ. 18 కోట్ల టార్గెట్ తో సీతారామం థియేటర్స్ లో దిగుతుంది. 
 

click me!