ఒకప్పుడు బాలీవుడ్ చిత్రాల గురించి సౌత్ మొత్తం మాట్లాడుకునేవాళ్ళు. ప్రాంతీయ భాషల్లో ఈస్థాయి చిత్రాలు ఎప్పుడు వస్తాయో అని ఫ్యాన్స్ ఎదురుచూసే వాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. బాలీవుడ్ వాళ్ళు సౌత్ సినిమాల విజయాన్ని చూసి కుళ్ళుకునే పరిస్థితి ఏర్పడింది. సౌత్ లో గొప్ప చిత్రాలు తయారవుతున్నాయి. బాహుబలితో మొదలైన ఈ ప్రభంజనం.. ఆర్ఆర్ఆర్,పుష్ప, కెజిఎఫ్ 2 ఇలా కొనసాగుతూనే ఉంది.