Hansika Motwani: అందుకే హిందీ సినిమా చేయలేదు, హన్సికా మోత్వాని క్లారిటీ

Published : Apr 20, 2022, 10:28 PM IST

బాలీవుడ్ లోనే కెరీర్ స్టార్ట్ చేసిన హన్సికా మోత్వాని.. ఆ బాలీవుడ్ సినిమాకే దూరం అయ్యింది. ఎందుకు..? సౌత్ సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన హన్సికా.. బాలీవుడ్ వైపు ఎందకు చూడలేదో ఈ మధ్యే క్లారిటీ ఇచ్చింది.   

PREV
17
Hansika Motwani: అందుకే హిందీ సినిమా చేయలేదు, హన్సికా మోత్వాని క్లారిటీ

దేశ‌ముదురు సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది హన్సికా.  ఈ మూవీలో అల్లు అర్జున్ సరసన  వైశాలిగా న‌టించి కోట్లాదిమంది మ‌న‌సు దోచేసింది హ‌న్సికా మోత్వాని . ఈ ముంబై బ్యూటీ తెలుగు, త‌మిళంలో ఎక్కువ సినిమాలు చేసింది. మ‌ల‌యాళం, క‌న్న‌డ  ప్రేక్ష‌కుల‌ను ప‌లుక‌రించి వదిలేసింది. 
 

27

ఒక రకంగా చెప్పాలంటే టాలీవుడ్ లో కెరీర్ స్టార్ట్ చేసిన హన్సికాకు ఇక్కడ పెద్దగా కలిసి రాలేదు. తమిళంలో మాత్రం ఆడియన్స్ కు ఆరాధ్య దేవతగా మారిపోయింది హాన్సిక ఎటు చూసుకున్నా సౌత్ లోనే అటూ.. ఇటూ.. తిరిగింది కాని.. బాలీవుడ్ లో మాత్రం పాగా వేయలేక పోయింది. 
 

37

బాలీవుడ్ లో బాల నటిగా కెరిర్ స్టార్ట్ చేసింది హన్సికా. హృతిక్ రోషన్ హీరోగా నటించిన కోయి మిల్ గయా సినిమాలో చిన్నారి హన్సికా అందిరికి తెలిసిందే.. అయితే ఆతరువాత హీరోయిన్ గా మాత్రం బాలీవుడ్ లో రాణించలేకపోయింది. సౌత్ లో మాత్రం మంచి అవకాశాలతో దూసుకుపోయింది. 

47

అందరిలాగా హ‌న్సికా బాలీవుడ్‌పై అంత‌గా శ్ర‌ద్ద పెట్ట‌డం లేదు. 2008లో వ‌చ్చిన మ‌నీ హై తో హ‌నీ హై హిందీ సినిమాలో మెరిసిన హ‌న్సికా మ‌ళ్లీ ఆ త‌ర్వాత వైపు క‌న్నెత్తి కూడా చూడ‌లేదు. ఈ విషయంలో రీసెంట్ గానే క్లారిటీ ఇచ్చింది ముంబయ్ బ్యూటీ. 
 

57

సౌత్ లో బిగ్గెస్ట్ హిట్స్ కొట్టిన హ‌న్సికా హిందీ సినిమాలెందుకు చేయ‌డం లేద‌ని రిపోర్ట‌ర్ల నుంచి  ఓసారి ప్రశ్న ఎదుయ్యింది.  దీనిపై హ‌న్సికా స్పందిస్తూ..అన్ని ర‌కాల సినిమాలు చేయ‌డాన్ని నేను ఎంజాయ్ చేస్తా. కానీ నాకు ఆఫ‌ర్లు మాత్రం ఎక్కువ సౌత్ ఇండ‌స్ట్రీ నుంచే  వ‌స్తున్నాయి. ద‌క్షిణాదిన క‌థ‌ల‌తోపాటు కంటెంట్ ఎక్కువ‌గా ఉంటుంద‌ని నేను నమ్ముతాను అంటుంది హ‌న్సికా.

67

ప్ర‌స్తుతం హ‌న్సికా తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఎనిమిది సినిమాలతో బిజీ బిజీగా ఉంది. వీటిలో మై నేమ్ ఈజ్ శృతి, ఎంవై3, రౌడీ బేబీ ఫిలిమ్స్, పార్ట్‌న‌ర్‌తోపాటు విజ‌య్ చంద‌ర్ తో ఓ సినిమా చేస్తోంది. మొత్తానికి రానున్న రోజుల్లోనైనా హ‌న్సికా నుండి హిందీ సినిమా వస్తుందేమో అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. 

77

అయితే సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది హన్సికా. ఈమధ్య కెరీర్ బాగా స్లో  అవ్వడంతో.. కంప్లీట్ గా మేకోవర్ అయ్యింది హన్సిక. బొద్దుగా ఉండే ముద్దుగుమ్మ, సన్నగా, నాజూగ్గా తయారయ్యింది. ఇండస్ట్రీలో అవకాశాలు పెంచుకునే పనిలో ఉంది. 

Read more Photos on
click me!

Recommended Stories