Karthika Deepam: శౌర్యా కోపాన్ని చూసిన హిమ.. అనాధగా మారిన వంటలక్క కూతురు!

Published : Mar 14, 2022, 08:35 AM IST

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమయ్యే కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. కాగా ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

PREV
16
Karthika Deepam: శౌర్యా కోపాన్ని చూసిన హిమ.. అనాధగా మారిన వంటలక్క కూతురు!
Karthika Deepam

చంద్రమ్మ ఇంటిలో ఉన్న హిమ (Hima).. మీకు దండం పెడతాను. నన్ను హైదరాబాద్ తీసుకెళ్లండి అంటూ బ్రతిమిలాడుతుంది. మరోవైపు సౌర్య (Sourya).. తన చేతికి పచ్చబొట్టు రాసుకున్న హిమ పేరును తీసేయాలి అంటూ నీళ్ళతో కడుగుతూ ఉంటుంది. అది చూసిన సౌందర్య ఫ్యామిలీ ఎంతో బాధను వ్యక్తం చేస్తారు.
 

26
Karthika Deepam

అదే క్రమంలో సౌర్య హిమ ను మాత్రం నేను క్షమించను నానమ్మ అని సౌందర్య (Soundarya) తో చెబుతుంది. ఆ తర్వాత వారణాసి వచ్చి సౌర్య (Sourya) దగ్గర పాపం హిమమ్మా అంటూ హిమ ప్రస్తావన తేగా ఆపు వారణాసి అంటూ సౌర్య వారణాసి పై విరుచుకు పడుతుంది. అంతేకాకుండా అదే మా అమ్మా నాన్నలను చంపేసింది అని హిమ (Hima) గురించి బస్తీవాసులకు చెబుతుంది సౌర్య.
 

36
Karthika Deepam

ఆ తర్వాత బస్తీవాసులు ఇక మాకు ఎవరున్నారు అంటూ బాధపడతారు. దాంతో సౌందర్య (Soundarya) మా ఫ్యామిలీ మీకు మేము ఎప్పుడూ తోడుగా ఉన్నట్టు ఉంటాం అంటూ ధైర్యం చెబుతుంది. ఆ తర్వాత సౌందర్య ఎందుకే చనిపోయిన హిమ ను మళ్లీ చంపుతావు అంటూ సౌర్య (Sourya) ను అడుగుతుంది.
 

46
Karthika Deepam

మరోవైపు చంద్రమ్మ (Chandramma) ఫ్యామిలి హిమ ను హైదరాబాద్ తీసుకెళ్లడానికి డబ్బు కావాలి కనుక దొంగతనం చేయడానికి ప్లాన్ చేస్తారు. ఇక ఒక వ్యక్తి ను చంద్రమ్మ మాటల్లో పెట్టగా ఇంద్రుడు (Indrudu) డబ్బును కాజేస్తాడు. ఇక డబ్బులు కొట్టేసినందుకు చంద్రమ్మ ఫ్యామిలీ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తారు.
 

56
Karthika Deepam

మరోవైపు సౌందర్య (Soundarya) ఫ్యామిలీ ఒక నది ఒడ్డున చనిపోయిన ముగ్గురికి కర్మకాండలు జరిపిస్తూ ఉంటారు. ఆ తర్వాత సౌర్య దాని గుర్తులు ఏమీ ఈ ఇంట్లో ఉండకూడదు అంటూ హిమ ఫోటోను బయట పడేస్తుంది.  ఇక ఇంటికి వస్తున్న హిమ (Hima) అది చూస్తుంది.
 

66
Karthika Deepam

అదే క్రమంలో సౌర్య (Sourya).. హిమ అమ్మానాన్నలు మింగేసిన రాక్షసి అంటూ ఏడ్చుకుంటూ చెబుతుంది. ఇక అది విన్న హిమ (Hima) అక్కడినుంచి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. ఇక ఈ క్రమంలో రేపటి భాగం లో ఏం జరుగుతుందో చూడాలి.

click me!

Recommended Stories