సుశాంత్ కేసులో అరుదైన విచారణ పద్దతి.. దేశంలోనే మూడో సారి!

First Published | Aug 25, 2020, 11:11 AM IST

సుశాంత్ ఇంట్లో సీన్‌ రీ కన్స్‌స్ట్రక్షన్‌ కూడా చేశారు. అయితే తాజా సీబీఐ విచారణను మరింత వేగవంతం చేసినట్టుగా తెలుస్తోంది. సుశాంత్‌కు సంబంధించిన సోషల్ మీడియా పోస్ట్‌లు, వాట్సాప్‌ చాట్‌, ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో ఆయన మాట్లాడిన విషయాలు ఇలా ప్రతీ అంశాన్ని తెలుసుకుంటున్నారు.

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ మృతి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఈ కేసులో ముంబై పోలీసులు, పాట్నా పోలీసులు విచారణ జరుపుతుండగా తాజాగా సుప్రీం కోర్టు ఉత్తర్వులతో సీబీఐ ఎంటరైంది. ముంబై పోలీసుల నుంచి పూర్తి సమాచారం తీసుకున్న సీబీఐ జాతీయ స్థాయి నిపుణులతో కేసు విచారణ చేస్తున్నారు.
ఇప్పటికే పలువురి స్టేట్‌మెంట్స్ రికార్డ్‌ చేసిన అధికారులు, సుశాంత్ ఇంట్లో సీన్‌ రీ కన్స్‌స్ట్రక్షన్‌ కూడా చేశారు. అయితే తాజా సీబీఐ విచారణను మరింత వేగవంతం చేసినట్టుగా తెలుస్తోంది. సుశాంత్‌కు సంబంధించిన సోషల్ మీడియా పోస్ట్‌లు, వాట్సాప్‌ చాట్‌, ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో ఆయన మాట్లాడిన విషయాలు ఇలా ప్రతీ అంశాన్ని తెలుసుకుంటున్నారు.

సుశాంత్ మూడ్‌ ఎలా మారుతుంది, దేనికి ఎలా రియాక్ట్ అవుతాడు లాంటి విషయాలను కూడా ఆయన సన్నిహితులను అడిగి తెలుసుకుంటున్నారు. వీటి ద్వారా సుశాంత్ మెంటల్‌ స్టేటస్‌ ఏంటి అన్న అంశాల మీద ఓ అవగాహనకు రావచ్చని విచారణ బృంధాలు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే పూర్తి విచారణ సరళిని మైండ్‌ పోస్టమార్టమ్‌ అని వ్యవహరిస్తారని తెలుస్తోంది. అత్యంత క్లిష్టమైన కేసుల్లో మాత్రమే ఈ పద్దతిని అవలింస్తారట.
అయితే ఇండియాలో ఈ తరహా విచారణ చేయటం ఇది మూడోసారే అని తెలుస్తోంది. గతంలో సునంద పుస్కర్‌ కేసుతో పాటు బురారీ సామూహిక ఆత్మహత్యల కేసులో ఈ విధంగా మైండ్ పోస్ట్‌మార్టమ్‌ నిర్వహించారు పోలీసు అధికారులు.
కేసు విచారణ నిమిత్తం సీబీఐ టీం ముంబైలోని ఉంటూ ఎంక్వైరీ చేస్తున్నారు. ఆదివారం సుశాంత్ స్నేహితులను, ఇంట్లో పనివారిని విచారించారు అధికారులు. ఈ కేసులో సుశాంత్ గర్ల్‌ ఫ్రెండ్‌ రియా మీద తీవ్ర స్థాయిలో ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆమెను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.

Latest Videos

click me!