అల్లు అర్జున్ ప్రోత్సాహంతోనే కేదార్ నిర్మాతగా మారినట్లు తెలుస్తోంది. బన్నీ వాసు, విజయ్ దేవరకొండతో కూడా కేదార్ కి పరిచయాలు ఉన్నాయి. గంగం గణేశా చిత్రంతో పాటు ఫాల్కన్ క్రియేషన్స్ బ్యానర్ పై కేదార్ కొన్ని చిత్రాలని నిర్మించారు. సుకుమార్, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో కేదార్ ఒక చిత్రాన్ని ప్లాన్ చేశారు. కానీ ఆది కార్యరూపం దాల్చకముందే అతడు మరణించారు. కేదార్ మరణ వార్తతో అతడి సన్నిహితులు, స్నేహితులు విషాదంలో ఉన్నారు.