నితిన్ దిల్ సినిమాలో నటించిన ఈ 5 గురు నటులు ఎలా చనిపోయారో తెలుసా..?

First Published Oct 10, 2024, 5:10 PM IST

టాలీవుడ్ నుంచి ఎంతో మంది టాలెంట్ ఉన్న గొప్ప నటులు చాలా చిన్న వయస్సులోనే తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోయిన వారిలో దిల్ సినిమాలో నటించిన 5 గురు అద్భుతమైన నటులు ఉన్నారు వారు ఎవరో తెలుసా..? 

నితిన్ జయం సినిమాతో ఇండస్ట్రీకి పనిచయం అయినా.. దిల్ సినిమాతో అతనికి టాలీవుడ్ లో మాస్ ఇమేజ్ వచ్చింది. కమర్శియల్ హీరోగా సక్సెస్ అయ్యాడు. ఈసినిమాతోనే నిర్మాతగా రాజు స్టార్ డమ్ సాధించాడు. అప్పటి నుంచే దిల్ రాజు అన్న పేరు కూడా పడిపోయింది.

ఈక్రమంలో దిల్ సినిమాకు సబంధించిన ఓ విషయం ప్రస్తుతం వైరల్ అవుతోంది. అది ఏంటంటే.. దిల్ సినిమాలో నటించిన 5గురు నటులు ఇప్పుడు ఈ లోకంలో లేరు. వారు ఎలా చనిపోయారు.. అందులో చిన్నవయసువారు ఎవరో తెలుసా..? 

Also Read: చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత హీరోయిన్ గా చేసిన ఏకైక సినిమా
 

దిల్ సినిమాలో నితిన్   తండ్రిగా నటించిన సీనియర్ నటుడు  చలపతిరావు. ఆయన రీసెంట్ ఇయర్స్ లోనే గుండెపోటుతో మరణించారు. 78 ఏళ్ళ వయస్సులో చలపతిరావు.. 24 డిసెంబర్ 2022 లో ఇంట్లో భోజనం చేస్తూ.. అలానే కూర్చుని చనిపోయినట్టు తెలుస్తోంది. ఈ నటుడు ఎన్టీఆర్, ఏఎన్నార్ కాలం నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తూ వచ్చారు. విలన్ గా ఆయన పాత్రలు అద్భుతం అని చెప్పాలి. 

Also Read: ఐశ్వర్య రాయ్ తో విడాకుల వార్తలు, అభిషేక్ బచ్చన్ నెల జీతం ఎంతో తెలుసా?

Latest Videos


venumadhav

ఇక దిల్ సినిమాలో మనందరం మర్చిపోలేని పాత్ర చేశారు కమెడియన్ వేణుమాధవ్. ఈ సినిమాలో హీరో  నితిన్ కు మేన మామగా, నితిన్ కంటే కాస్త పెద్ద వయస్సు అయినా.. నితిన్ తో పాటే చదువకునే వ్యక్తిగా వేణుమాధవ్ నటన అద్భుతం. చలపతిరావ్ కు వేణుకు మధ్య పడే కామెడీ పంచులు ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టించాయి ఈసినిమాలో.

ఇక  వేణుమాధవ్ కూడా చాలా కెరీర్ ఉండగానే.. అతి చిన్న వయస్సులో  కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ 49 ఏళ్ల వయస్సులో 2019 సెప్టెంబర్ లో వేణు మాధవ్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. 

Also Read: శోభన్ బాబు నిక్కర్ వేసుకుని నటించిన సినిమా ఏదో తెలుసా..?

Ahuti Prasad

ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు ఆహుతి ప్రసాద్. చాలా సినిమాల్లో ఆహుతీ ప్రసాద్ నటన అందరిని ఆకట్టుకుంది. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే కాదు.. కొన్నిసినిమాల్లో ఆయన పండించిన సైలెంట్ కామెడీకి కడుపుబ్బా నవ్వుకున్నారు ఆడియన్స్.

అయితే  ఆహుతి ప్రసాద్ మాత్రం 60 ఏళ్లు రాకుండానే అతి చిన్న వయస్సులో మరణించారు. కాన్సర్ కారణంగా ఆయన 2015 జనవరి 4న 57 ఏళ్ళ వయస్సులో ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు.

Also Read:  అల్లు అర్జున్, ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్.. స్టార్ హీరోల ఫస్ట్ మూవీ హీరోయిన్స్ ఎవరో తెలుసా..?

విచిత్రం ఏంటంటే.. దిల్ సినిమాలో నటించిన ఆహుతీ ప్రసాద్ మరణించిన  30 రోజులకే.. ఇదే సినిమాలో  లెక్చరర్ పాత్రలో నటించి నవ్వులు పూయించిన ఎమ్మెస్ నారాయణ కూడా మరణించారు.

టాలీవుడ్ లో స్టార్ కమెడియన్ గా వెలుగు వెలిగిన ఎమ్మెస్... తన బాడీ లాంగ్వేజ్ తో కామెడీ పండిస్తూ.. కోట్లాది అభిమానులను సంపాదించుకున్నారు. జనవరి 23న 2015 లో   63 ఏళ్ళ వయస్సులో ఎమ్మెస్ నారాయణ అనారోగ్యంతో మరణించారు.

షారుక్ ఖాన్ తో సినిమాకు నో చెప్పిన కమల్ హాసన్
 

ఈ సినిమాలో హీరోయిన్ కు తాత పాత్రలో నటించిన రాజన్ పి దేవ్ గుర్తున్నారా.. ఆయన కూడా చాలా తక్కువ వయస్సులోనే మరణించారు. రాజన్ పి దేవ్ మలయాళ నటుడు. కాని ఆయన టాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించారు. మరీ ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆది సినిమాలో మెయిన్ విలన్ గా.. హీరోయిన్ ఫాదర్ గా కనిపించారు.

రాజన్ పి దేవ్ 58 ఏళ్ల వయస్సులో 2009 లో  అనారోగ్య కారణాలతోనే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఇలా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంతో మంది టాలెంట్ ఉన్న నటులను కోల్పోయింది.  దాంతో ప్రస్తుతం ఇతర భాషల నుంచి ఎక్కువ మంది నటులు తెలుగు ఇండస్ట్రీకి దిగుమతి అవుతున్నారు. 
 

click me!