Rashi Khanna Comments: సౌత్ సినిమాపై షాకింగ్ కామెంట్స్ చేసిన రాశీఖన్నా, రొటీన్ కు అలవాటు పడిందట...?

First Published | Mar 29, 2022, 7:33 AM IST

 సౌత్ సినిమాలో అవకాశాలకోసం ప్రయ్నాలు చేయడం.. స్టార్ డమ్ వచ్చాక అదే సౌత్ సినిమాను తిట్టడం..విమర్శించడం చాలామందికి ఇది అలవాటుగా మారింది. రీసెంట్ గా ఆ లిస్ట్ లో హీరోయిన్ రాశీ ఖన్నా కూడా చేరింది. 
 

మద్రాస్‌ కేఫ్‌, ఊహలు గుసగుసలాడే సినిమాలతో మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది రాశీఖన్నా. వరుస హిట్లు పడటంతో ఇక్కడే సెటిల్ అయ్యింది పంజాబీ బ్యూటీ. ఇక్కడే  వరుసగా ఆఫర్లు  తలపుతట్టడంతో ఆమె బాలీవుడ్ వైపు చూడలేదు.  
 

కాని ఇప్పుడు బాలీవుడ్ రాగం అందుకుంది రాశీ. దాదాపు 9 ఏళ్ల తర్వాత రుద్ర వెబ్‌ సిరీస్‌తో హిందీ  ఈఆడియన్స్ ను పలకరించింది రాశి. రిలీసెంట్ గా రిలీజ్ అయిన  ఈ వెబ్‌ సిరీస్‌ ఓటీటీలో రిలీజ్‌ అయ్యి పాజిటివ్‌ టాక్‌తో దూసుకుపోతోంది. అంతా బాగానే ఉంది. తన మానాన తాను బాలీవుడ్ సినిమాలు చేసుకుంటూ ఉంటే  బాగుండేది. కాని తనకు స్టార్ డమ్ ఇచ్చిన సౌత్ సినిమాపై ఎవరూ ఊహించని కామెంట్స్ చేసింది రాశీ.


తన ఈ వెబ్‌ సిరీస్‌ రుద్ర సక్సెస్‌ నేపథ్యంలో రాశి ఓ జాతీయ మీడియాతో మాట్లాడింది పనిలో పనిగా తనకు సౌత్ సినిమా మీద ఉన్న అక్కసునంతా చూపించుకుంది. కెరీర్‌ బిగినింగ్ లో సౌత్ ఇండస్ట్రీ వాళ్ళు తనను గ్యాస్‌ ట్యాంకర్‌ అంటూ  వెంకిరించారని గుర్తు చేసుకుంది.

అంతటితో ఆగలేదు రాశీ. సౌత్‌ ఇండస్ట్రీపై ఆమె షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది. ఈ సందర్భంగా రాశీ మాట్లాడుతూ.. తనకు రోటీన్‌గా ఉండటం నచ్చదని, కానీ సౌత్ సినిమాలో అడుగు పెట్టాక రొటీన్ కు  అలవాటు పడిపోయానంది.  తెలుగులో కొన్ని  కమర్షియల్‌ సినిమాలు చేసినప్పటికీ.. రోటిన్‌ ఫార్ములాలోనే ఉండిపోయానంటోంది.

సౌత్‌ ఇండస్ట్రీ క్రియేట్‌ చేసిన రోటీన్‌ ఫార్ములాలన్నింటిని దాటుకుంటూ వచ్చాను. ఇక నాలో కొత్త రాశీని చూస్తారంటూ చెప్పుకొచ్చింది అంతే కాదు. దక్షిణాదిన హీరోయిన్లను వారి ప్రతిభతో కాకుండా లుక్స్‌ పరంగా గుర్తింపు ఇస్తారంది. అభిమానులు హీరోయిన్లకు రకారకాల ట్యాగ్‌ ఇస్తుంటారని, అది తనకు అసలు నచ్చదని చెప్పింది. 

అక్కడ హీరోయిన్లను మిల్కీ బ్యూటీ అని పిలుస్తుంటారు.. కానీ అంతకు మించిన టాలెంట్‌ హీరోయిన్స్‌లో ఉంటుందని సౌత్‌ ప్రేక్షకులు, అభిమానులు గుర్తించాలంటోంది రాశీ ఖన్నా.  సౌత్ నుంచి రష్మిక, పూజా లాంటి స్టార్స్ ఇక్కడే గుర్తింపుపొంది బాలీవుడ్ చేరుతున్నారు. కాని వాళ్ళెవరూ సౌత్ పై ఇలాంటి మాటలు అనలేదు. కాని రాశీ మాత్రం ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. 
 

రాశీ ఖన్నా రుద్రతో పాటు మరికొన్ని బాలీవుడ్ ప్రాజెక్ట్స్ తో చేస్తోంది.త్వరలోనే ఆమె సిద్ధార్థ్‌ మల్హోత్రా, షాహిద్‌ కపూర్‌ వంటి స్టార్‌ హీరోలతో జతకట్టనుంది. ఇక తెలుగులో రాశీ నాగచైతన్య సరసన థ్యాంక్యూ మూవీలో నటిస్తుంది. ఈ టైమ్ లోనే ఆమె  ఇలాంటి మాటలు అన్నది రాశీ. మరి దీనిపై సౌత్ నుంచి ఎలాంటి స్పందనలు వస్తాయో చూడాలి. 

Latest Videos

click me!