Karthik Deepam: శౌర్య హైదరాబాద్ లోనే ఉందని తెలుసుకున్న సౌందర్య.. జ్వాలే తన అక్క అనుకుంటున్న హిమ!

Navya G   | Asianet News
Published : Mar 28, 2022, 08:22 AM IST

Karthik Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ కుటుంబ కథా నేపథ్యంలో సాగుతుంది. పైగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాగా ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.  

PREV
16
Karthik Deepam: శౌర్య హైదరాబాద్ లోనే ఉందని తెలుసుకున్న సౌందర్య.. జ్వాలే తన అక్క అనుకుంటున్న హిమ!

జ్వాలా (Jwala) సత్య సార్ ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను గుడికి వెళ్ళాలి అని మనసులో అనుకుంటుంది. మరోవైపు సౌందర్య.. దీప, కార్తీక్ (Karthik) ల పేరు మీద అన్నదానం చేయించాలి అనుకున్నాను. ఇంతలో ఆయన హాస్పిటల్ లో పడ్డారు అని ఆలోచించుకుంటూ వస్తుంది.
 

26

ఆ తర్వాత జ్వాలా (Jwala) ఇంద్రుడు దంపతులతో ఒక గుడిలో ఉంటుంది. అదే గుడికి కారులో సౌందర్య కూడా వస్తుంది. ఆ తర్వాత జ్వాల ఈ రోజు అన్నదానం నేనే చేయిస్తాను అని అన్నదాన సత్రానికి డబ్బులు ఇస్తుంది. మరోవైపు సౌందర్య (Soundarya) కార్తీక్, దీప ల పేరు మీద అన్నదానం చేయించడానికి వచ్చాను అని మనసులో దేవుడితో అంటుంది.
 

36

ఇక మరోవైపు జ్వాల (Jwala) పూజారి దగ్గరికి వెళ్లి చనిపోయిన మా అమ్మానాన్నలు పేరు మీద అన్నదానం జరిపించాలి అని చెబుతుంది. ఇక అదే పూజారి దగ్గరికి వచ్చి సౌందర్య (Soundarya) అన్నదానం జరిపించాలి అని చెప్పి వివరాలు చెబుతుంది.
 

46

వెంటనే ఆ పూజారి ఇప్పుడు ఈ పేర్ల మీద ఒక అమ్మాయి అన్నదానం జరిపించాలి అని చెప్పి వెళ్ళింది అని అంటాడు. ఇక దాంతో సౌందర్య (Soundarya)  వివరాలు కనుక్కుంటూ ఎంతో ఆనందంగా ఫీల్ అవుతుంది. మరో జ్వాలా (Jwala) గుడి నుంచి వెళ్ళిపోతుంది.
 

56

ఇక ఇంటికి వచ్చిన సౌందర్య (Soundarya) సౌర్య ఈ సిటీ లోనే ఉందని ఆనందరావుకి చెబుతుంది. దాంతో ఆనందరావు (Anand rao) మన మీద కోపంతో కావాలనే తప్పించుకుని తిరుగుతుంది అనుకుంటా అని సౌందర్య తో చెబుతాడు. మరోవైపు నిరూపమ్ హాస్పిటల్ లో జరిగిన దాని గురించి ఆనందంగా ఫీల్ అవుతూ వస్తాడు.
 

66

ఆ తర్వాత నిరూపమ్ (Nirupam) ఆ ఆటో అమ్మాయిని చూస్తే నాకు ఎందుకు సౌర్యలా అనిపిస్తుంది అని హిమ తో అంటాడు. దాంతో హిమ కూడా నా మనసులో మాట చెప్పావు అని అంటుంది. నాకు కూడా సౌర్య లాగే అనిపిస్తుంది అని అంటుంది. ఈ క్రమంలో అక్కడకు సౌర్య (Sourya) వస్తుంది. ఇక రేపటి భాగం లో ఏం జరుగుతుందో చూడాలి.

click me!

Recommended Stories