సౌందర్య మొదటిసారి వృద్ధురాలిగా నటించిన సినిమా ఏంటో తెలుసా? 30వేల మంది మధ్య మర్చిపోలేని సంఘటన

Published : Jul 19, 2025, 10:28 PM IST

సౌందర్య చాలా వరకు ప్రియురాలిగా, ఫ్యామిలీని పోషించే అమ్మాయిగా కనిపించింది. కొన్ని దీ గ్లామర్‌ రోల్స్ కూడా చేసింది. కానీ వృద్ధురాలిగా తొలిసారి కనిపించిన మూవీ ఏంటో తెలుసా? 

PREV
15
గ్లామర్‌ కి దూరంగా సాంప్రదాయానికి సౌందర్య పెద్ద పీఠ

తెలుగు సహజ నటి సౌందర్య మన నుంచి దూరమై రెండు దశాబ్దాలు గడిచినా ఆమె ఇంకా మన మధ్య ఉన్నట్టుగానే ఉంటుంది. తన సినిమాలతో అలరిస్తూనే ఉంది. ఆమె అద్భుతమైన నటన మెప్పిస్తూనే ఉంది.  

గ్లామర్‌కి దూరంగా ఉంటూ సాంప్రదాయానికి పెద్ద పీఠ వేసిన సౌందర్య సినిమా జీవితంలో అనేక ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి. అందులో కొన్ని ఆమె ఎప్పటికీ మర్చిపోలేని సంఘటనలు కూడా ఉన్నాయి.

25
`శ్రీరాములయ్య` సినిమా విశేషాలు

సౌందర్య ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఆమె చాలా కమర్షియల్‌ చిత్రాలు చేసింది. కొన్ని అభ్యుదయ చిత్రాల్లో కూడా నటించింది. అలాంటి మూవీనే `శ్రీరాములయ్య`. 

పరిటాల రవి తండ్రి పరిటాల శ్రీరాములు జీవిత కథని స్పూర్తిగా తీసుకుని రూపొందించిన చిత్రమిది. దీనికి ఎన్‌ శంకర్‌ దర్శకత్వం వహించగా, ఇందులో మోహన్‌ బాబు హీరోగా నటించారు. హరికృష్ణ, శ్రీహరి కీలక పాత్రలు పోషించారు.

35
`శ్రీరాములయ్య` చిత్రం కోసం ఎండ్లబండ్లపై వచ్చిన జనం

1998లో విడుదలైన `శ్రీరాములయ్య` మూవీ ఆడియెన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది. అప్పట్లో కమ్యూనిస్ట్ ల ప్రభావం ఉండటంతో ఇలాంటి చిత్రాలు మంచి ఆదరణ పొందాయి. బ్లాక్‌ బస్టర్స్ గా నిలిచాయి. 

అలా ఈ మూవీ కూడా పెద్ద హిట్‌ అయ్యింది. ఊర్లల్లో జనాలు ఎండ్లబండ్లు, ట్రాక్టర్లు కట్టుకుని మరీ థియేటర్ కి వెళ్లి సినిమా చూసి వచ్చిన సందర్భాలున్నాయి. అంతగా పల్లె జనాలను ప్రభావితం చేసిన చిత్రమిది.

45
మొదటిసారి వృద్ధురాలిగా కనిపించిన సౌందర్య

అయితే ఇందులో శ్రీరాములుగా నటించిన మోహన్‌ బాబుకి భార్య పాత్రలో నటించింది సౌందర్య. ఇందులో మొదటి షాట్‌లో సౌందర్య వృద్ధురాలిగా కనిపిస్తుంటుంది. 

శ్రీరాములు పాత్ర చనిపోయిన తర్వాత ఆయన స్థూపం ఆవిష్కరించే సీన్‌ అది. ఆ సీన్‌లో జనాలను ఉద్దేశించి సౌందర్య మాట్లాడుతుంది. 

ఈ సీన్‌ గురించి, ఈ మూవీ గురించి సౌందర్య మాట్లాడుతూ, తనకు బాగా నచ్చిన చిత్రాల్లో ఇది ఒకటని చెప్పింది. తనకు ఇదొక డిఫరెంట్‌ ఎక్స్ పీరియెన్స్ ని ఇచ్చిన మూవీ అని తెలిపింది సౌందర్య.

55
`శ్రీరాములయ్య`లో సౌందర్యకి నచ్చినవి ఇవే

`శ్రీరాములయ్య` మూవీలో తాను మొదటిసారి వృద్ధురాలి పాత్రని పోషించానని, అది తనకు కొత్త అనుభావాన్ని ఇచ్చిందని చెప్పింది సౌందర్య. 

మొదటి సీన్‌లో దాదాపు 30వేల మంది జనాలు ఉంటారు. ఆ సీన్‌లో తాను జనాలను ఉద్దేశించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు చాలా టెన్షన్‌ పడిందట. ఆ సీన్‌ చేసేటప్పుడు ఇబ్బంది పడినట్టు తెలిపింది సౌందర్య. దర్శక, నిర్మాతలు ఇచ్చిన సపోర్ట్ తో ఆ సీన్‌ చేశానని తెలిపింది. 

ఇక ఇందులో తనని పోలీసులు ఇన్వెస్టిగేట్‌ చేసే సీన్‌, మరోవైపు ఫ్యామిలీ అందరితో సరదాగా ఉండే సీన్లు ఎంతగానో నచ్చాయని, వాటిలో బాగా ఎంజాయ్‌ చేశానని తెలిపింది సౌందర్య.

 పాటల్లో అన్ని పాటలు బాగా నచ్చాయని కాకపోతే `గడియ గడియల్లో` పాట మనకు దగ్గరైన పాటగా తెలిపింది సౌందర్య. ఈ మూవీ విడుదల సమయంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అనుభవాలను పంచుకుంది. అదిప్పుడు వైరల్‌గా మారింది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories