Karthika Deepam: దీపాకు నిజం చెప్పడానికి భయపడుతున్న సౌందర్య.. నిజం తెలుసుకునే ప్రయత్నంలో వంటలక్క!

Navya G   | Asianet News
Published : Feb 25, 2022, 11:52 AM IST

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్ కార్తీకదీపం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత 5 ఏళ్లుగా టీఆర్పీలో దూసుకుపోతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో తెలుసుకుందాం..  

PREV
18
Karthika Deepam: దీపాకు నిజం చెప్పడానికి భయపడుతున్న సౌందర్య.. నిజం తెలుసుకునే ప్రయత్నంలో వంటలక్క!

సీరియల్ ప్రారంభంలోని సౌందర్య హిమను తాడికొండ నుంచి వచ్చాక మీరు చాలా మారిపోయారు అని తిడుతూ ఉంటుంది. హిమ మేము ఏమీ మారలేదు మీరే మారిపోయారు అంటుంది. సౌందర్య ఆనంద్ వచ్చాక దీపుని దూరంగా పెడుతున్నారు అంటుంది. హిమ మాత్రం ఆనంద మా తమ్ముడు అని వీడిని మీరు మా తమ్ముడిగా ఒప్పుకోవాల్సిందే అని లేకపోతే తాడికొండకు వెళ్లిపోతానని బెదిరిస్తుంది.
 

28

సౌందర్య మాత్రం ఆనంద్ మీద ప్రేమ ఎక్కడికి దారి తీస్తుందో, పిల్లలకు త్వరగా నిజం చెప్పేయాలి అని అనుకుంటుంది. ఇక కార్తీక్ హాస్పిటల్లో పేషెంట్లను చూస్తూ ఉంటాడు ఈలోపు మోనిత వచ్చి ఏడుస్తున్నట్టు నటిస్తూ తన బిడ్డ గురించి అడుగుతూ ఉంటుంది. కార్తీక్ నీ దగ్గర వీడియో ఉంది కదా అది నాకు ఇవ్వు అని అడిగితే తన ప్లాన్ ఎక్కడ ఫెయిల్ అవుతుందో అని వీడియో డిలీట్ అయిపోయిందని అబద్ధం చెప్తుంది దాంతో కార్తీక్ మౌనితను తిట్టి పంపుతాడు.
 

38

కార్తీక్, దీప ఇద్దరూ కూడా మౌనిత కు ఇచ్చిన మాట గురించి ఆలోచిస్తూ ఉంటారు. దాని గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదంతా చూస్తున్న సౌందర్య తమకు వచ్చిన సమస్య నుంచి ఎలా బయట పడాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. మోనిత మాత్రం తన కొడుకు కార్తీక్ దగ్గర పెరుగుతున్నందుకు సంతోష పడి పోతూ ఉంటుంది.
 

48

ఇక ఎలాగైనా తన కొడుకు ద్వారా కార్తీక్ దగ్గరికి వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. సౌందర్య హిమ అన్న మాటలు గురించి ఆలోచిస్తూ ఉంటుంది. దీప అప్పారావు వచ్చిన విషయాన్ని గురించి అడుగుతుంది. అప్పారావు కొన్ని ఫోటోలను ఇచ్చి వెళ్లిన విషయాన్ని సౌందర్య చెబుతోంది.
 

58

అప్పారావు ఇచ్చిన ఫోటోలని చూస్తూ మేము కూడా ఆనంద్ తో ఇలా ఫోటో తీయించుకోవాలి అని సౌందర్యకు చెబుతుంది. సౌందర్య మాత్రం మనసులో మోనిత కొడుకు మీద అందరూ ఇంత ప్రేమపెంచుకుంటున్నారు. నిజం తెలిస్తే ఏమవుతుందో అని బాధపడుతూ ఉంటుంది. కార్తీక్ మోనిత,దీప అన్న మాటల గురించి ఆలోచిస్తూ ఉంటాడు.
 

68

కార్తీక్ లక్ష్మణ్ ను పిలిపించి బాబు గురించి అడుగుతాడు. కానీ లక్ష్మణ్ నాకు ఏమీ తెలియదు అని చెప్పడంతో లక్ష్మణ్ ను పంపిస్తాడు. మోనిత బాబు విషయంలో కంటే,నా విషయంలోనే ఎక్కువ శ్రద్ధ చూపిస్తుంది అని మోనిత కొడుకును తొందరగా తీసుకురావాలి అంటూ బాబు తొందరగా దొరికేలా చేయమని దేవుడిని వేడుకుంటూ ఉంటాడు.
 

78

దీపా అప్పారావు తీసుకు వచ్చినా కోటేష్,శ్రీవల్లి బాబుతో కలిసి ఉన్న ఫోటోలను చూస్తూ ఆనంద్ ను మీరు కోరుకున్నట్టే డాక్టర్ ని చేస్తానంటుంది. కోటేశ్ రాసిన పుస్తకంలో కార్ నెంబర్ ను, క్షమించండి అమ్మ అని ఉండడాన్ని చూస్తుంది. ఎవరిదీ కార్ నెంబర్ అని ఆలోచిస్తూ ఉంటుంది దీపా.
 

88

దీపా కూరగాయలు తీసుకొని ఇంటికి వెళుతూ ఉండగా దారిలో పుస్తకంలో ఉన్న కార్ నెంబర్ గల కారును చూసి అది మోనిత కార్ ని తెలుసుకుంటుంది. పోలీస్ స్టేషన్ కు వెళ్లి అక్కడ కోటేష్ బాబు ని తీసుకు వచ్చిన ఈ వీడియోని చూసి ఆనంద్ మోనిత  కొడుకు అన్న నిజాన్ని తెలుసుకుంటుంది. మరి రానున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాల్సిందే.

click me!

Recommended Stories