ఇక ఆ క్రమంలోనే సౌందర్య (Soundarya), కార్తీక్ తో తాకట్టులో నా కోడలు బంగారం కూడా తీసుకొని రా అని చెబుతుంది. కానీ కార్తిక్ ఈ డబ్బు తీసుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది అని అంటాడు. దాంతో సౌందర్య ఇదంతా నీ సంపాదన రా అని చెబుతుంది. తర్వాత వాళ్ళ దగ్గరకు సౌర్య, హిమ (Hima) లు వచ్చి మనం రెస్టారెంట్ లో తిందామా డాడీ అని అడుగుతారు.