Deepika: ముద్దు సీన్ల గురించి మీ భర్తకి చెప్పారా?.. నెటిజన్‌ ప్రశ్నకి ప్రభాస్‌ హీరోయిన్‌ షాకింగ్‌ ఆన్సర్‌

Published : Feb 09, 2022, 08:57 PM IST

దీపికా పదుకొనె ప్రస్తుతం `గెహ్రైయాన్‌` అనే సినిమాలో నటిస్తుంది. ఇందులో అత్యంత రొమాంటిక్‌ సీన్లలో నటించింది. దీంతో ఆమెపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ట్రోల్స్ వైరల్‌ అవుతున్నాయి.   

PREV
18
Deepika: ముద్దు సీన్ల గురించి మీ భర్తకి చెప్పారా?.. నెటిజన్‌ ప్రశ్నకి ప్రభాస్‌ హీరోయిన్‌ షాకింగ్‌ ఆన్సర్‌

బాలీవుడ్‌లో రొమాంటిక్‌ సినిమాలు, వెస్ట్రన్‌ కల్చర్‌ బేస్డ్ చిత్రాలు చాలా కాలంగానే వస్తున్నాయి. ఆ జోనర్‌లోనే తాజాగా దీపికా పదుకొనె, అనన్య పాండే నటించిన `గెహ్రైయాన్‌` కూడా ఉంది. ఈ నెల 11న అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల కాబోతుంది. అయితే ఈ చిత్రంలో దీపికా, నటుడు సిద్ధాంత్‌ చతుర్వేది మధ్య వచ్చే రొమాంటిక్‌ సన్నివేశాలు పీక్‌లో ఉన్నాయి. డోస్ పెంచి ఉండటం ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతుంది. 

28

మ్యారేజ్‌ అయిన దీపికా పదుకొనె ఇలాంటి సినిమా చేయడం, ఇలాంటి పాత్ర చేయడం, అది కూడా ఇలాంటి సీన్లు చేయడం ఇప్పుడు మరింత హాట్‌ న్యూస్‌గా మారింది. రెగ్యూలర్‌గా ఈ చిత్రంలోని రొమాంటిక్‌ సీన్లు విడుదల చేస్తుంది యూనిట్‌. దీంతో సినిమాపై హైప్‌ పెరుగుతుంది. అదే సమయంలో వివాదంగానూ మారుతుంది. ముఖ్యంగా చాలా మంది నెటిజన్లు దీపికా పదుకొనెని టార్గెట్‌ చేస్తున్నారు. 

38

ఈ చిత్రంలో దీపికా.. సిద్ధాంత్‌తో లిప్‌ కీస్‌లు, బెడ్‌రూమ్‌ సీన్లు చేయడంపై నెటిజన్లు ఫైర్‌ అవుతున్నారు. ఇంటర్నెట్‌ వేదికగా దీపికాపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అందులో భాగంగా తాజాగా దీపికా పలు కాంట్రవర్షియల్‌ క్వశ్చన్స్ ని ఎదుర్కొంది. `రొమాంటిక్‌, లిప్‌లాక్‌ సీన్లకి సంబంధించి మీ భర్త రణ్‌వీర్‌ సింగ్‌ పర్మిషన్‌ తీసుకున్నారా? ఈ విషయాలను ఆయనతో చర్చించారా? అంటూ కామెంట్‌ చేశారు. 

48

చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో దీపికా ఈ ప్రశ్నపై రియాక్ట్ అయ్యింది. ఇలాంటి ప్రశ్నలకు నేను స్పందించడం ముర్ఖత్వమే అవుతుందని వెల్లడించింది. తన జీవితంలో నటనకు ఎంత ప్రయారిటీ ఉందో తనకు తెలుసు అని, ఈ విషయం తన భర్త రణ్‌వీర్‌ సింగ్‌ కూడా తెలుసని చెప్పింది దీపికా. 
 

58

అయితే తాను సోషల్‌ మీడియాలో వచ్చే కామెంట్లని అస్సలు చదవనని, `నా సినిమాల గురించి నా భర్తతో చర్చిస్తానా లేదా అనేది నా వ్యక్తిగత విషయం. ఇలాంటి వ్యాఖ్యలు చేసినవారు చాలా తెలివి తక్కువ వారు అనిపిస్తుంది. అదే సమయంలో వారు చిన్న చిన్న విషయాల పట్ల ఎక్కువగా ఆలోచిస్తున్నారనిపిస్తుంది` అని సదరు నెటిజన్‌కి మరో ఛాన్స్ లేకుండా చేసింది. దీంతో దీపికాపై ఇలాంటి కామెంట్ చేయాలనుకునే వారికి కూడా గట్టి కౌంటర్‌ ఇచ్చింది దీపికా. 
 

68

మరోవైపు `గెహ్రైయాన్‌` చిత్ర ప్రమోషన్‌లో గత పది రోజులుగా ఫుల్‌ బిజీగా గడుపుతోంది దీపికా. అనన్య పాండే, ఇతర నటులు సైతం ప్రమోషన్‌ కార్యక్రమాల్లో బిజి బిజీగా ఉంటున్నారు. అమెజాన్‌ ప్రైమ్‌ వంటి ఓటీటీలో రిలీజ్‌ కాబోతున్న ఈ చిత్రానికి ఈ రేంజ్‌లో ప్రమోషన్‌ చేయడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. 

78

 ప్రమోషన్‌లో భాగంగా గ్లామర్‌ ఫోటోలతో నెట్టింట దుమ్మురేపుతుంది. ట్రెండీ వేర్‌లో పొట్టి దుస్తులు, గ్లామర్‌ దుస్తులు ధరించి రెచ్చిపోతుంది. కుర్రాళ్లని రెచ్చగొడుతుంది. అలా దీపికా పంచుకునే లేటెస్ట్ హాట్‌ ఫోటోలు సామాజిక మాధ్యమాలను షేక్‌ చేస్తున్నాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 
 

88

ఇక నటిగానూ ఇతర భారీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉంది దీపికా పదుకొనె. ప్రస్తుతం ఆమె తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ ప్రభాస్‌ సరసన నటిస్తుంది. నాగ్‌ అశ్విన్‌ రూపొందిస్తున్న `ప్రాజెక్ట్ కే` చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ చిత్ర షూటింగ్‌ ఇప్పటికే ప్రారంభమైంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఈ చిత్ర షూటింగ్‌కి సంబంధించి మొదటి షెడ్యూల్‌లో దీపికా పాల్గొన్న విషయం తెలిసిందే. దీంతోపాటు దీపికా పదుకొనె ప్రస్తుతం హిందీలో `సర్కర్‌` చిత్రంలో గెస్ట్ రోల్‌ చేస్తుంది. మరోవైపు షారూఖ్‌ ఖాన్‌ `పఠాన్‌` సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories