సౌందర్య తమ్ముడి పెళ్లికి ఆ ఒక్క సూపర్‌ స్టార్‌నే పిలవడానికి కారణం ఏంటో తెలుసా? అసలు కథ వేరే ఉంది

Published : Aug 04, 2025, 09:20 PM IST

సౌందర్య తన కంటే ముందు తమ్ముడి పెళ్లి చేసింది. ఈ పెళ్లికి ఒకే ఒక్క సూపర్‌ స్టార్‌ హాజరయ్యారు. ఆయన ఎవరు? ఆ కథేంటో తెలుసుకుందాం.  

PREV
15
చీరకే అందం తెచ్చిన సౌందర్య

సౌందర్య తెలుగు ఆడియెన్స్ ని ఎంతగా ఆకట్టుకుందో తెలిసిందే. ఆమె ఇప్పుడు మన మధ్య లేకపోయినా తన సినిమాలతో అలరిస్తూనే ఉంది. సినిమాల ద్వారా తాను అందరి హృదయాల్లో చిరంజీవిగానే ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అద్భుతమైన నటనతో మెప్పించి అలరించింది సౌందర్య. చీరకే అందం తెచ్చింది. ఇతర హీరోయిన్లు గ్లామర్‌తో పోటీ ఇవ్వగా, తను మాత్రం చీరలోనే కనిపించి మెప్పించింది. సాంప్రదాయానికే పెద్ద పీఠ వేసింది. తెలుగులో అందరు టాప్‌ హీరోలకు జోడీగా నటించి మెప్పించింది. పుట్టింది కర్నాటకలో అయినా తెలుగు అమ్మాయిగా మారిపోయింది సౌందర్య.

DID YOU KNOW ?
సౌందర్య తొలి మూవీ
సౌందర్య తెలుగులో మొదటిసారి సైన్‌ చేసిన మూవీ `రైతు భారతం`. కానీ `మనవరాలు పెళ్లి`(1993) మొదట రిలీజ్‌ అయ్యింది. ఈ మూవీ రిలీజ్‌ అయిన 15 సినిమాల తర్వాత `రైతు భారతం` రిలీజ్‌ అయ్యింది.
25
తన కంటే తమ్ముడి పెళ్లి ముందు చేసిన సౌందర్య

సౌందర్య పెళ్లికంటే ముందే సోదరుడి(తమ్ముడు అమర్‌) వివాహం జరిగింది. తమ్ముడి పెళ్ళి సౌందర్యనే స్యయంగా దగ్గరుండి జరిపించింది. 1997లో ఈ మ్యారేజ్‌ జరిగింది. అప్పటికే సౌందర్య సౌత్‌లో స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తోంది. దీంతో తమ్ముడి పెళ్లిని చాలా గ్రాండ్‌గా నిర్వహించింది. కాకపోతే సినిమా పరిశ్రమ నుంచి ఆమె ఎవరినీ ఆహ్వానించలేదు. పూర్తి ప్రైవేట్‌గానే మ్యారేజ్‌ నిర్వహించింది.

35
సౌందర్య తమ్ముడి పెళ్లికి హాజరైన వెంకటేష్‌

సోదరుడి వివాహానికి సినిమా ఇండస్ట్రీ నుంచి ఒకే ఒక్క స్టార్‌ హీరోని ఆహ్వానించింది సౌందర్య. ఆయన ఎవరో కాదు విక్టరీ వెంకటేష్‌. కేవలం వెంకటేష్‌ ఒక్కరే సౌందర్య సోదరుడి వివాహ వేడుకకి హాజరయ్యారు. పెళ్లి జంటని ఆశీర్వదించారు. సౌందర్య, వెంకటేష్‌ కలిసి ఎక్కువ సినిమాలు చేశారు. దాదాపు ఎనిమిది మూవీస్‌లో కలిసి నటించారు. అందులో `రాజా`, `పవిత్ర బంధం`, `ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు`, `జయం మనదేరా`, `దేవి పుత్రుడు`, `నిన్నే ప్రేమిస్తా`, `పెళ్లి చేసుకుందాం` వంటి చిత్రాలున్నాయి. ఇందులో ఒకటి రెండు తప్ప మిగిలిన అన్ని సినిమాలు సూపర్‌ హిట్‌గా నిలిచాయి. దీంతో వెంకీ, సౌందర్యలది హిట్‌ పెయిర్‌గా నిలిచింది.

45
సౌందర్య, వెంకీ మధ్య రూమర్లు

అయితే అప్పట్లో ఈ ఇద్దరు వరుసగా కలిసి సినిమాలు చేయడంతో ఇద్దరు ప్రేమలో ఉన్నారనే వార్తలు వచ్చాయి. అప్పటికే వెంకటేష్‌కి మ్యారేజ్‌ అయ్యింది. అయినా ఈ ఇద్దరు డేటింగ్‌లో ఉన్నారని, వెంకీతో సౌందర్యకి ఎఫైర్‌ ఉందని రూమర్లు వచ్చాయి. ఈ క్రమంలో తన సోదరుడి పెళ్లికి కేవలం వెంకీనే ఆహ్వానించడంతో ఆ రూమర్స్ కి మరింత బలం చేకూరినట్టయ్యింది.

55
సౌందర్య తమ్ముడి పెళ్లికి వెంకటేష్‌ అటెండ్‌ కావడానికి కారణం ఇదే

ఆ మ్యారేజ్‌కి వెంకీ ఒక్కరినే పిలవడానికి అసలు కారణం అది కాదు. ఆ సమయంలో వెంకటేష్‌, సౌందర్య కలిసి `పెళ్లి చేసుకుందాం` అనే సినిమాలో నటిస్తున్నారు. ఆ మూవీ షూటింగ్‌ బెంగుళూరులోనే జరుగుతుంది. దీంతో ఆయన్ని మాత్రమే ఆహ్వానించిందట సౌందర్య. అలా వెంకీ ఆ పెళ్లికి వెళ్లాల్సి వచ్చింది. కానీ బయట మాత్రం పుకార్లు వేరేలా షికార్లు చేశాయి. అవే ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నాయి.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories