బ్యాంకాక్‌లో రజనీకాంత్‌ చేసిన పనికి షాక్‌ అయిన నాగార్జున.. ఈ ఏజ్ లో కూడా సూపర్‌ స్టార్‌ ఏం చేశారంటే?

Published : Aug 04, 2025, 06:57 PM IST

రజనీకాంత్‌తో కలిసి నాగార్జున నటించిన `కూలీ` సినిమా క్లైమాక్స్ సన్నివేశాలను బ్యాంకాక్‌లో చిత్రీకరించారు. ఆ షూటింగ్‌ సమయంలో చోటు చేసుకున్న సంఘటనని పంచుకున్నారు నాగార్జున. 

PREV
15
రజనీకాంత్‌ `కూలీ`లో నెగటివ్‌ రోల్‌ చేసిన నాగార్జున

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా రూపొందుతున్న `కూలీ` సినిమాలో కింగ్‌ నాగార్జున ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఆయనది నెగటివ్‌ రోల్. లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో తెరకెకెక్కిన ఈ చిత్రంలో ఉపేంద్ర, అమీర్‌ ఖాన్‌, శృతి హాసన్‌, సత్యరాజ్‌ వంటివారు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.  పూజా హెగ్డే స్పెషల్‌ సాంగ్‌ చేసింది. సన్‌ పిక్చర్స్ నిర్మించిన ఈ మూవీని ఏషియన్‌ సినిమాస్‌ పతాకంపై సునీల్‌ నారంగ్‌, దిల్‌ రాజు, సురేష్‌ బాబు సంయుక్తంగా తెలుగులో విడుదల చేస్తున్నారు.

DID YOU KNOW ?
పూజా స్పెషల్‌ సాంగ్‌
`కూలీ` సినిమాలో పూజా హెగ్డే స్పెషల్‌ సాంగ్‌ చేసింది. `మోనికా` అంటూ సాగే పాటలో ఆమె స్టెప్పులేసింది.ఈ పాట విశేష ఆదరణ పొందింది.
25
నాగ్‌ విలన్‌ అని తెలిసి రజనీకాంత్‌ షాక్‌

`కూలీ` తెలుగు ప్రెస్‌ మీట్‌ సోమవారం హైదరాబాద్‌లోని పార్క్ హయత్‌ హోటల్‌లో జరిగింది. ఈ ఈవెంట్‌కి రజనీకాంత్‌ హాజరు కాలేదు. కానీ వీడియో సందేశం పంపించారు. నాగార్జున ఇందులో విలన్‌ పాత్రని పోషిస్తారని తెలిసి షాక్‌ అయినట్టు చెప్పారు. అయితే మొదట ఈ పాత్రలో ఎవరు నటిస్తారనేది క్యూరియాసిటీగా అనిపించిందని, ఆరు నెలల తర్వాత దర్శకుడు లోకేష్‌ ఆ సీక్రెట్‌ని రివీల్‌ చేశారని, సైమన్‌గా నాగార్జున అని చెప్పినప్పుడు చాలా సర్‌ప్రైజ్‌ అయినట్టు తెలిపారు రజనీకాంత్‌. ఈ సందర్భంగా నాగ్‌ గ్లామర్‌, ఫిట్‌నెస్‌పై ప్రశంసలు కురిపించారు.

35
రజనీకాంత్‌ యాక్టింగ్‌ రహస్యాన్ని బయటపెట్టిన నాగార్జున

`కూలీ` ఈవెంట్‌లో నాగార్జున మాట్లాడుతూ, రజనీకాంత్‌కి సంబంధించిన ఒక రహస్యాన్ని వెల్లడించారు. `కూలీ` సినిమా షూటింగ్‌ టైమ్‌లో జరిగిన సంఘటన బయటపెట్టారు. బ్యాంకాక్‌లో క్లైమాక్స్ షూటింగ్‌ జరిగిందట.  దాదాపు 17 రోజులు షూట్‌ చేశారట. షిప్‌ మీద రాత్రి సమయంలో చిత్రీకరణ జరిపామని, కానీ ఆ సమయంలో కూడా షాట్‌ గ్యాప్‌లో రజనీకాంత్‌ వెళ్లి తన డైలాగ్‌లు ప్రాక్టీస్‌ చేస్తున్నారని,  సీన్ ఇంప్రవైజేషన్‌ చేస్తున్నారని తెలిపారు, దాదాపు యాభై ఏళ్లుగా ఆయన సినిమాల్లో ఉన్నారు. ఎన్నో బ్లాక్‌ బస్టర్స్ అందుకున్నారు. సూపర్‌ స్టార్‌గా రాణిస్తున్నారు. ఈ సమయంలో కూడా ఆయన డైలాగ్స్, సీన్స్ కోసం సెట్‌లో ప్రాక్టీస్‌ చేయడం ఆశ్చర్యంగా అనిపించిందన్నారు నాగార్జున.

45
బ్యాంకాక్‌లో రజనీకాంత్‌ చేసిన పని బయటపెట్టిన నాగ్‌

అంతేకాదు అక్కడ రజనీ చేసిన పనిని వెల్లడించారు నాగ్‌. బ్యాంకాక్‌ షూట్‌లో దాదాపు 350 మంది కాస్ట్ అండ్‌ క్రూ పాల్గొంది.  ఆ షెడ్యూల్‌లో చాలా కష్టపడాల్సి వచ్చింది. అయితే చివరి రోజు మొత్తం టీమ్ అందరినీ రజనీ సర్‌ పిలిచి తలా ఒక ప్యాకెట్ ఇచ్చి ఇంటికి వెళ్లేటప్పుడు పిల్లలకు ఏమైనా తీసుకెళ్లండి అన్నారు. అంత మంచి హృదయం ఉన్న వ్యక్తి ఆయన. ఆయనతో కలిసి పని చేయడం వండర్ ఫుల్ ఎక్స్ పీరియన్స్. రజనీతో కూర్చొని మాట్లాడటం చాలా మంచి అనుభూతినిచ్చింది. ఆయన సింపుల్‌నెస్‌ గురించి, వ్యక్తిత్వానికి సంబంధించి తాను చాలా నేర్చుకున్నానని వెల్లడించారు నాగార్జున.

55
చేతి వాచ్‌ స్మగ్లింగ్‌ నేపథ్యంలో `కూలీ` మూవీ

వాచ్‌ స్మగ్లింగ్‌ నేపథ్యంలో రూపొందిన `కూలీ` మూవీలో నాగార్జున విలన్‌గా నటిస్తున్నారు. ఇన్నాళ్లు హీరోగా కనిపించిన మన్మథుడు మొదటిసారి `కూలీ`లో విలన్‌గా నటిస్తున్నారు. సైమన్‌ అనే పాత్రలో కనిపించబోతున్నారు. రజనీకాంత్‌కి సమానంగా ఉండే రోల్‌ అని ఈ ఈవెంట్‌లో నాగ్‌ వెల్లడించారు. ఇక ఈ మాస్‌, యాక్షన్‌ మూవీ ఆగస్ట్ 14న విడుదల కాబోతుంది. భారీ స్థాయిలో సినిమాని రిలీజ్‌ చేస్తున్నారు. దీనికి పోటీగా బాలీవుడ్‌ చిత్రం `వార్‌ 2` కూడా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఈ రెండు చిత్రాల మధ్య గట్టి పోటీ ఉండబోతుందని చెప్పొచ్చు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories