Karthika deepam: కొడుకు బారసాలకు పిలిచినా మోనిత.. అందర్నీ తీసుకొస్తాను అంటూ షాక్ ఇచ్చిన వంటలక్క!

Sreeharsha Gopagani   | Asianet News
Published : Nov 19, 2021, 10:09 AM ISTUpdated : Nov 19, 2021, 10:35 AM IST

Karthika deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం ( Karthika Deepam) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ రేటింగ్ లో కూడా మొదటి స్థానంలో దూసుకెళ్తుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం.

PREV
112
Karthika deepam: కొడుకు బారసాలకు పిలిచినా మోనిత.. అందర్నీ తీసుకొస్తాను అంటూ షాక్ ఇచ్చిన వంటలక్క!

పిల్లలు సౌందర్య (Soundarya) దగ్గర కూర్చొని ఎక్కడికి వెళ్లట్లేదని ఒకప్పుడు ఎన్నో తిరిగాము అంటూ బాధపడతారు. ఇవాళ అమ్మ పుట్టినరోజు అంటూ గోల్కొండకి వెళ్దామని అనేసరికి అంతలోనే దీప (Deepa) వస్తుంది.
 

212

సౌందర్య దీపను (Deepa) చూసి ఇవాళ పుట్టినరోజా అని ప్రశ్నిస్తుంది. పిల్లలు గోల్కొండకి వెళ్దాం అంటున్నారని  అనేసరికి గోల్కొండకు కాదు అక్కడ పక్కన ఉన్న గోల్కొండ సమాధులను చూద్దాం అనేసరికి పిల్లలు, సౌందర్య (Soundarya) షాక్ అవుతారు.
 

312

అవి చరిత్రకు నిదర్శనమని ఎప్పటికైనా అందరం అక్కడికి వెళ్లాల్సిన వాళ్ళమే కదా అంటూ అపశకునం మాటలు మాట్లాడుతుంది దీప (Deepa). వెంటనే సౌందర్య (Soundarya) కోపంతో పుట్టినరోజు నాడు అక్కడికి వెళ్దాం అంటున్నావేంటని కోపం అవుతుంది.
 

412

వెంటనే పిల్లలు గుడికి వెళ్దామనేసరికి నానమ్మ, నాన్న గుడికి వెళ్లారంటూ సౌందర్యను షాక్ కు గురిచేస్తుంది. పిల్లలు దీపావళి ప్రత్యేకత గురించి అడుగగా అందులో దీప (Deepa) ప్రస్తుతమున్న పరిస్థితులను ఉద్దేశించి మాట్లాడేసరికి సౌందర్య (Soundarya)బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
 

512

సౌందర్య దీప మాటలను తలుచుకుంటూ బాధపడుతుంది. హిమ, సౌర్య (Hima, Sowrya) దీప కాసేపు సరదాగా మాట్లాడుకుంటుంది. ఈ పండుగ అంటే తనకు ఎంతో ఇష్టమని ఎందుకంటే తన పేరు కూడా దీప (Deepa) అని అంటుంది.
 

612

మరోవైపు సౌందర్య ( Soundarya) గదిలో కూర్చొని ఏడుస్తుండగా ఆనందరావు వచ్చి ప్రశ్నిస్తాడు. దీపని (Deepa) చూస్తే భయమేస్తుందని ఏమైపోతుందోనని బాధపడుతుంది. తన ప్రవర్తన మొత్తం విచిత్రంగా ఉందని ఏడుస్తుంది.
 

712

అవసరానికి మించిన సంతోషంతో దీప ఉంటుందంటూ అసలేం జరుగుతుందో తెలియటం లేదని బాధపడుతుంది. పిల్లలు గోల్కొండ చూడడానికి వెళ్దామంటే సమాధుల దగ్గరికి వెళ్దామని అన్నదని చెప్పేసరికి ఆనంద రావు (Ananda Rao) షాక్ అవుతాడు.
 

812

ఇక కార్తీక్ (Karthik)  ఇంటికి రాగానే దీప అందంగా రడీ అయ్యి షాక్ ఇస్తుంది. కార్తీక్ దీపని చూసి ఇంత కూల్ గా ఉందని అనుకుంటాడు. దీప దగ్గరికి వెళ్లగా దీప కొత్త కొత్త పేర్లతో పిలవడంతో కార్తీక్ ఏం మాట్లాడలేకపోతాడు. ఒక విషయం చెప్పాలని దీపతో (Deepa) అంటాడు.
 

912

ఏమైందని దీప అనటంతో నేనేం తప్పు చేయలేదు అంటూ దీప చేతులని పట్టుకుని ఆ మోనితే (Monitha) సహజ గర్భం అంటుందంటూ చెప్పగా దీప ఒకేసారి షాక్ తింటుంది. ఆ మోనిత అబద్ధం చెబుతుందని నా వల్ల ఎటువంటి తప్పు జరుగలేదని దీపతో (Deepa) చెప్పుకుంటాడు.
 

1012

దీప కోపంతో చూడటంతో కార్తీక్ (Karthik) భయపడుతూ ఉంటాడు. నువ్వు అవన్నీ నమ్మొద్దు దీప అంటూ నేను తప్పు చేయలేదు అంటూ నమ్ము దీప (Deepa)  అంటూ వేడుకుంటాడు. కానీ ఇదంతా కార్తీక్ దీపకు చెప్పుకున్నట్లు  ఊహించుకుంటాడు.
 

1112

దీప పిలవడంతో కార్తీక్ తేలుకుంటాడు. ఇక కుటుంబ సభ్యులంతా దీపావళి పండుగను జరుపుకుంటారు. అందరూ డల్ గా ఉండేసరికి దీప (Deepa) అందర్నీ ఆనందంగా ఉండమని కోరుకుంటుంది. అందరితో సరదాగా మాట్లాడుతుంది. కార్తీక్ (Karthik) తో టపాసులు కాల్చుతుంది.
 

1212

తరువాయి భాగం లో మోనిత (Monitha) వచ్చి తన బాబు బారసాల అని అందర్నీ రమ్మని కోరుకుంటుంది. వెంటనే దీప (Deepa) అందర్నీ తీసుకొచ్చే బాధ్యత నాది అంటూ రేపు అసలు క్లైమాక్స్ ఏంటో చూపిస్తాను అంటూ షాక్ ఇస్తుంది.

click me!

Recommended Stories