Missing review: మిస్సింగ్‌ తెలుగు మూవీ రివ్యూ..

First Published | Nov 18, 2021, 11:43 PM IST

 స్పెషల్‌ ప్రీమియర్‌ వేశారు. అందులో నటులు శివబాలాజీ, ఆయన భార్య మధుమిత, దర్శకుడు చందూమొండేటి వంటి పలువురు సినిమాని వీక్షించి ప్రశంసలు కురిపించారు. మరి వారు ప్రశంసించినట్టుగానే సినిమా ఉందా? లేదా? అనేది `మిస్సింగ్‌` సినిమా రివ్యూలో తెలుసుకుందాం. 

ఈ శుక్రవారం(November 19) పెద్ద సినిమాలు లేకపోవడంతో దాదాపు పది తక్కువ బడ్జెట్‌ సినిమాలు విడుదలవుతున్నాయి. అందులో ఒకటి `మిస్సింగ్‌`. అమ్మాయి మిస్సింగ్‌ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో నూతన నటీనటులు నటించారు. నూతన టెక్నీషియన్లు పనిచేశారు. ఈ చిత్రం శుక్రవారం రిలీజ్‌ అవుతుంది. అయితే అంతకంటే ముందే చిత్ర బృందం స్పెషల్‌ ప్రీమియర్‌ వేశారు. అందులో నటులు శివబాలాజీ, ఆయన భార్య
మధుమిత, దర్శకుడు చందూమొండేటి వంటి పలువురు సినిమాని వీక్షించి ప్రశంసలు కురిపించారు. మరి వారు ప్రశంసించినట్టుగానే సినిమా ఉందా? లేదా? అనేది `మిస్సింగ్‌` సినిమా రివ్యూలో తెలుసుకుందాం. 

కథః 

అమ్మాయి కిడ్నాప్‌తో సినిమా ప్రారంభమవుతుంది. కట్‌ చేస్తే గౌతమ్(హర్ష నర్రా)‌, శృతి(నికిషా) ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట కారులో ప్రయాణిస్తుంటారు. సడెన్‌గా ఎదురుగా వచ్చిన వాహనం కారణంగా యాక్సిడెంట్‌ అవుతుంది. దీంతో గౌతమ్‌ ఆసుపత్రిలో చేరతాడు. అది తన బావమరిది(శృతి తమ్ముడు)(సూర్య) ఆసుపత్రి. గౌతమ్‌ రెండు రోజుల తర్వాత కోమా నుంచి కోలుకుంటాడు. శృతి ఎక్కడుందని అడగ్గా మిస్సింగ్‌ అని చెబుతాడు డాక్టరైన శృతి తమ్ముడు. అతను కోలుకున్నాక శృతి కోసం వెతుకులాట ప్రారంభిస్తారు. ఇందులో గౌతమ్‌, అతని బావ మరిది, అలాగే కేసు విచారించే పోలీస్‌ అధికారి(చత్రపతి శేఖర్‌), ఇన్వెస్టింగ్‌ ఆఫీసర్‌ త్యాగి(రామ్‌ దత్‌) కలిసి శృతి కోసం వెతుకుతుంటారు. ఈక్రమంలో గౌతమ్‌, శృతిలను నలుగురు దుండగులు ఫాలో అవుతున్నట్టు గుర్తిస్తారు. వాళ్లని కనిపెట్టేందుకు హీరో బయలు దేరే లోపే ఆ వ్యక్తి చనిపోతాడు. ఇలా ముగ్గురు చనిపోతారు. మరి ఆ నాలుగో వ్యక్తి ఎవరు? గౌతమ్‌ కి ఉన్న జబ్బేంటి? గౌతమ్‌కి రిపోర్ట్ మీనా(మిషా నారంగ్‌)కి ఉన్న సంబంధం ఏంటి? అమ్మాయిల కిడ్నాప్‌కి, శృతి మిస్సింగ్‌కి కారణంగా ఎవరనేది మిగిలిన సినిమా కథ. 

Latest Videos


విశ్లేషణః 

`మిస్సింగ్‌` సినిమా ఆద్యంతం ట్విస్ట్ లు, టర్న్ లతో సాగే మిస్టరీ థ్రిల్లర్‌. కానీ సినిమాలో థ్రిల్లర్‌ ఎలిమెంట్స్ కంటే డ్రామా ఎలిమెంట్లే ఎక్కువగా కనిపిస్తాయి. రెండు లవ్‌ స్టోరీలు సినిమా మొత్తాన్ని డామినేట్ చేసినట్టుగా ఉంటాయి. సినిమాలో ట్విస్ట్ లు ఎక్కువగా ఉండటంతో ఆడియెన్స్ కి థ్రిల్‌ కంటే కన్‌ఫ్యూజనే ఎక్కువగా ఉంటుంది. దీంతో సినిమాలో ఏం జరుగుతుందో అర్థం కాక తలపట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది.  గౌతమ్‌, శృతి ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. అయితే శృతిని ప్రేమించడానికి ముందే గౌతమ్‌.. రిపోర్టర్‌ మీనాతో ప్రేమలో పడతాడు. ఆమె జాబ్‌ కోసం అమెరికా వెళ్లిపోతుంది. ఈ క్రమంలో గౌతమ్‌కి శృతి పరిచయం అవుతుంది. ఆమె కారణంగా గౌతమ్‌కి రోడ్డు ప్రమాదం జరుగుతుంది. దీంతో మెంటల్‌గా డిస్టర్బ్ అవుతాడు. మెమరీ లాస్‌ అవుతాడు(మల్టీపుల్‌ డిజార్డర్‌). తన పాత ప్రేమని మర్చిపోయి శృతితో ప్రేమలో పడతాడు. ఇవన్నీ మధ్య మధ్యలో ఫ్లాష్‌ బ్యాక్‌ రూపంలో చూపించారు. అయితే ట్విస్ట్ లుగా చూపించే ఈ ఫ్లాష్‌బ్యాక్‌లు ఎక్కువైపోవడంతో అసలు సినిమా కథ పక్కకెళ్లి ఆడియెన్స్ కి కన్‌ఫ్యూజన్‌ క్రియేట్‌ అవుతుంది. 

ఇక శృతి మిస్సింగ్‌కి సంబంధించి మాల్‌లో చూసిన ఫూటేజీ ఆధారంగా నలుగురు నిందితులుగా అనుమానించడం, వాళ్లు సడెన్‌గా చనిపోవడం, ముగ్గురుచనిపోగా, నాల్గొ వ్యక్తి హీరోనే అని ఇంటర్వెల్‌ ట్విస్ట్ గా చెప్పడం బాగుంది. కానీ ఆ థ్రిల్‌ ఎంత సేపు ఉండదు, మళ్లీ గత ఫ్యాష్‌ బ్యాక్‌లు చూపించడం, లవ్‌ స్టోరీలు రివీల్ చేయడం ఆడియెన్స్ కి విసుగు పుట్టిస్తుంది. దీనికితోడు అమ్మాయిల కిడ్నాప్‌కి గౌతమే కారణమని పోలీసులు తేల్చి అతన్ని అరెస్ట్ చేసిన క్రమంలో మరో హీరోయిన్‌ రిపోర్టర్‌ రూపంలో ఎంటరవుతుంది. మరిన్ని కన్‌ఫ్యూజన్స్ ని క్రియేట్‌ చేస్తుంది. పోలీస్‌లు అరెస్ట్ చేసిన గౌతమ్‌కి మల్టీపుల్‌ డిజార్డర్ జబ్బు ఉందని, దీని వల్లే హత్యలు చేయడం, కిడ్నాప్‌లు చేయడం చేస్తున్నారని పోలీసులు చెబుతారు. దీంతో తాను నమ్మలేకపోయిన గౌతమ్‌.. మొత్తానికి పోలీసుల నుంచి తప్పించుకుని రిపోర్టర్‌ మీనా సహయంతో మరో చోటుకి వెళినప్పుడు చివరగా హత్యలకు కారణం ఇన్వెస్టిగేషన్‌ ఆఫీసర్‌ త్యాగి అని చెప్పడం మరో ట్విస్ట్ గా వస్తుంది. 

నటీనటులు, టెక్నీషియన్లుః..
సినిమా కథ బాగానే ఉన్నా దాన్ని వెండితెరపై ఆవిష్కరించడంలో విఫలమయ్యాడు దర్శకుడు శ్రీని జోశ్యుల. ఎక్కువ ట్విస్ట్ లు పెట్టి ఆడియెన్స్ ని థ్రిల్‌కి గురి చేయాలనుకున్నప్పటికీ ఆ ట్విస్ట్ లు, ఫ్లాష్‌ బ్యాక్‌లు అర్థం కాక, కథని డీవియేట్‌ చేసినట్టుగా ఉండటంతో కన్‌ఫ్యూజన్‌ క్రియేట్ చేస్తాయి. సినిమాని ఒకలా తీయబోయే మరోలా తీశాడనే ఫీలింగ్‌ కలుగుతుంది. అయితే దర్శకుడికిది తొలి చిత్రం కావడంతో ఆ అనుభవ లేమి స్పష్టంగా కనిపిస్తుంది. రెండు లవ్‌ స్టోరీలు ఆడియెన్స్ ఓపికని పరీక్షిస్తాయని చెప్పొచ్చు. హీరో హర్షకిది కూడా నటనలో అనుభవ లేమి కనిపిస్తుంది. ఎమోషనల్స్ పలికించడంలో సక్సెస్‌ కాలేకపోయాడు. బలమైన పాత్ర అయినప్పటికీ దానికి న్యాయం చేయలేకపోయాడు. హీరోయిన్లలో నికిషా కేవలం గ్లామర్‌కే పరిమితం. మీనా పాత్రలో చేసిన మిషా నారంగ్‌ ఫర్వాలేదనిపించింది. మిగిలిన వాళ్లు తమ పాత్రల మేరకు ఫర్వాలేదనిపించారు. సంగీతం సినిమాకి ప్లస్‌ అని చెప్పొచ్చు. అజయ్‌ అరసడ ఆర్‌ఆర్‌ఆర్‌, మ్యూజిక్‌ ఆకట్టుకున్నాయి. కానీ పాటలు ఇరికించిన ఫీలింగ్‌ కలిగిస్తాయి. కెమెరామెన్‌ జనా బాగా చేశాడు. ఎడిటర్‌ సత్య మరికాస్త శ్రద్ధ పెట్టాల్సింది. 

ప్లస్ లుః

కొన్ని ట్విస్ట్ లు, 
మ్యూజిక్‌, ఆర్ఆర్‌

మైనస్‌లుః

ఫ్లాష్‌బ్యాక్‌లు, ట్విస్టులు
కన్‌ఫ్యూజన్‌ స్టోరీ
లవ్‌ స్టోరీలు 

ఫైనల్‌గాః మంచి కథ ఉన్నప్పటికీ దాన్ని సరిగ్గా తెరపై ఆవిష్కరించడంలో, ఆడియెన్స్ కి అర్థమయ్యేలా చెప్పడంలో `మిస్సింగ్‌`.

రేటింగ్‌ః 2

click me!