ప్రభాస్ నటించిన 'కల్కి 2898 AD' సినిమా లాస్ట్ గా రిలీజ్ అయింది. ఇప్పుడు 'ది రాజా సాబ్', 'కన్నప్ప', `ఫౌజీ` చిత్రాల్లో నటిస్తున్నాడు. వీటి తర్వాత `స్పిరిట్`, `సలార్ 2`, `కల్కి 2` చిత్రాలు చేయాల్సి ఉంది. అలాగే ప్రశాంత్ వర్మతోనూ ఓ మూవీ చేయనున్నారు.
ఇవి పూర్తి కావడానికి ఇంకా నాలుగైదేళ్లు పడుతుంది. అప్పటి వరకు ప్రభాస్ పెళ్లి చేసుకునే ఆలోచన లేదని తెలుస్తుంది. ఇంకా చెప్పాలంటే ప్రభాస్ పెళ్లి అనేది చేసుకోవడానికి ఆసక్తిగా లేడని టాక్.